NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

మత రాజకీయం..! టీడీపీ × వైసీపీ మధ్యలో బీజేపీ

 

(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులు ప్రతిపక్షాలకు ఆస్త్రాలుగా మారుతున్నాయి. ప్రభుత్వం ఇరుకున పడే పరిస్థితి ఏర్పడుతోంది. అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనర్శింహస్వామి వారి రథం తగులబడిన సంఘటన మరువక ముందే విజయవాడ ప్రాంతంలో మరో ఘటనలు చోటుచేసుకున్నాయి. విజయవాడ కనకదుర్గ అమ్మవారి వెండి రథంకు ఉన్న మూడు వెండి సింహాలు మాయం కావడం, అది వెలుగు చూసిన రోజు రాత్రే విజయవాడ రూరల్ మండలం నిడమానురులోని సాయి మందిర ఆవరణలోని సాయిబాబా విగ్రహాం ధ్వంసం ఘటన జరగడం తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. ఈ ఘటనలపై బిజెపి, హింధూ సంఘాలు తీవ్ర స్థాయిలో ఆందోళనలు, నిరసనలు తెలుపుతున్నారు. మరో పక్క ఘటనలపై ప్రతిపక్ష, ఆధికార పక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కులాలు, మతాలను అడ్డం పెట్టుకోని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించగా ఆలయాలపై జరిగిన దాడులపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తూ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించారు.

Chandrababu Naidu

చంద్రబాబు ఏమన్నారంటే….

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత ఆలయాలపై దాడులకు సంబంధించి 80 ఘటనలు జరిగాయనీ, భక్తుల మనోభావాలతో ఆటలాడుకోవాలని చూడటం దుర్మార్ఘమనీ అన్నారు. రాష్ట్రంలో వరుస సంఘటనలు జరుగుతుంటే సీఎం ఏమిచేస్తున్నారనీ ప్రశ్నించారు. మత సామరస్యం కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని మండిపడ్డారు. మొదటి ఘటన జరిగినప్పుడే ప్రభుత్వం సరైన విధంగా స్పందించి ఉంటే ఇలాంటివి పునరావృత్తం అయ్యేవి కావు, ఇప్పుడు ఆలయాలపై దాడులు చేసిన వాళ్లు రేపు మసీదులపై, చర్చిలపైనా దాడులు చేస్తారని అన్నారు.

సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే…

చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ సున్నితమైన అంశాలలో వివాదాన్ని రేపి విద్వేశాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని విమర్శించారు సజ్జల రామకృష్ణారెడ్డి. గ్రామాల్లో జరిగిన ఘటనలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వంపై బురద చల్లడమే ఎజండాగా పెట్టుకున్నారని విమర్శించారు. అంతర్వేది ఘటనపై ప్రభుత్వం వెంటనే సీబీఐ విచారణకు ఇవ్వడం జరిగిందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.

 

 

author avatar
Special Bureau

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju