TDP – Janasena: జనసేన – టీడీపీ మళ్ళీ పొత్తు.. ఈ పాయింట్లు కీలకం..! “న్యూస్ ఆర్బిట్” ప్రత్యేకం..!!

TDP - Janasena: Political Special Analysis
Share

TDP – Janasena: ఏపీలో కొత్త రాజకీయాలు మొదలవ్వబోతున్నాయి.. రానున్న నెలల్లో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.. పొత్తులు విడుపు.. కొత్త పొడుపు.. వైసీపీలో జగన్ వైఖరిపై తిరుగుబావుటా.. టీడీపీలో అంతర్గత నాయకత్వంపై అసమ్మతి జెండా.. జనసేన పొత్తు ఎత్తులు.. ఆ పార్టీల నేతల పాదయాత్రలు… ఒకటేమిటి ఎన్నో మార్పులు, చేర్పులు చూడడానికి సిద్ధంగా ఉండాల్సిందే. అన్నిటికంటే ఇప్పుడు మనం ఓ కీలక అంశంపై కొన్ని పాయింట్లు ఈ కథనంలో చర్చించుకుందాం.. టీడీపీ – జనసేన పొత్తు అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ – జనసేన కలిసి పోటీ చేయనున్నయని కొంత పుకార్లు, ప్రచారం మొదలయింది. ఇది అంత సులువు కాదు. అలా అని కష్టమూ కాదు..! కానీ ఇదే జరిగితే పవన్ పై అనేక అనుమానాలు, అతనిపై వస్తున్న ఆరోపణలు.. అతనికి ఎదురయ్యే ప్రశ్నలకు తనే బాధ్యత వహించాల్సి ఉంటుంది..!

TDP - Janasena: Political Special Analysis
TDP – Janasena: Political Special Analysis

TDP – Janasena: ఈ పాయిట్లు ఆలోచించుకోవాల్సిందే..!

* జనసేన ఆరంభమయింది 2014 ఎన్నికలకు ముందు.. ఆ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో పొత్తు. ఆ తర్వాత బయటకు వచ్చి 2019 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలకు వ్యతిరేకంగా బీఎస్పీ, విపక్షాలతో పొత్తు.. ఆ ఎన్నికలు ముగిసి.., ఫలితాలు వచ్చిన ఏడూ నెలలకే వామపక్షాలని వదిలేసి మళ్ళీ బీజేపీతో పొత్తు.. ఇలా జనసేన పార్టీలో .. పవన్ కళ్యాణ్ లో ఒక రాజకీయ నిలకడ లేదు అనే అపవాదు ఉంది. ఇక 2024 ఎన్నికల నాటికి టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఏం సమాధానం చెప్తారు..!? ఎందుకు ఇన్ని పొత్తులు, ఇన్ని మార్పులు అంటే ఎలా చెప్పుకుంటారు..!? ఓటర్లను ఎలా కన్వెన్స్ చేస్తారు..!? అయితే ఇక్కడ ఒక సొల్యూషన్ కూడా ఉంది. “జగన్ కి మొదటి నుండు పవన్ వ్యతిరేకమే. వైసీపీకి మొదటి నుండి వ్యతిరేకమే” సో.. నా రాజకీయ శత్రువు జగన్ .. అతని పరిపాలన బాలేదు. అందుకే టీడీపీతో పొత్తు అని చెప్పుకునే వీలుంది.

* సరే.. టీడీపీతో జతకడతారు..! మరి బీజేపీ పరిస్థితి ఏమిటి..!? బీజేపీని అలా వదిలేసి టీడీపీ దగ్గరకు వచ్చేస్తారా..!? అంటే కచ్చితంగా చెప్పలేం. టీడీపీ – బీజేపీ – జనసేన మళ్ళీ పొత్తు పెట్టుకోవాలంటే బీజేపీ అంటేనే ఏపీలో శత్రువులా మారింది. ఆ పార్టీ వైఖరి.. ఏపీలో నచ్చడం లేదు. సరైన నాయకత్వం లేదు.., పైగా కేంద్రం నుండి కూడా ఏపీకి భరోసా ఉండడం లేదు. సో.. బీజేపీని ఎంత దూరంగా ఉంచితే ఈ పార్టీలకు అంత మంచిది అనే ఆలోచన ఉంది. 2014 లో ఈ మూడు పార్టీలు పొత్తు పెట్టుకుని “ఏపీకి ప్రత్యేక హోదా అనీ.. విభజన చట్టం హామీలు అమలు అని సినిమా చూపించి మోసం చేశాయి. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మూడు పార్టీలు కలవగలవు..!? ఓటర్లను ఎలా నమ్మించగలవు..!? బీజేపీని అలా వదిలేసి కేవలం టీడీపీతో మాత్రమే పొత్తు పెట్టుకుందాం అంటే ఆరేళ్ళ వ్యవధిలోనే నాలుగు పార్టీలతో పొత్తు (2019 ఎన్నికలకు ముందు బీఎస్పీ, వామపక్షాలు. 2020 నుండి బీజేపీ.. 2023 కి టీడీపీ) అనే అపవాదు మోయాల్సి వస్తుంది. దీనికి కూడా జగన్ ని దించడానికి.. ఈ అవినీతి పాలనని అంతమొందించడానికి మేము కలుస్తాం..? అని చెప్పుకుంటారేమో..! సరే ఒకరకంగా కన్వెన్స్ చేశారు అనుకుందాం..! అప్పుడు “వైసీపీ కోసం.., జగన్ ని టార్గెట్ చేయడం కోసం” ఈ పార్టీలు విలువలు లేకుండా.., మళ్ళీ మోసం చేస్తున్నాయి. కలుస్తున్నాయి. ప్యాకేజీ అనే ఆరోపణలకు/ విమర్శలకు ఏ విధంగా సమాధానం చెప్పుకోగలరు..?

TDP - Janasena: Political Special Analysis
TDP – Janasena: Political Special Analysis

* జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకుంటే నిజానికి ఆ రెండు పార్టీలకు లాభమే. 2019 ఎన్నికల్లో జనసేన కారణంగా టీడీపీ 20 స్థానాల్లో ఓడిపోయింది. (వైసీపీ సాధించిన ఆధిక్యత కంటే మూడు రేట్లు ఎక్కువ జనసేన ఓట్లు ఉన్నాయి. వాటిలో మూడింట ఒక భాగం టీడీపీ వె. సో.. టీడీపీకి ఈ ఓట్లు పడితే గెలిచేవారు) అలా కొన్ని నియోజకవర్గాల్లో జనసేనతో కలిసి టీడీపీ గెలుచుకోవచ్చు. అలాగే టీడీపీ సాయంతో జనసేన గెలిచే స్థానాలు కూడా బాగానే ఉన్నాయి. “కాపు సామాజికవర్గం ప్రభావం .. యువ ఓటర్లు అధికంగా ఉండే దాదాపు 30 స్థానాల్లో టీడీపీ – జనసేన పొత్తు కలిసి వస్తుంది. ఈ లెక్కల ఈ రెండు పార్టీలు కలిస్తే 50 స్థానాల్లో గెలుపు ఈజీ..! కానీ పొత్తు సిద్ధాంతం..? కారణం..? పవన్ కళ్యాణ్ గత పొత్తుల అనుభవం..? నిలకడ..? క్షేత్రస్థాయిలో కలవడం..! సీట్ల పంపకం.. ఇవన్నీ చాలా లోతుగా ఆలోచించాలి. అన్నిటికీ మించి బీజేపీని వదిలి టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఒకలా ఉంటుంది. లేదా ఆ మూడు కలిస్తే మరోలా ఉంటుంది.. ఈ అంశాలపై స్పష్టత అప్పుడే రాదూ. ఈ లోగ ఎన్ని వచ్చినా పుకార్లు, ప్రచారం తప్ప వాస్తవాలు కాదు. ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు ఎవరికీ తోచిన రాతలు వారికి ఉంటాయి..!


Share

Related posts

ఎలక్షన్ ఓడిపోయిన 16 నెలలకి చంద్రబాబు కి అద్దిరిపోయే పాయింట్ దొరికింది !

sekhar

అక్కడ బీజేపీ ఆట మొదలుపెట్టినట్టేనా..?

Muraliak

కాస్త ఇటు వైపు చూడు జగన్..? పార్టీలో సమస్యలు చాలా ఉన్నాయి

Special Bureau