NewsOrbit
రాజ‌కీయాలు

మైన్ వికెట్ డౌన్ : వైకాపా లోకి మాజీ మంత్రి ??

ఏపిలో రాజకీయ మళ్ళీ వేడెక్కుతోంది. కరోనా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటంతో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నుండి అధికార పార్టీ వైపు జంపింగ్లకు తాత్కాలికంగా విరామం ఏర్పడింది. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్ది ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏడాది పూర్తి అయింది. ఈ ఏడాది కాలంలోనే వైసీపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 90 శాతం హామీలను నెరవేర్చింది. అయితే ఒక పక్క వైసీపీ ఏడాది పాలనపై టీడీపీ అధిష్టానం తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుండగా, మరో పక్క ఆ పార్టీ కీలక నేతలు చంద్రబాబుకు రాంరాం చెప్పి జగన్ పాలనకు జై కొట్టేందుకు సిద్దపడుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు నేరుగా వైసీపీ కండువా కప్పుకుంటే అనర్హత వేటు పడే అవకాశం ఉన్నందున చంద్రబాబుకు దూరం అయి జగన్ కు దగ్గర అవుతున్నారు కానీ వైసీపీ కండువా కప్పుకోవడం లేదు. ఇప్పటికే ముగ్గురు టీటీడీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి అనధికారికంగా విడాకులు తీసుకోని వైసీపీతో సహజీవనం చేస్తున్నారు. ఇక ఎమ్మెల్యేలు కానీ టీడీపీ ముఖ్య నేతలు నేరుగా వైసీపీ కండువా కప్పుకున్నా జరిగే నష్టం ఏమిలేదు.

ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ కీలక నేత సిద్దా రాఘవరావు చంద్రబాబుకు షాక్ ఇచ్చి జగన్ పాలనకు జై కొట్టేందుకు సిద్ధం అయ్యారు. అయన వైసీపీ తీర్థం పుచ్చుకునే ముహూర్తం కూడా ఖరారు అయినట్లు తెలుస్తోంది. బుధవారం నాడు వైసీపీ అధినేత, సీ ఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకొని పార్టీ కండువా కప్పుకోనున్నారని సమాచారం. ఇటీవల కాలంలో ఆయన పార్టీ మారనున్నారని వార్తలు వచ్చాయి కానీ..ఎదో కారణాల రీత్యా వాయిదా పడింది. కార్యకర్తలు, ఆయన అభిమానులు అభిప్రాయం మేరకు సిద్దా వైసీపీలో చేరేందుకు సిద్ధం అయినట్టు తెలుస్తోంది.

గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున ఒంగోలు పార్లమెంట్ స్థానానికి పోటీ చేసిన ఈ మాజీ మంత్రి సిద్దా రాఘవరావు ఓటమి పాలయ్యారు. ఆ తరువాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. టీడీపీలో కొనసాగితే రాజకీయ భవిష్యత్ ఉండదని భావించిన ఆయన పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్నారని అనుకుంటున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!