NewsOrbit
5th ఎస్టేట్ రాజ‌కీయాలు

ముహూర్తం మారింది… సీఎం దగ్గర ఆగింది…!

టీడీపీ ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్ (రేపల్లె), ఏలూరి సాంబశివరావు (పర్చూరు) వైసిపిలో చేరిక వ్యవహారం మొన్న ఉదయం నుండి మీడియాలో బాగా నలిగింది. అన్ని చానెళ్లు, సోషల్ మీడియా.., మా “న్యూస్ ఆర్బిట్” సహా ప్రధాన వార్తగా ప్రచురించాము. నిజానికి ఈ చేరిక మే 29 లోగా ముగించాలి అనుకున్నప్పటికీ చిన్న బ్రేక్ పడింది. చర్చల్లో ఒక అవగాహన రాకపోవడంతో రేపు సాయంత్రం లేదా ఎల్లుండి లోగా మరోసారి భేటీ అయి విషయాన్నీ ఫైనల్ చేయనున్నట్టు తెలిసింది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రస్తుతం రాజధానిలో ఉన్నారు. ఈ విషయమై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా మాట్లాడుతూ “పార్టీలోకి ఎవరూ రావడం లేదు” అన్నారు. దీని వెనుక కొన్ని కీలక పరిణామాలు జరిగినట్టు తెలుస్తుంది. చర్చల్లో తుది నిర్ణయం తీసుకోకపోవడం… పర్చూరు లో ఇప్పటికే ఉన్న కొందరు నియోజకవర్గ స్థాయి నాయకుల అభిప్రాయం భిన్నంగా ఉండడంతో ఆగింది.

జగన్ వద్దకి చివరి పంచాయతీ…!

నిజానికి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు వైసిపి లో చేరేందుకు సిద్ధంగానే ఉన్నారు. ప్రాధమికంగా చర్చలు కూడా జరిగాయి. అయితే ఈ డిమాండ్లు, స్థానికంగా పార్టీ కీలక నాయకులు అంగీకరించడం.., నియోజకవర్గం పెత్తనాలు ఇవ్వడం… ఆశించిన ప్రయోజనాలు కల్పించడం… ఇలా రకరకాల చర్చల్లో స్తబ్దత నెలకొంది. మంత్రి బాలినేని వద్ద అంగీకారం కుదిరింది. చివరిగా సీఎం జగన్ ఆమోదం తెలిపిన తర్వాత రేపు లేదా ఎల్లుండి చేరనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. సీఎం జగన్ “తోలి ఏడు- జగనన్న తోడు”… జగన్ ఏడాది పాలన కార్యక్రమాల్లో బిజీ గా ఉండడం.., కోర్టు వ్యవహారాల్లో కొన్ని చర్చలు జరుపుతుండడంతో ఈరోజు సమయం వీలుపడలేదు. మంత్రి బాలినేని.., సీఎం జగన్ ని కలిసిన తర్వాత ఈ ఇద్దర్నీ తీసుకుని వెళ్లి చేర్పించనున్నారు. ఇది జరిగిన తర్వాత మరో ఇద్దరితో కూడా చర్చలు ప్రారంభిస్తారు. మే 29 న తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహిస్తుంది. ఆ సమయానికి పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలను లాగేయాలన్నది వైసిపి వ్యూహం గా ఉన్నప్పటికీ సీఎం జగన్ వేరే పనుల్లో గడపడం, అంతర్గత చర్చలు తేలకపోవడంతో తాత్కాలికంగా ఆగింది.

author avatar
Srinivas Manem

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!