వైసీపీ లోకి వచ్చి అంతర్మథనంలో పడిన టిడిపి నేత..??

కడప జిల్లాలో జమ్మలమడుగు నియోజకవర్గం లో కీలక నేతగా రాణించిన రామ సుబ్బారెడ్డి ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. మాజీ మంత్రి అయినా ఈయన ఏడాది క్రితం వరకు టిడిపి లో కీలక నేత. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004 లో ఆదినారాయణ రెడ్డి చేతిలో జమ్మలమడుగు నియోజకవర్గంలో ఓటమి తరువాత… వరుసగా జరిగిన మూడు ఎన్నికలలో కూడా రామసుబ్బారెడ్డి కి పరాజయమే పలకరించింది. అయితే విభజన జరిగిన తరువాత 2014 ఎన్నికలలో టిడిపి అధికారంలోకి రావడంతో… రామసుబ్బారెడ్డి ప్రాధాన్యత పెరిగింది. అయితే ఇంతలోనే వైసీపీ నుంచి గెలిచిన ప్రత్యర్థి ఆదినారాయణ రెడ్డి… టిడిపిలో జాయిన్ అవ్వడమే కాదు ఏకంగా మంత్రి పదవి దక్కించుకున్నారు.

Rama Subba Reddy of TDP joins YSRCP | CM Camp Office, Tadepalli | Sakshi TV - YouTubeదీంతో మంత్రి పదవిలో ఉన్న రామసుబ్బారెడ్డి అప్పటినుండి నియోజకవర్గంలో మళ్లీ రాజకీయంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో ఎమ్మెల్సీ ని వదులుకొని ఎమ్మెల్యేగా పోటీకి దిగి వైసీపీ చేతిలో ఓడిపోయారు. దీంతో అధికారంలో టిడిపి లేకపోవడంతో పునరాలోచనలో పడ్డ రామ సుబ్బారెడ్డి …కొన్నాళ్లకు వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం జమ్మలమడుగులో ఎమ్మెల్యేగా రాణిస్తున్న సుధీర్ రెడ్డి మొదటి నుండి రామసుబ్బారెడ్డి చేరికను వ్యతిరేకిస్తూ వచ్చారు.

 

కానీ ఏదో విధంగా పార్టీలో రామసుబ్బారెడ్డి జాయిన్ అయినా గాని, ఆయన అనుకున్నది ఒకటైతే ప్రస్తుతం జరుగుతున్నది వేరు అని జిల్లా రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో నిత్యం ఇబ్బందులు ఎదురవుతున్నాయని అనుచరులు దగ్గర ఆయన వాపోతున్నారట. ఎంత సహనంగా ఉన్నా గాని చేతకాని తనంగా తీసుకుంటున్నారని రామ సుబ్బారెడ్డి అనుచరుల దగ్గర చర్చించుకుంటున్నారు అని టాక్. దీంతో ఎమ్మెల్యే దెబ్బలకు తట్టుకోలేక పార్టీ కార్యక్రమాలకు.. పాల్గొన్న లేని పరిస్థితుల్లో రామసుబ్బారెడ్డి వ్యవహారం ఉందట.

ఈ విషయం పార్టీ హైకమాండ్ పెద్దలు వద్దకు తీసుకెళ్లినా పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు రావడం లేదట. గతంలో ఆదినారాయణ రెడ్డి తో రాజీ పడిన గాని… ఇన్ని సమస్యలు ఎప్పుడూ రాలేదని అనుచరులు దగ్గర రామసుబ్బారెడ్డి కామెంట్ చేస్తున్నారట. కాగా రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చిన్న పెద్ద తేడా లేకుండా గౌరవం ఇవ్వకుండా వ్యవహరిస్తున్న తరుణంలో రామసుబ్బారెడ్డి అనవసరంగా పార్టీ మారటం జరిగిందేమో అని అంతర్మథనంలో పడినట్లు కడప జిల్లా రాజకీయాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి.