NewsOrbit
రాజ‌కీయాలు

ఇవి ఎలా సాధిస్తారు జగన్ సారూ?

అమరావతి: కడప స్టీలు ప్లాంట్, దుగరాజపట్నం లాభదాయకం కావు, 2016 జనాభా లెక్కలయ్యే వరకూ అసెంబ్లీ సీట్లు పెంచము అని కేంద్రం లిఖిత పూర్వకంగా సమాధానాలు ఇచ్చి నేపథ్యంలో  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి 22 మంది ఎంపిలు మెడలు వంచి సాధిస్తారో, కాళ్లు పట్టుకుని సాధిస్తారో ప్రజలకు చెప్పాలని విజయవాడ టిడిపి ఎంపి కేశినేని కోరారు.

లోక్‌సభలో ఎంపి కేశినేని వేసిన ప్రశ్నలకు కేంద్ర హోంశాఖ సమాధానాలు ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అంశాల అమలు ఎంత వరకు వచ్చింది, ఇంత వరకు ఎన్ని నిధులు విధులు చేశారు, ఎన్ని సంస్థలు ఏర్పాటు చేశారు, మిగిలిన సంస్థల ఏర్పాటు పరిస్థితి ఏమిటి అని కేశినేని అడిగిన ప్రశ్నలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సమాధానాలు ఇచ్చారు.

కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం రేవు ఏర్పాటు లాభదాయం కాదని కేంద్రం తెలియజేశారు. 2026 తర్వాత జరిగే జనాభా లెక్కలు పూర్తి అయ్యే వరకూ అసెంబ్లీ సీట్లు పెంపు సాధ్యం కాదని కేంద్రం వెల్లడించింది. 2015-20 మద్య రాష్ట్రానికి రెవెన్యూ లోటు కింద 22,113 కోట్ల రూపాయలు ఇవ్వాలని 14 ఆర్థిక సంఘం సూచించగా 2015-19 వరకు 19,613 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు తెలిపారు. విభజన చట్టంలోని అత్యధిక అంశాలను ఇప్పటికే అమలు చేశామనీ, మిగిలినవి వివిధ స్థాయిలో ఉన్నాయని చెప్పారు. కొన్ని విషయాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరాల్సి ఉందనీ, అందు కోసం ప్రయత్నిస్తున్నామనీ వెల్లడించారు. కొన్నింటి ఏర్పాటుకు చట్టంలో పదేళ్ల వరకూ సమయం ఉందని గుర్తు చేశారు.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఏపిలోని వివిధ విద్యాసంస్థల ఏర్పాటుకు ఇప్పటి వరకూ 1.638.34కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు వెల్లడించారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసినట్లు తెలిపారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Leave a Comment