NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

TDP Internal News: బాబోరు బావురుమన్నారు..! నెలలో రెండు సాను”భూతులు” – టీడీపీ ఆశలు..!

TDP Internal News: Babu Crying - Two Sympathy Politics for TDP

TDP Internal News: టీడీపీకి కాలం కలిసి రాలేదు.. గత నెలలో ఆ పార్టీ కార్యాలయంపై దాడి జరిగింది.. నిన్న చంద్రబాబు ఏడ్చారు.. మొన్న మున్సిపల్ ఎన్నికలు, పరిషత్ ఉప ఎన్నికలు ఓడిపోయారనే వాదనలు పైకి వినిపిస్తే వినిపించవచ్చు.. కానీ టీడీపీ బలోపేత ఆశలకు ఈ సంఘటనలే ఆయువు పోస్తాయని ఆ పార్టీ లెక్కలివే ఏసుకుంటుంది.. సానుభూతి డ్రామా చక్కగా పండిందని.. ఈ రెండు సానుభూతి అంశాలతో టీడీపీకి ఎక్కువ మార్కులు పడ్డాయని.. టీడీపీ వర్గాల్లో కసి, ఆవేశం, ఆవేదన రావడంతో పాటూ న్యూట్రల్ వర్గాలు కూడా టీడీపీ వైపు చూస్తున్నారనే ఆశలు, ఊహల్లోకి ఆ పార్టీ వెళ్ళింది.. అందుకే ఆ సానుభూతిని ఇంకా కొనసాగించాలని ప్రణాళికలు వేసుకుంటుంది..! పార్టీ పుంజుకోవడానికి కొన్ని వీటికి ఆధారాలు, సాక్షాలు కూడా కనబడుతున్నాయి. ఆ కారణాలు ఏమిటీ ? టీడీపీ వాటిని ఎలా వాడుకుంది?అనే విషయాలను పరిశీలిస్తే..

TDP Internal News: పార్టీ ఆఫీస్ పై దాడి తర్వాత..!

మొదటిది తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి జరగడం. వైసీపీ వాళ్లు వాళ్ల తప్పును వాళ్లే బయటపెట్టుకునారు.. దీంతో టీడీపీకి సానుభూతికి అవకాశం పెరిగింది. దేశ రాజకీయాల్లో ఎక్కడా ఓ రాజకీయ పార్టీ కార్యాలయంపై దాడి జరిగిన ఘటనలు లేవు. కానీ టీడీపీ ఆఫీసు మీద దాడి చేయడం, అది మేమే చేశామని వైసీపీ చెప్పుకోవడంతోే టీడీపీలో కసి వచ్చింది. ఒక ఆవేదన వచ్చింది. వారిలో తెగింపు వచ్చింది. రాష్ట్రంలో వరుస పరాజయాల నేపథ్యంలో నిర్యాశ్యంలో ఉన్న పార్టీ క్యాడర్ కూడా ఈ ఘటనతో యాక్టివ్ అయ్యారు. అందుకే వాళ్లు పోరాటానికి సిద్ధమైయ్యారు. మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో ఫలితాలను చూసుకుంటే.. ఎనిమిది జడ్ పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ మూడు చోట్ల గెలిచింది. అయిదు చోట్ల వైసీపీ గెలిచింది. మిగిలిన మూడు వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. ఎంపీటీసీ స్థానాల విషయానికి వస్తే 33 స్థానాలు టీడీపీ గెలుచుకోగా, 70 ఎంపీటీసీలను వైసీపీ గెలిచింది. ఓటింగ్ శాతం చూసుకున్నట్లయితే 40 నుండి 41 శాతం టీడీపీకి వచ్చింది. ఏడు నెలల క్రితం టీడీపీకి కేవలం 29, 30 శాతం మాత్రమే ఉండగా పది, 12 శాతం ఓటింగ్ టీడీపీకి పెరిగింది. ఈ ఓటింగ్ శాతం చూస్తే కొంత మేర టీడీపీ పుంజుకున్నట్లు స్పష్టం అవుతోంది. టీడీపీ కార్యాలయంపై దాడితో పార్టీ క్యాడర్ చురుకవ్వడంతో కొంత మేర పుంజుకుందని లెక్కలు వేసుకుంటున్నారు. పార్టీ పుంజుకునే దారిని టీడీపీ వెతుక్కుంది. ప్రజల్లో న్యూట్రల్ వర్గాల్లో ఆలోచన వచ్చిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

