TDP Janasena: పవన్ కళ్యాణ్ కి సీఎం సీటు..!? నిజమెంత..!?

TDP Janasena: CM Seat offer for Pavan Kalyan.. is it True..!?
Share

TDP Janasena: రాష్ట్రంలో ప్రస్తుతం చూసుకుంటే మాత్రం కాస్త ప్రజాబలమున్న నేత జగన్ మాత్రమే.. 151 మంది సీట్లు, 156 లక్షల ఓట్లతో సీఎంగా గెలిచి.. తోచినంతగా అప్పులు చేసి సంక్షేమాన్ని నమ్ముకున్న జగన్ వచ్చే ఎన్నికల్లో కూడా సింపుల్ గా గెలవాలనే ప్రయత్నాల్లో ఉన్నారు.. కానీ..! టీడీపీ పరిస్థితి చావో రేవో అనేలా మారింది. చంద్రబాబు శపథం, టీడీపీ కార్యకర్తల్లో భయం.. నాయకుల్లో అధైర్యం.. అన్నీ ఆ పార్టీకి ఇబ్బంది పెట్టేవే.. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే పార్టీ బతకడమే కష్టం.. అందుకే పొత్తులు, ఎత్తులు, కత్తులు అంటూ రకరకాల ప్రయత్నాలు చేస్తుంది..! ఈ క్రమంలోనే…

రాష్ట్రంలో జనసేన, టీడీపీ ల మధ్య పొత్తులకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని వార్తలు వినబడుతున్నాయి. దీనికి సంబంధించి రకరకాల పుకార్లు బయటకు వస్తున్నాయి. పొత్తు ఉంటుందని కొంత మంది, పొత్తు ఉండదు అని కొంత మంది వాదిస్తున్నారు. మరో పక్క ఇటీవల చంద్రబాబు వన్ సైట్ లవ్ అని వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత ఆయన ఆ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరిస్తూ పొత్తుల విషయం ఇప్పుడే చెప్పేది కాదన్నారు. అధికార వైసీపీని ఓడించడానికి అందరూ కలవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు చెప్పారు. అయితే జనసేనతో పొత్తు విషయంపై చంద్రబాబు క్లారిటీ ఇవ్వలేదు. కార్యకర్తలు మాత్రం ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు. మరో పక్క జనసేన – టీడీపీ పొత్తుపై అనేక రకాల వదంతులు ప్రచారంలో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కు సీఎం సీటు అడుగుతున్నారనీ, దానికి టీడీపీ ఒప్పుకుంటే జనసేన పొత్తు పెట్టుకోవడానికి సిద్దమేనన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే దీనిలో వాస్తవాలు ఏమిటి…? జనసేన పార్టీలో పెద్దల వద్ద ఉన్న అంతర్గత సమాచారం ఏమిటి..? పార్టీలో పవన్ కళ్యాణ్ సీఎం అనే చర్చ ఉందా..? లేదా విషయాలను పరిశీలిస్తే…!

TDP Janasena: CM Seat offer for Pavan Kalyan.. is it True..!?
TDP Janasena: CM Seat offer for Pavan Kalyan.. is it True..!?

TDP Janasena: టీడీపీదే బలం.. కానీ జనసేనా…?!

వాస్తవానికి టీడీపీ – జనసేన పొత్తు పెట్టుకుంటే దీనిలో 75 శాతం పాత్ర టీడీపీదే. 25 శాతం మాత్రమే జనసేన. 145 సీట్లలో టీడీపీ పోటీ చేస్తే 35 లేదా 40 సీట్లలో జనసేన పోటీ చేస్తుందన్న అంచనా ఉంది. అలా కాదు 140 సీట్లలో జనసేన పోటీ చేసే సత్తా ఉందా..? అంటే అంత సత్తా లేదు. ఆర్ధిక వనరులు లేవు. అంత నాయకత్వ బలం లేదు. అంత పోల్ మేనేజ్ మెంట్ చేసే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ప్రస్తుతం టీడీపీకి ఉన్న బలం వేరు. జనసేనకు ఉన్న బలం వేరు. టీడీపీ బలం 70 శాతం అనుకుంటే జనసేన బలం 30 నుండి 35 శాతం కింద వేసుకోవచ్చు. వాళ్ల పోటీ అయినా, వాళ్ల సీట్ల పంపకాలు అయినా, వాళ్ల ఆర్ధిక వనరులు ఏదైనా ఇలానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సీఎం సీటు ఇవ్వడానికి టీడీపీ ఎందుకు ఒప్పుకుంటుంది..!? కచ్చితంగా ఒప్పుకోదు. అయితే జనసేన పెద్దలు కూడా పవన్ కళ్యాణ్ కు సీఎం పదవి కావాలని అడగడం లేదని సమాచారం. పవన్ కళ్యాణ్ సీఎం కావాలి అనుకుంటున్నది జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులతో ఆ సామాజికవర్గంలోని కొందరు నాయకులు. నిజానికి 175 నియోజకవర్గాల్లో 88 సీట్లు గెలిచి సీఎం అయ్యే సత్తా ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ కు లేదు అనేది అందరికీ తెలిసిందే. ఈ విషయం ఆ పార్టీకి కూడా తెలుసు. జనసేన పార్టీ పొత్తు లేకుండా పోటీ చేస్తే అయిదు నుండి పది స్థానాలు వరకూ మాత్రమే గెలుచుకునే అవకాశం ఉంటుంది కానీ అంతకు మించి ఏమి గెలుచుకోలేరు. 2019 ఎన్నికల్లో ఒకటే గెలిచారు. ఇప్పుడు బలం పెరిగింది అనుకుంటే అన్నిరకాలుగా పోటీ చేయాలనుకుంటే 10 వరకు గెలుచుకోవచ్చు. ఇటువంటి పార్టీకి సీఎం పదవి ఎలా ఇస్తారు..!? ఒక వేళలో పొత్తులో భాగంగా 25 లేదా 30 సీట్లు పోటీ చేసి మొత్తం గెలిచినా సీఎం పదవి ఇవ్వడానికి టీడీపీ అంగీకరించే అవకాశం లేదు..!

TDP Janasena: CM Seat offer for Pavan Kalyan.. is it True..!?
TDP Janasena: CM Seat offer for Pavan Kalyan.. is it True..!?

TDP Janasena: బాబుకి ఇదే చివరి అవకాశం..!!

మరో పక్క చంద్రబాబుకు సీఎం అవ్వడానికి ఇదే చివరి అవకాశం. ప్రస్తుతం ఆయన వయస్సు 72, ఆ తరువాత 78 సంవత్సరాలకు సీఎం గా ఆయన చేయలేరు. జీవితంలో చివరి సారిగా సీఎం అవ్వాలన్న కోరిక ఆయనకు ఉంటుంది, ఆ పార్టీ వాళ్లకు ఉంటుంది. ఇప్పుడు ఏన్నో అవమానాలు ఎదుర్కొన్నారు కాబట్టి సీఎం గా చివరి సారి చేయాలన్న కోరిక ఆయనకు బలంగా ఉంటుంది. జనసేన పెద్దల్లో కూడా ప్రస్తుతం పొత్తులో భాగంగా ఆ డిమాండ్ చేయడం లేదు కానీ చివరి రెండు సంవత్సరాలు సీఎం పదవి పవన్ కళ్యాణ్ కు ఇస్తే బాగుంటుంది అన్న అభిప్రాయం ఉంది. మొదటి మూడు సంవత్సరాలు చంద్రబాబు చేసి చివరి రెండు సంవత్సరాలు పవన్ కళ్యాణ్ కు ఇవ్వాలన్న ఒక ప్రతిపాదన జనసేన పార్టీలో ఉంది. ఇది కాకుండా పవన్ కళ్యాణ్ కు డిప్యూటి సీఎం ఇవ్వడంతో పాటు పవన్ కళ్యాణ్ ఆలోచనలకు పెద్ద పీట వేసేలా, ఆయన సిద్దాంతాలు ప్రభుత్వంలో అమలు చేయాలన్నది మరో ప్రతిపాదన ఉందని అంటున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడానికి ఇంకా చాలా వయసు ఉంది. ప్రస్తుతం ఆయన వయస్సు 50 దగ్గర్లో ఉన్నారు. రాజకీయాల్లో కొనసాగడానికి మరో 20, 30 సంవత్సరాలు ఉంది. ఆయనకు కూడా ప్రస్తుతం సీఎం అవ్వాలన్న ఆలోచన లేదు. పలు సభల్లో ఆయన అభిమానులు “సీఎం పవన్ కళ్యాణ్” “సీఎం పవన్ కళ్యాణ్” అని స్లోగన్స్ ఇస్తుంటే పవన్ చాలా సీరియస్ వాళ్లకు క్లాస్ పీకారు. సీఎం కావాలని కోరుకోవద్దు, పార్టీ గెలవాలని కోరుకోండి అని సూచిస్తున్నారు. ఒక వేళ పొత్తు ఉన్నా సీఎం పదవి అడగడం లేదు.

TDP Janasena: CM Seat offer for Pavan Kalyan.. is it True..!?
TDP Janasena: CM Seat offer for Pavan Kalyan.. is it True..!?

పవన్ టార్గెట్ అదే…!?

ఇప్పుడు చంద్రబాబుకు అవకాశం ఇస్తే రాబోయే ఎన్నికల నాటికి పొత్తు ఉంటె దానిలో భాగంగా సీట్లు, పార్టీ బలం పెంచుకుని అప్పుడు సీఎం పదవి అగడవచ్చు. బలం పెరిగితే కింగ్ మేకర్ అయ్యే అవకాశం కూడా ఉండవచ్చు. ప్రస్తుతం జనసేన బలం చూసుకుంటే 40 నియోజకవర్గాల్లో 20వేల పైచిలుకు ఓట్లు తెచ్చుకోగలదు. ఎక్కువ నియోజకవర్గాల్లో అయిదు వేలకు మించి వచ్చే పరిస్థితి కూడా లేదు. ప్రస్తుతం అటువంటి పార్టీకి సీఎం పదవి అంటే ఎవరైనా ఎందుకు ఒప్పుకుంటారు. సో.. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం పొత్తులకు సంబంధించి ప్రాధమికంగా ఒక అవగాహనకు వచ్చారుట. అయితే సీఎం పదవి జనసేన అడుగుతున్నది అనేది అవాస్తవం. పొత్తులకు సంబంధించి విషయం ఇప్పుడే బహిర్గతం చేస్తే ప్రత్యర్ధులకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని భావించి ఎవరికి వాళ్లు ప్రస్తుతం పార్టీ బలోపేతంపై దృష్టి పెడతారు. ఎన్నికలకు మూడు లేదా ఆరు నెలల ముందు పొత్తుల విషయంపై చర్చలు జరిపి ఫైనల్ చేసే అవకాశం ఉంటుంది.


Share

Related posts

చంద్రబాబు, లోకేష్ లపై అసంతృప్తి లో ఉన్న బాలయ్య..??

sekhar

TDP: రాష్ట్రవ్యాప్తంగా కీలక టీడీపీ నేతల హౌస్ అరెస్ట్ లు..!!

sekhar

Mansas Trust: టార్గెట్ అశోక్ గజపతి ఫిక్స్..! వారంలోనే అరెస్టు..!?

Srinivas Manem