NewsOrbit
రాజ‌కీయాలు

అమరావతి రైతుల వ్యథపై టీడీపీకి బాధ్యత లేదా..?

tdp mistake over amaravathi farmers

ఏపీలో ప్రస్తుతం రాజకీయంగా కాక రేపుతోన్న అంశం ‘అమరావతి వర్సెస్ మూడు రాజధానులు’. 2014లో కొత్త రాష్ట్రం.. అనుభవం ముఖ్యం అంటూ అధికారంలోకి వచ్చింది టీడీపీ. అయిదేళ్లలో టీడీపీ చేసిన ఒప్పులు, తప్పులు కలగలిపి 2019ay జగన్ ముఖ్యమంత్రి అయ్యేలా చేసాయి. ప్రభుత్వం మారాక రాజధాని మారుతోంది. రాష్ట్రం నడిబొడ్డులో రాజధాని అంటూ అమరావతి ప్రాంతంలో రైతుల నుంచి 33వేల ఎకరాలు తీసుకుంది. అయిదేళ్ల కాలంలో టీడీపీ ప్రభుత్వం రాజధాని అమరావతిలో కొన్ని పనులు చేయగలిగింది. అధికారం పోదు అనే గర్వంతో ఉన్న టీడీపీకి 2019 ఎన్నికల ఫలితాలు శరాఘాతంలా తగిలాయి. అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు అమరావతిని రాజధాని కాదని మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చింది.

tdp mistake over amaravathi farmers
tdp mistake over amaravathi farmers

నష్టపోయింది అమరావతి రైతులే..

పంటలు బాగా పండే భూములు ఇచ్చిన రైతులు తమ జీవితాలు బాగుపడతాయని అనుకున్నారు. కానీ.. అదే ఈరోజు వారి పాలిట శాపమైంది. అన్ని వేల ఎకరాలు అవసరం లేదని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు గొంతెత్తాయి. కానీ.. చంద్రబాబును చూసి రైతులు భములిచ్చేశారు. పోనీ.. టీడీపీ చెప్పింది చెప్పినట్టు చేసిందా అంటే.. ఆ భూముల్లో రైతులకు కొలతలు వేసి కొందరికి ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేసింది. నిర్మాణాలు చేపట్టింది. సెక్రటేరియట్, హైకోర్టు.. కట్టి తాత్కాలికం అంది. అపార్ట్ మెంట్ల నిర్మాణం మధ్యలో, చివరి దశలో ఉండిపోయాయి. ఇవన్నీ ఇప్పటి ప్రభుత్వానికి తప్పిదాలుగా అనిపించాయి. అసెంబ్లీలో అమరావతికి జై కొట్టిన జగనే ఇప్పుడు మూడు రాజధానులు అంటున్నారు. పంటలు లేక, భూముల అభివృధ్ది లేక భవిష్యత్ కోసం రెడ్డెక్కారు. వీరిని ప్రభుత్వం కానీ.. చంద్రబాబు కానీ పట్టించుకోవడం లేదు.

రైతుల బాధలకు టీడీపీదే బాధ్యత..

మూడు రాజధానుల అంశంలో ఎటు మాట్లాడితే ఏమవుతుందో అనే భయంతో టీడీపీ ఉండిపోయింది. అమరావతి రైతుల తరపున గట్టిగా మాట్లాడింది లేదు. అధికారంలో ఉండగా అమరావతి రాష్ట్రానికి రాజధాని అని చెప్పిన టీడీపీ.. అధికారం కోల్పోయాక అదే మాటతో రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేయలేక పోయింది. ప్రతి జిల్లాలో అమరావతి గురించి టీడీపీ రోడ్డెక్కి ఉంటే రైతులకు వెన్నుదన్నుగా ఉండేది. కానీ టీడీపీ ఆ పని చేయకపోగా తూతూ మంత్రంగా సపోర్ట్ చేస్తోంది. పోరాటాలు చేసి జైలుకెళ్తే టీడీపీ రైతులకు అండ, అమరావతి కోసం చిత్తశుద్ధి ఉన్నట్టు ఉండేది. కానీ.. టీడీపీ పోరాటం శూన్యం. అమరావతిలో పనులు మొదలయ్యాయి కదా అని సీఎం జగన్ కు లేదు.. అమరావతే రాజధాని అని టీడీపీ గట్టిగానూ లేదు. మధ్యలో నష్టం మాత్రం రైతులదీ.. ఆంధ్ర ప్రజలదీ.!

 

author avatar
Muraliak

Related posts

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!