TDP Internal News: Babu Crying - Two Sympathy Politics for TDP
TDP Internal News Babu Crying Two Sympathy Politics for TDP

బాబోరి బావురుకి మరో సానుభూతి..!!

ఇక నిన్న చంద్రబాబు నాయుడు భావోద్వేగం, ఏడుపు సీన్. అసెంబ్లీలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరు అన్ని వర్గాలకు నచ్చట్లేదు. భువనేశ్వరి మీద సాధారణ ప్రజల్లో గానీ, రాజకీయ వర్గాల్లో గానీ ఓ రకమైన గౌరవం ఉంది. ఆమె ఇప్పటి వరకూ ఏ ఎన్నికల్లోనూ టీడీపీ తరపున ప్రచారం చేయడం గానీ తన భర్తకు, కుమారుడికి ఓటు వేయమని కోరడం గానీ, టీడీపీకి ఓట్లు వేసి గెలిపించాలని రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రచారం చేయడం చేయడం జరగలేదు. అటువంటి ఆమెను సభలో అలా అనడం, లోకేష్ ఎలా పుట్టాడు చంద్రబాబు అన్న వాయిస్ కూడా బయటకు వచ్చింది. అందుకే చంద్రబాబు మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇది
కూడా టీడీపీకి ఒక అవకాశమే. టీడీపీ వర్గాల్లో నిన్నటి నుండి భాద, ఆవేదన వ్యక్తం అవుతోంది. వైసీపీ వాళ్లు ఆ ఏడుపును సానుభూతి డ్రామా అని విమర్శిస్తున్నా, ప్రీ ప్లాన్డ్ పొలిటికిల్ స్కెచ్ అని అభివర్ణిస్తున్నా టీడీపీ వర్గాల్లో మరింత కసి పెంచింది.

TDP Internal News: Babu Crying - Two Sympathy Politics for TDP
TDP Internal News Babu Crying Two Sympathy Politics for TDP

ఇక్కడ మరో విషయం కూడా గమనించాలి. రాష్ట్రంలో వైసీపీ కంటే తెలుగుదేశం పార్టీకి సంస్థాగతంగా స్ట్రాంగ్ పునాదులతో ఉంది. వైసీపీకి పునాదులు అంటూ ఏమీ లేవు, కాంగ్రెస్ పునాదులపై నిల్చోని ఉంది. ఇది ఆ పార్టీ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దాదాపు 30, 40 సంవత్సరాల నుండి టీడీపీకి సానుభూతిగా ఉన్న వాళ్లు ఇప్పుడు చంద్రబాబు పాదయాత్ర చేసినా.., రథ (బస్సు) యాత్ర చేసినా ప్రజల్లోకి వెళ్లి ఇదే చెప్తారు. మళ్ళీ మళ్ళీ ఏడ్చినా, ఏడుస్తారు..! ఈ రెండు ఘటనలను అందిపుచ్చుకుని చంద్రబాబు ఆరు నెలల పాటు ప్రజల్లో ఉండే విధంగా భారీ యాత్రకు సన్నద్దం అవుతున్నారని సమాచారం అందుతోంది. డిసెంబర్ నుండి గానీ లేక జనవరి నుండి ఆరు ఏడు నెలల పాటు ప్రజల్లో ఉండేలా ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారుట. పాదయాత్ర చేయడానికి ఆయన వయస్సు, ఆరోగ్యం సహకరించే పరిస్థితులు లేనందున బస్సు యాత్రకే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చంద్రబాబు జనాల్లోకి వెళితే.. సానుకూల పవనాలు వీస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

author avatar
Srinivas Manem

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju