NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

TDP ; ఆ ఒక్కటైనా గెలుస్తుందా..!? మున్సిపోల్స్ లో టీడీపీకి ఎక్కడెక్కడ అవకాశాలున్నాయంటే..!?

TDP ; Municipolls Winning Analysis

TDP ; మున్సిపల్ ఎన్నికలు ముగిసాయి. మరో 48 గంటల్లో ఫలితాలు వచ్చేస్తాయి. వైసీపీ అధికారంలో ఉంది. బలం, బలగం గట్టిగా ఉన్నాయి. వాటిని ప్రయోగించగల నాయకత్వం ఉంది. పవర్ పాలిటిక్స్ చేసింది. సో.. ఆ పార్టీ 90 శాతం పట్టణాలు/ నగరాలు దక్కించుకోవడంలో సందేహం లేదు. కానీ టీడీపీ మాత్రం విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు వంటి నగరాలు సహా.., సర్సీపట్నం, హిందూపూర్, అద్దంకి, మండపేట, రేపల్లె వంటి పట్టణాల్లో గెలుపుపై ఆశలు పెట్టుకుంది. కాస్త లోతుగా పరిశీలన చేసి… టీడీపీకి ఎక్కడెక్కడ విజయావకాశాలు ఉన్నాయి..!? టీడీపీ అవకాశాలను కూడా వైసీపీ ఎలా గండి కొట్టింది అనే అంశాలను చర్చిద్దాం..!!

TDP ; Municipolls Winning Analysis
TDP Municipolls Winning Analysis

TDP ; కార్పొరేషన్లలో ఆ ఒక్కటీ గట్టిగా..!!

ముందుగా కార్పొరేషన్లు పరిశీలిస్తే విశాఖపట్నంలో విశాఖ స్టీల్ ఉద్యమకారులు వైసీపీకి వ్యతిరేకంగా ఓటేశారని టీడీపీ గట్టిగా నమ్మకంతో ఉంది. సరిగా పోలింగ్ కి రెండు రోజుల ముందు ఉధృతమైన విశాఖ ఉక్కు ఉద్యమం విశాఖలో వైసీపీ అవకాశాలను గండి కొట్టిందని టీడీపీ అంచనాల్లో ఉంది. ఇది కొంత మేరకు నిజం అయితే అవ్వవచ్చు కానీ విశాఖలో టీడీపీ కి కొన్ని స్థానాలను పెంచితే పెంచవచ్చు కానీ.. మేయర్ పీఠానికి సరిపడా వచ్చే స్థానాలు వచ్చే అవకాశాలు లేవని తెలుస్తుంది. పూర్తి వివరాల కోసం (విశాఖలో గెలుపెవరిది..? “న్యూస్ ఆర్బిట్” కీలక పరిశీలన(Click Here) చదవచ్చు..!

TDP ; Municipolls Winning Analysis
TDP Municipolls Winning Analysis

* ఇక వియజయవాడలో చూసుకుంటే ఇక్కడ టీడీపీ బలంగానే ఉంది. అమరావతి రాజధాని ఉద్యమం వలన వైసీపీపై ఏర్పడిన వ్యతిరేకత టీడీపీకి ఓట్లు గుమ్మరిస్తుందని ఆ పార్టీ నమ్మకంతో ఉంది. కానీ.. ఎన్నికలకు ప్రధానంగా చేయాల్సిన పోల్ మేనేజ్మెంట్ లో టీడీపీ విఫలమయింది. వైసీపీ తమకు పూర్తిస్థాయిలో బలం లేకపోయినప్పటికీ చివరి రెండు రోజుల్లో పవర్ పాలిటిక్స్ చేసింది, పోల్ మేనేజ్మెంట్ బాగా చేసింది. ఆర్ధిక అవసరాలను బాగా తీర్చింది. టీడీపీ సగం వార్డుల్లో గట్టిగా పని చేసి.. కొన్ని వార్డుల్లో స్థానిక నాయకత్వం పెద్దగా పట్టించుకోలేదు. ఫలితంగా టీడీపీకి ఇక్కడ దెబ్బ పడినట్టే చెప్పుకోవచ్చు. టీడీపీకి చెప్పుకోదగిన స్థానాలు వస్తాయి కానీ.., మేయర్ పీఠానికి సరిపడా వచ్చే అవకాశాలు లేవని తెలుస్తుంది. పోటీ మాత్రం హోరాహోరీగా ఉంటుంది. * ఇదే పరిస్థితి గుంటూరులో కూడా ఉంది. టీడీపీకి అవకాశాలు ఉన్న చోట కూడా పోల్ మేనేజ్మెంట్ లో విఫలమైనట్టు చెప్పుకోవచ్చు. ఇది ఆ పార్టీ విరాజెవకాశాలను గండి కొట్టింది.

పట్టణాల్లో స్వల్ప అవకాశాలు..!?

ఇక పట్టణాల్లో చూసుకుంటే విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో టీడీపీ విస్జయంపై నమ్మకంతో ఉంది. అక్కడ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్, ఆయన భార్య కూడా వార్డుల్లో కౌన్సెలర్లుగా పోటీ చేశారు. మొత్తం అన్ని వార్డుల్లో ఎన్నికలను దగ్గరుండి “కర్త, కర్మ, క్రియా” వాళ్ళే ఉండి నడిపించారు. అభ్యర్థులకు అన్ని వనరులు సమకూర్చారు. పోల్ మేనేజ్మెంట్ బాగా చేశారు. వైసీపీని బాగానే ఎదుర్కొన్నారు. అక్కడా తలొగ్గలేదు. సో… ఈ పట్టణంలో విజయంపై టీడీపీ ధీమాగా ఉంది. స్థానిక ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు, వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని నమ్ముతుంది. వైసీపీ అధికారం, ప్రభుత్వ పథకాలపైనే ఆశతో ఉంది.

TDP ; Municipolls Winning Analysis
TDP Municipolls Winning Analysis

* ప్రకాశం జిల్లా అద్దంకిలో టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వైసిపిని ధాటిగా ఎదుర్కొన్నారు. అధికార పార్టీకి పోటీగా టీడీపీ అభ్యర్థులను ముందుండి నడిపించారు. ప్రచారం నుండి ప్రలోభాలు, పోల్ మేనేజ్మెంట్ వరకు అధికార పార్టీకి పోటీగా భారీగానే సమకూర్చారు. టీడీపీ విజయానికి ఏం చేయాలో అన్ని చేశారు. ఇక్కడ కూడా టీడీపీ విజయంపై నమ్మకంతో ఉంది. అధికారం, పవర్ పాలిటిక్స్, జగన్ బొమ్మ, సంక్షేమ పథకాలు మాత్రమే ఇక్కడ వైసిపిని గెలిపించాలి.
* హిందూపూర్ లో ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నీ తానై నడిపించగా.., మండపేటలో ఎమ్మెల్యే జోగేశ్వరరావు,  దగ్గరుండి మొత్తం రాజకీయం నడిపించారు. రేపల్లెలో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ బాగానే పట్టించుకున్నారు. కానీ టీడీపీకి విజయావకాశాలు ఇక్కడ అవకాశాలు తక్కువే. సో… రాష్ట్రం మొత్తం మీద టీడీపీకి ఏమైనా విజయావకాశాలు ఉన్నాయి అంటే ఇవి మాత్రమే. ఇంకెక్కడా టీడీపీ గెలిచే అవకాశాలే లేవు.

author avatar
Srinivas Manem

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?