NewsOrbit
ట్రెండింగ్ రాజ‌కీయాలు

Tdp-Cpi: పొత్తు ఎంతవరకూ మేలు..! బెజవాడలో ప్రభావం చూపేనా..?

Tdp-Cpi: పొత్తు ఎంతవరకూ మేలు..! బెజవాడలో ప్రభావం చూపేనా..?

Tdp-Cpi: టీడీపీ-సీపీఐ Tdp-Cpi సీపీఐ పార్టీ మళ్లీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంది. అయితే.. 2024 ఎన్నికల లక్ష్యంగా ఈ పొత్తు కాదు. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్టు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. విజయవాడ మహానగరం అభివృద్ధి కోసమే ఈ పొత్తు అని అన్నారు. ఈ రెండు పార్టీలు కలసి పొత్తు పెట్టుకోవడం ఇదేం కొత్త కాదు. గతంలో కూడా ఈ రెండు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాయి. అయితే.. టీడీపీ-సీపీఐ పొత్తు ఏమేర లాభిస్తుందనేది చూడాల్సి ఉంది.

Tdp-Cpi alliance in municipal elections
Tdp-Cpi alliance in municipal elections

ఎన్నికల సమయంలో ఈ రెండు పార్టీల మధ్య ఉండే పొత్తు తర్వాత కొనసాగలేదు. పైగా.. అధికారంలో లేని టీడీపీ ఇప్పుడు పోరాడుతోంది. అధికారంలో ఉన్న పార్టీకి ఎప్పుడూ వ్యతిరేకంగా ఉండే సీపీఐ ఇప్పుడూ అదే చేస్తోంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి వ్యతిరేకంగానే ఉంది. జనసేనతో పొత్తు పెట్టుకుని 2019లో ఎన్నికలకు వెళ్లింది. ఇలా ప్రజా సమస్యలపై నిత్యం పోరాడే సీపీఐ ప్రతి ఎన్నికల సమయంలో పొత్తులుకు వెళ్లడం కొత్తేమీ కాదు. కాకపోతే మిత్రుత్వం – శత్రుత్వం – మిత్రుత్వం అనే కాన్పెప్ట్ చుట్టూనే తిరిగే రాజకీయాల్లో పార్టీలకు ఇది తప్పనిసరి అయింది. బీజేపీ, వైసీపీకి వ్యతిరేకంగానే ఇప్పుడు టీడీపీతో కలిసి సీపీఐ ముందుకువెళ్తోంది.

గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఇతర పార్టీల అభిప్రాయాలపై కన్నెత్తి చూసింది లేదు. 2014లో కలిసి పోటీ చేసిన జనసేన, బీజేపీలతో కూడా తర్వాతి కాలంలో విభేధించారు. ఇందుకు సీపీఐ కూడా మినహాయింపు ఏమీ కాదు. ఇప్పుడు టీడీపీ పోరాడుతోంది. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులతో పోటీ లేదు కాబట్టి ఎవరి లెక్కలు వారు చెప్పుకున్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరుగబోతున్నాయి. పార్టీ గుర్తులపై జరుగుతున్నాయి కాబట్టి.. టీడీపీ కూడా సీపీఐతో కలిసి జత కట్టింది. ఇదే పొత్తును 2024లో కూడా టీడీపీ-సీపీఐ కంటిన్యూ చేస్తుందా అనేది సందేహమే. ప్రస్తుత మునిసిపల్ ఎలక్షన్లే వారి టార్గెట్. మరి ఏమేర ఫలితాలు రాబడతాయో ఈ రెండు పార్టీలు చూడాలి.

 

author avatar
Muraliak

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?