NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Tdp-Janasena: టీడీపీ-జనసేన ట్విట్టర్ వార్..! హ్యాష్ ట్యాగ్ లతో హల్ చల్..!!

TDP - Janasena: Political Special Analysis

Tdp-Janasena: టీడీపీ-జనసేన Tdp-Janasena పార్టీలు 2014లో పొత్తులతో ఎన్నికలకు వెళ్లిన విషయం తెలిసిందే. టీడీపీకి జనసేన మద్దతు ఇవ్వడంతో ఆ ఎన్నికల్లో గెలిచి టీడీపీ అధికారంలోకి రావడానికి.. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి జనసేన పరోక్షంగా సాయపడింది. పవన్ అభిమానులు కూడా తమ హీరో చెప్పినట్టే టీడీపీకి మద్దతిచ్చారు. దీంతో చంద్రబాబు-పవన్ కల్యాణ్ మధ్య మైత్రి కొన్నాళ్లు బాగానే జరిగింది. అయితే.. 2018లో వారిద్దరి బంధానికి తెర పడింది. 2019 ఎన్నికల్లో విడివిడిగానే ఎన్నికలకు వెళ్లారు. వైసీపీ అధికారంలోకి వచ్చింది. అప్పటినుంచీ టీడీపీ-జనసేన మధ్య అధినాయకత్వంలో పెద్దగా గొడవలు లేకపోయినా కిందిస్థాయిలో మాత్రం గొడవలు జరుగుతూనే ఉన్నాయి.

tdp janasena war in social media
tdp janasena war in social media

రాష్ట్రంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉంది. మూడో పెద్ద పార్టీగా జనసేన ఉంది. టీడీపీ కార్యకర్తలు, జనసైనికుల మధ్య బంధం నివురుగప్పిన నిప్పులానే ఉంది. చంద్రబాబు-పవన్ మాత్రం ఒకరిపై ఒకరు ఎప్పుడూ విమర్శలు చేసుకోలేదు. మొన్నటి ఎన్నికల్లో కూడా ఇరువురూ పరస్పరం విమర్శలు చేసుకున్నారు. ఇప్పుడు వీరి గొడవ కాస్త అఫీషియల్ గానే జరుగుతోంది. పరిషత్ ఎన్నికలను టీడీపీ బహిష్కరిస్తోందని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో జనసేన క్యాడర్ ఒక అడుగు ముందుకేసి ట్విట్టర్లో #EndOfTdp అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ చేసింది. దీంతో అవకాశం కోసం చూస్తున్న టీడీపీ కార్యకర్తలకు తిరుపతి ఉప ఎన్నికలో నవతరం పార్టికి కేంద్ర ఎన్నికల కమిషన్ గ్లాస్ గుర్తు కేటాయించడం కలిసొచ్చింది. #JspChapterClose, #UselessTeluguDesamParty అనే హ్యాష్ ట్యాగ్స్ వైరల్ చేయడం మొదలెట్టారు.

ఇలా వీరిద్దరూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసుకోవడం మొదలెట్టారు. ఒకరిపై ఒకరు పోస్టులు, కార్టూన్లు, విమర్శలు, కౌంటర్లు చేసుకుంటున్నారు. అధికార వైసీపీని వదిలేసి ఈ రెండు పార్టీల కార్యకర్తలు వాదులాడుకుంటున్నారు. నిజానికి జనసేన-టీడీపీ మధ్య తెర వెనుక పొత్తు ఉందనేది వైసీపీ వాదన. అందుకే చంద్రబాబు అధికారంలో ఉండగా జరిగిన తప్పులను అప్పుడూ.. ప్రతిపక్షంలోకి వచ్చాక ఇప్పుడూ కూడా పవన్ వ్యతిరేకించరని విమర్శిస్తూ ఉంటుంది. ఇదంతా నిజం కాదని వీరి వాదన తెలియజేస్తోంది. ఏదైమైనా టీడీపీ-జనసేన స్నేహితులే అనే వాదనను ఈ సోషల్ మీడియా ఖండిస్తున్నట్టే ఉంది. మరి.. లోపల.. లోలోపల ఏం జరుగుతుందో.. లోగుట్టు పెరుమాళ్ల కెరుక..!

author avatar
Muraliak

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju