Tamilnadu: తమిళనాడు కరెక్టేనా..? అందరూ అలానే ఆలోచిస్తే పరిస్థితేంటి..?

tamilnadu urged pm to cancel oxygen to telugu states
Share

Tamilnadu: తమిళనాడు Tamilnadu: సీఎం పళనిస్వామి హెల్త్ ఆక్సిజన్ కోసం ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖ సంచలనం రేపుతోంది. పెరంబదూరులో ఉత్పత్తవుతున్న ఆక్సిజన్ లో తెలుగు రాష్ట్రాలకు సరఫరా అవుతున్న 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ నిలిపేయాలని.. తమకే కేటాయించేలా ఆదేశాలివ్వాలని లేఖలో కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో 310 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరానికి 400 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి అవతోందని.. తమకు కేంద్రం కేటాయించింది 220 మెట్రిక్ టన్నులేనని అన్నారు. ప్రతిరోజూ పెరుగుతున్న కేసులతో భవిష్యత్తులో 450 మెట్రిక్ టన్నుల అవసరం పడుతుందని తెలిపారు. అయితే.. ఈ లేఖ ప్రకారం చూస్తే భవిష్యత్తులో ఒక దేశంలోని రాష్ట్రాల మధ్యే పోటీ నెలకొనేలా ఉందని చెప్పాలి.

tamilnadu urged pm to cancel oxygen to telugu states
tamilnadu urged pm to cancel oxygen to telugu states

ప్రస్తుతం దేశంలో రోజుకి 3.50 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కేసుల తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో.. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ లభ్యత అంతకంటే ఆందోళన కలిగిస్తోంది. ఆక్సిజన్ అందకే ఢిల్లీ, రాజస్థాన్, ఏపీలో.. మరణాలు సంభవించాయి. ఇది తీవ్రంగా పరిగణించే అంశం. దీంతో విదేశాల నుంచి కూడా ఆక్సిజన్ తెప్పించుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల మధ్య సర్దుబాటు కావాల్సిన ఆక్సిజన్ పై తమిళనాడు.. మా రాష్ట్రంలోని ఆక్సిజన్ మాకే కావాలి అనడం రాబోయే పోటీకి సంకేతమనే చెప్పాలి. ఫస్ట్ వేవ్ లో భారత్ నుంచి సాయం పొందిన అమెరికా వ్యాక్సిన్ తయారీకి అవసరమయ్యే ముడి సరుకుని ఇవ్వమని తెగేసి చెప్పింది. భారత్ ఒత్తిడి మేరకు మెత్తబడి ముడిసరుకు పంపిస్తోంది.

అయితే.. ముందు మా అవసరాలే ముఖ్యం అని అమెరికా అనడం వేర్వేరు దేశాల మధ్య అంశం. కానీ.. ఒకే దేశంలో ఇరుగు పొరుగు రాష్ట్రాలయ్యుండి కూడా.. మా అవసరాలు తీరాకే అనడమే విచిత్రం. విశాఖ ఉక్కు పరిశ్రమలో ఉత్పత్తి అవుతున్న ఆక్సిజన్ ను ఏకంగా రైళ్లలో వివిధ దేశాలకు తరలిస్తున్నారు. మా రాష్ట్రంలో ఉంది కాబట్టి ఆ ఆక్సిజన్ అంతా మాకే అని ఏపీ అనలేదు. ఇప్పటికే తమ రాష్ట్రంలోకి ఎంట్రీ కావడానికి ఏపీ, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు చెక్ పెట్టింది తమిళనాడు. మేలో కేసులు ఇంకా పెరుగుతాయనే వార్తల నేపథ్యంలో ఇలాంటి డిమాండ్లు మరింత వస్తే ప్రమాదమే.

 


Share

Related posts

దుబ్బాక వెళ్ళొద్దాం.. రాజకీయం చూద్దాం రండి..!! (గ్రౌండ్ రిపోర్ట్)

Srinivas Manem

తప్పులుంటే గుండు చేయించుకుంటా! – కుటుంబరావు

somaraju sharma

ఒక్కసారిగా రంగంలోకి దిగిన నిమ్మగడ్డ..! ఇక వారి అరెస్టు తథ్యం..?

arun kanna