Subscribe for notification

‘మనకెందుకులే..’ అఖిలప్రియ విషయంలో టీడీపీ స్టాండ్ ఇదేనా..?

Share

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న అంశం బోయిన్ పల్లి కిడ్నాప్. హఫీజ్ పేట భూముల విషయంలో ప్రవీణ్ రావు అన్నదమ్ములను టీడీపీ మాజీ మంత్రి అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ కిడ్నాప్ చేసారు. దీనిని హైదరాబాద్ పోలీసులు చేధించారు.. అఖిలప్రియను అరెస్టు చేశారు. ఈ అంశంలోకి మరో టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి పేరు కూడా వచ్చింది. కేసులో అఖిలప్రియ A1, ఏవీ సుబ్బారెడ్డి A2, భార్గవ్ A3.. గా పోలీసులు చేర్చారు. 50 ఎకరాల భూమికి సంబంధించిన గొడవ. అయితే.. భూమి ఉంది తెలంగాణలో. నాయకులు ఏపీ వారు. ఉమ్మడి ఏపీలో కొనుగోలు చేసిన భూమి. ప్రస్తుతం కిడ్నాప్ జరిగింది హైదరాబాద్ లో. మరి.. ఇంతగా టీడీపీ నేతలు హైదరాబాద్ లో ఇబ్బంది పడుతుంటే స్పందించి అండగా ఉండాల్సిన పార్టీ మాత్రం ఇప్పటికీ స్పందించ లేదు. ఆ పార్టీనే తెలుగుదేశం.

tdp silence on akhila priya issue

ఇదే ఏపీలో జరిగితే..

ఇదే గొడవ ఆంధ్రప్రదేశ్ లో జరిగి.. ఏపీ పోలీసులు అఖిలప్రియను అరెస్టు చేస్తే.. ఈసరికి టీడీపీ స్పందన మరోలా ఉండేది. అరెస్టును చంద్రబాబు ఖండించడం, వేలు చూపించి లోకేశ్ వార్నింగ్ లు ఇవ్వడం, మంగళగిరి టీడీపీ ఆఫీసులో టీడీపీ నేతల ప్రెస్ మీట్లు పెట్టేసేవారు. సీఎం జగన్ అధికారం అండతో అరెస్టులు, టీడీపీ నేతలపై కక్షసాధింపు చర్యలు, రాష్ట్రంలో ఫ్యాక్షన్ పాలన, శాంతిభద్రతలు.. ఇంకా ఇంకా చాలా మాటలు వచ్చేవి. టీడీపీ అనుకూల మీడియా కోడై కూసేది. అనుకూల పత్రికలు అక్షరాల అల్లేసే వారు. కానీ.. గొడవ జరిగింది తెలంగాణలో. దాంతో.. పైన చెప్పుకున్న హడావిడికి భిన్నంగా తెలుగుదేశం నుంచి ఇప్పటికీ చంద్రబాబు, లోకేశ్ నుంచి ఏ ఒక్క నాయకుడూ స్పందించలేదు. తెలంగాణ ప్రభుత్వాన్ని, పోలీసులను ఉద్దేశించి ఒక్క వ్యాఖ్య చేయలేదు. ‘మనకెందుకులే..’ అని ఉన్నారా అనే సందేహాలు.

టీడీపీతోనే భూమా కుటుంబం..

నిజానికి భూమా కుటుంబం తెలుగుదేశం పార్టీకి విధేయులు. 2008లో ప్రజారాజ్యం, కాంగ్రెస్, అటుపై వైసీపీలో కొనసాగారు. 2017లో మళ్లీ టీడీపీలో చేరారు. అఖిలప్రియ టూరిజం శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అఖిలప్రియ తల్లి శోభా నాగిరెడ్డి టీడీపీ ఎమ్మెల్యేగా, ఆర్టీసీ చైర్మన్ గా.. పలు బాధ్యతలు చేపట్టారు. నాగిరెడ్డి ఎమ్మెల్యేగా చాలా పర్యాయాలు ఉన్నారు. మొత్తానికి భూమా కుటుంబానికి టీడీపీతో అనుబంధం ఎక్కువ. అయితే.. ఇప్పుడా ఆ టీడీపీనే అఖిలప్రియ విషయంలో ఏమాత్రం స్పందించడం లేదు. మొన్నీమధ్యే తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డికి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి మధ్య జరిగిన గొడవపై టీడీపీ స్పందించింది. లోకేశ్ కూడా వెళ్లి వైసీపీ తీరును ఎండగట్టారు. తర్వాత గుంటూరు జిల్లాలో టీడీపీ నాయకుడి హత్య జరిగినే లోకేశ్ వెళ్లి పరామర్శించారు. సీఎం జగన్ కు వార్నింగ్ కూడా ఇచ్చారు. కానీ.. తమ పార్టీవారే అయిన అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి అంశంపై మాత్రం మాట్లాడలేదు.

టీడీపీ ‘మనకెందుకులే..’ అనుకుందా..!

నిన్న అఖిలప్రియ సోదరి మౌనిక ప్రెస్ మీట్లో కూడా తెలంగాణ నాయకులు మధ్యవర్తిత్వం తీసుకోవాలని కోరారే తప్ప.. టీడీపీ నాయకుల స్పందించకపోవడంపై స్పందించ లేదు. అంటే.. అసలు వీరికే టీడీపీతో పొసగడం లేదా.. వీరి వ్యవహారంతో టీడీపీ అధిష్టానమే అసహనంగా ఉందా.. పర్సనల్ గొడవల్లోకి పార్టీని లాగడమెందుకు అనుకున్నారా.. టీడీపీనే పర్సనల్ గొడవగా భావించిందో అర్ధం కాని పరిస్థితి. అయితే.. ఇప్పటికే ఉన్న తగవులు చాలకనో.. తెలంగాణలో టీడీపీ పరిస్థితి నేపథ్యంలోనో.. ఓటుకు నోటు కేసు కీలక దశలో ఉన్న నేపథ్యంలోనే ‘మనకెందుకులే..’ అనే ధోరణో కానీ.. టీడీపీ వ్యూహాత్మక మౌనం కాదు కదా.. అసలు భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి ఎవరో మాకు తెలీదు.. అన్నట్టు వ్యవహరిస్తోంది.

పార్టీ భరోసా అవసరం..

నిజానికి ఇలాంటి సమయంలోనే పార్టీ నుంచి సానుభూతి అవసరం, కానీ.. అదే కొరవడింది. చంద్రబాబు ఒక ప్రకటన.. లోకేశ్ ఆవేశంగా ఒక్క స్టేట్ మెంట్ ఇచ్చినా వారికి ధైర్యంగా ఉంటుంది. 14ఏళ్ల చంద్రబాబు పాలనలో నాగిరెడ్డి, శోభలకు మంత్రి పదవులు దక్కలేదు. అయినా పార్టీకి అనుకూలంగానే పని చేశారు. వారు లేని ప్రస్తుత క్లిష్ట సమయంలో టీడీపీ నుంచి కాస్త భరోసా దక్కితే అఖిలప్రియ, మౌనికలకు కాస్త ధైర్యం వస్తుంది.

 


Share
Muraliak

Recent Posts

Charan Hrithik Roshan: సంచలన దర్శకుడు డైరెక్షన్ లో వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ లో చరణ్, హృతిక్ రోషన్..??

Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…

11 mins ago

Thaman: బాలయ్య బాబు అంటే నాకు ఎమోషనల్.. కారణం అదే తమన్ సంచలన వ్యాఖ్యలు..!!

Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…

27 mins ago

Uday Kiran: అప్పట్లో హీరో ఉదయ్ కిరణ్ కి పోటీ నేనే అంటూ ఆ హీరో సెన్సేషనల్ కామెంట్స్..!!

Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…

2 hours ago

Nayanthara: భ‌ర్త‌ను కౌగిట్లో భందించి ఊపిరాడ‌కుండా చేసిన న‌య‌న్‌.. ఫొటో వైర‌ల్‌!

Nayanthara: లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. ఓ మ‌ల‌యాళ చిత్రంతో సినీ కెరీర్‌ను…

3 hours ago

Pavitra Lokesh Naresh: నరేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పవిత్ర లోకేష్ భర్త..!!

Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…

4 hours ago

Gopichand-NTR: ఎన్టీఆర్ ఒకే చేసిన క‌థ‌తో గోపీచంద్ సినిమా.. ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే?

Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రిత‌మే `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి…

4 hours ago