NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఒక్కసారిగా దూకుడు పెంచిన టీడీపీ ఎంపీ..!!

కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటనతో శ్రీకాకుళం జిల్లా టిడిపి ఎంపి రామ్మోహన్ నాయుడు దూకుడు పెంచినట్లు సమాచారం. నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న శ్రీకాకుళం ఎంపీ… పార్లమెంటు నియోజక వర్గం తరహాలో జిల్లా విభజన జరిగితే శ్రీకాకుళంకి మిగిలేది…శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట, టెక్కలి, పలాస, ఇచ్చాపురం, పాతపట్నం నియోజకవర్గలే. ఈ క్రమంలో మిగిలిన యాడ్చర్ల, రాజాం నియోజకవర్గాలు విజయనగరం పార్లమెంట్ కు, పాలకొండ అరకు పార్లమెంట్ కు వెళ్లిపోతాయి.

Without notice or warrant, ACB officials arrested Atchannaidu: Rammohan Naiduఅయితే వెళ్ళిపోయే ప్రాంతాలు అన్ని అభివృద్ధి చెందేవి కావటంతో శ్రీకాకుళంలో మిగిలేది ఏంటి అంటూ పార్టీలకతీతంగా జిల్లాలో ఉన్న ప్రముఖ నాయకులు తెగ చర్చించుకుంటున్నారు. ఈ విషయంలో వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ముందుగా స్పందించారు. సొంత ఎమ్మెల్యే కావటంతో ఆయన శ్రీకాకుళం జిల్లా విభజన విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కామెంట్లు చేయటంతో అధికార పార్టీలో కాక పుట్టించాయి.

 

పరిస్థితి ఇలా ఉండగా శ్రీకాకుళం జిల్లాలో మిగతా మిగతా వైసీపీ ఎమ్మెల్యేలు సైతం ధర్మాన ప్రసాద్ మాదిరిగానే జిల్లా విభజనను వ్యతిరేకించే తరహాలో అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది. ఈ క్రమంలో టీడీపీ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఎవరూ స్పందించలేదు. ఆ టైంలో టిడిపి నేతలు మౌనం పైన అనేక చర్చలు జరిగాయి. కాగా ఏడాదిన్నర వరకూ ప్రజా సమస్యలపై వివిధ అంశాలకు సంబంధించి ప్రధానికి లేఖలు రాసిన ఎంపీ రామ్మోహన్ నాయుడు తాజాగా జిల్లా విభజన విషయంలో సీన్ లోకి ఎంటర్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జిల్లా విభజన కానీయం అని చెబుతున్నారు.

 

ఈ క్రమంలో జిల్లా విభజనని సెంటిమెంట్ గా మార్చి అధికార పార్టీ వైసీపీ పై దూకుడు పెంచాలని పార్టీని బలోపేతం చేసే తరహాలో ఎంపీ రామ్మోహన్ నాయుడు గ్రౌండ్ లెవెల్ లో స్కెచ్ వేస్తున్నట్లు టాక్ వస్తోంది. ఖచ్చితంగా ఈ విభజన అంశాన్ని పొలిటికల్ మైలేజ్ గా సంపాదించుకోవాలని, ఉత్తరాంధ్రలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావడానికి.. జిల్లా విభజనని సెంటిమెంట్ గా మలిచే రీతిలో వ్యూహాలు వేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

 

ఇప్పుడు పార్లమెంటు పరిధిలో జిల్లాలను విభజించిన 2026 లో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే పరిస్థితి ఏంటి అంటూ రామ్మోహన్ నాయుడు సంధిస్తున్న ప్రశ్నలు అధికార పార్టీని డిఫెన్స్ లోకి నటిస్తున్నట్లు, ప్రజలలో ఎంపీ మాటలు చర్చనీయాంశంగా మారిన ట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా జిల్లాల విభజన అంశాన్ని పొలిటికల్ గా అధికార పార్టీని దెబ్బకొట్టడానికి ఎంపీ రామ్మోహన్ నాయుడు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!