TDP – Janasena: పొత్తు ఖరారు..! “టీడీపీ – జనసేన – వామపక్షాలు”..! జనవరి నుండి మూకుమ్మడి పోరాటాలు..!?

TDP - Janasena: Alliance Confirmed But..!?
Share

TDP – Janasena: ఏపీలో ఒక కొత్త రాజకీయ కూటమి జత కట్టబోతుంది.. పాత పార్టీలే అయినప్పటికీ.. కొత్తగా.., కూటమిగా జత కట్టబోతున్నాయి..! ఈ మేరకు చర్చలు, సంప్రదింపులు దాదాపు ఖరారయ్యాయి. జనవరి నుండి ఉమ్మడి పోరాటాలు, ఉద్యమాలు చేయాలని ఆల్రెడీ కొన్ని ప్రణాళికలు కూడా సిద్ధం చేశాయి..! జనసేన – టీడీపీ – వామపక్షాల మధ్య ఈ పొత్తుకు సంబంధించి కొన్ని కీలక చర్చలు తుది దశలో ఉన్నట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం..!

TDP – Janasena: సీట్లు కూడా దాదాపు ఖరారైనట్టే..!?

ఈ పొత్తు ఈ సారి చాలా పకడ్బందీగా ఉండబోతుంది. చాలా ప్రణాళికాబద్ధంగా ఉండబోతుంది. ప్రజాక్షేత్రంలో బలంగా ఉన్న సీఎం జగన్ ని, వైసీపీని ఓడించాలంటే ఈ పక్షాలు కూటమిగా ఏర్పడాల్సిన అవసరాన్ని ముందుగా టీడీపీ గుర్తించింది. వాళ్లకు అవసరం కూడా.. జనసేనతో పొత్తు లేకపోతే ఎక్కువగా నష్టపోయేది ఆ పార్టీనే.. అందుకే టీడీపీ పెద్దలు పవన్ కళ్యాణ్ కి వలలు వేయడం.., ఆయన పడడం అన్నీ చాకచకా జరిగిపోయాయి. అయితే ఇంకా చాలా సమయం ఉంది. ఈ లోగా మనం ఎన్ని చెప్పుకున్నా పుకార్లుగానే ఉంటుంది. ఇప్పటికి పుకార్లుగా కొట్టిపారేసినా… మాకున్న అత్యంత నమ్మకమైన సోర్సుల ప్రకారం ఈ కూటమి పొత్తుని ఖరారయినట్టు తెలిసింది. ఇప్పటికీ సీట్ల విషయంలో కూడా ఒక అవగాహనకు వచ్చారు. జనసేన 25 నుండి 30 స్థానాల్లో పోటీ చేయడానికి ఆయన స్థానాలు కూడా గుర్తించి బలమైన అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉంది. మరోవైపు వామపక్షాలకు 7 సీట్లు ఇవ్వడానికి టీడీపీ సిద్ధంగా ఉంది. ఈ పార్టీలు కూడా కొన్ని స్థానాలను కోరుతున్నాయి. మరోవైపు దాదాపు 25 నియోజకవర్గాల్లో ఫ్రెండ్లి పోటీ ఉండేలా మాట్లాడుకున్నట్టు సమాచారం. టీడీపీ తరపున ఎన్నికల వ్యూహకర్తగా రంగంలోకి దిగిన రాబిన్ శర్మ ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాలను, కొందరు కీలక నేతలను గుర్తించి.. వారితో సంప్రదింపులు జారుతున్నట్టు సమాచారం. ఇవన్న్నీ ప్రస్తుతానికి అంతర్గతమే అయినా.. మరో ఆరు నెలల్లో ఒక్కో మూడీ విప్పనున్నారు. బయటపెట్టనున్నారు..!

TDP - Janasena: Alliance Confirmed But..!?
TDP – Janasena: Alliance Confirmed But..!?

బీజేపీతో కటీఫ్..! కారణం ఇదే..!?

ఇక ప్రస్తుతం జనసేన – బీజేపీ పొత్తు ఆట ఆడుకుంటున్నాయి. ఈ రెండు పార్టీలు ఉండగా.., జనసేన టీడీపీతో ఎలా అనేది చాలా మందిని సందేహం ఉండవచ్చు.. మరో రెండు నెలల్లో ఈ రెండు పార్టీలు విడాకులు తీసుకోబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పెద్దలకు ఒక వర్తమానం కూడా పంపించినట్టు తెలుస్తుంది. పొత్తు వద్దు.. ఎన్నికల తర్వాత అవసరం మేరకు కలుద్దాం అని చెప్పినట్టు తెలుస్తోంది. “జనసేన – బీజేపీ ఉమ్మడి కార్యక్రమాలంటూ ఏం పెడుతున్నా జనసేన తప్ప,., బీజేపీ హడావిడి కనిపించడం లేదు. బీజేపీ జెండాలు కూడా జనసేన కార్యకర్తలే మోయాల్సి వస్తుంది. క్షేత్రస్థాయిలో జెండా పట్టుకునే కార్యకర్తలు కూడా లేని పార్టీతో ఎన్నికలకు వెళ్లలేం.. ఎన్నికలు ముగిశాక మళ్ళీ మాట్లాడుకుని ఫ్రెండ్లి అవగాహన కుదుర్చుకుందాం” అంటూ జనసేన పెద్దల ద్వారా ఢిల్లీ బీజేపీ నేతలకు ఒక రాయబారం పంపించినట్టు తెలుస్తుంది. దీనిపై మరింత స్పష్టత ఇచ్చి.. అధికారికంగా విడాకులు పొందడానికి వచ్చే నెలలో పవన్ ఢిల్లీ వెళ్లనున్నట్టు సమాచారం. బద్వేలు ఉప ఎన్నికలో కూడా బీజేపీకి జనసేన నుండి ఏం సహకారం లేదు. పొత్తు ధర్మం మేరకు కనీసం బీజేపీ వాళ్ళు కూడా ఎక్కడా జనసేన జెండా, కనిపించనీయలేదు.. ఈ ఎన్నికలకు ముందే జనసేన – బీజేపీ విడాకులపై మొదటి విచారణ పూర్తయినట్టు తెలుస్తుంది. మొత్తానికి డిసెంబర్ నెలాఖరుకి బీజేపీతో తెగదెంపులు చేసుకుని.. జనవరి లేదా మార్చి నాటికి టీడీపీ – వామపక్షాలతో కలిసి అడుగులు వేయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నట్టు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి..!


Share

Related posts

“భూమా – భూమి” ఎవరు కుట్రదారులు..!? ఎవరు అమాయకులు..!!?

Muraliak

65000కోట్ల సినిమా : జగన్ ని ఒక్కమాట అనకుండా .. బుగ్గన ని టోటల్ టార్గెట్ చేస్తున్నారు .. !

sekhar

బ్రేకింగ్ : విశాఖలో మరో ఘోర ప్రమాదం…! ఫార్మాసిటీలో భారీ పేలుడు…. మంటల్లో చిక్కుకున్న జనం?

arun kanna