టీడీపీ కాంగ్రెస్ పోత్తు పై చర్చ

కర్నూలు, జనవరి3 : ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ ఎన్. రఘవీరా రెడ్డి ఈ రోజు ఢీల్లీలో జరిగే సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరుకానున్నారు. ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలా వద్దా అనే అంశంపై అధిష్టానంతో రఘవీరారెడ్డి ప్రధానంగా చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తుంది.

కర్నూలులో గురువారం ఉదయం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో రఘవీరా మాట్లాడుతూ టీడీపీతో పొత్తుపై ఏఐసీసీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ, ఏపీ రాష్ట్ర ఇన్‌చార్జ్ ఒమెన్ చాందీ, ఇతర సీనియర్ నేతలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుమటామని ఆయన చెప్పారు. రఘవీరారెడ్డి చేసీన ఈ ప్రకటనపై రాజకీయవర్గల్లో చర్చ జరుగుతోంది. రేపు ఏం నిర్ణయం వెల్లడిస్తారనే అంశంపై ఉత్కంఠత నెలకొంది