Tdp-Raghuramakrishna Raju: రఘురామపై టీడీపీకి అంత ఆసక్తి ఎందుకో..?

tdp special interest on raghuramakrishna raju
Share

Tdp-Raghuramakrishna Raju: టీడీపీ-రఘురామకృష్ణ రాజు Tdp-Raghuramakrishna Raju అంశం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే.. ‘నన్ను పోలీసులు కొట్టార’ని రఘురామ కోర్టులో చెప్పడంతో సీన్ మొత్తం మారిపోయింది. ఆయన్ను అరెస్టు చేయడం.. అసలెందుకు అరెస్టు చేసారనే అంశాలు ఇప్పుడు పక్కకు వెళ్లిపోయాయి. దీనిపై ఏకంగా ఇప్పుడు సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఆయనకు జరిపిన టెస్టులపై రగడతో మరో టర్న్ తీసుకుంది. ఇలా మొత్తంగా అసలు విషయం పక్కకు వెళ్లిపోయింది. అయితే.. ఇదే అదనుగా టీడీపీ ఈ అంశంలో రఘురామ తరపున మాట్లాడుతోంది. టీడీపీకి సంబంధంలేని వ్యక్తి గురించి వారెందుకు మాట్లాడుతున్నారనేది ఇప్పుడు మరో ప్రశ్న.

tdp special interest on raghuramakrishna raju
tdp special interest on raghuramakrishna raju

నిజానికి 2014 ముందే రఘురామకృష్ణ రాజు టీడీపీలో చేరారు. ఆ పార్టీలో కూడా రఘురామ ఇమడలేక పోయారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ ఇచ్చిన టికెట్ తో నర్సాపురం అభ్యర్ధిగా గెలిచి ఎంపీ అయ్యారు. కానీ అతితక్కువ కాలంలోనే పార్టీ వ్యతిరేకి అయిపోయారు. వైసీపీని, ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. దీంతో.. టీడీపీ నేతలు రఘురామకు పరోక్షంగా మద్దతుగా నిలిచారు. ఆయన అరెస్టుపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా స్పందించారు. ఆయనకు ప్రాణహాణి ఉందంటూ ఏకంగా గవర్నర్ కే లేఖ రాశారు. ఒకప్పుడు రఘురామకృష్ణరాజు అంశం వారి పార్టీ అంతర్గత వ్యవహారం అని వ్యాఖ్యానించిన టీడీపీ ఇప్పుడు మద్దతు ఇవ్వడం చర్చనీయాంశమవుతోంది.

 

గతంలో పార్టీలో ఉండలేకపోయిన వ్యక్తి, వెళ్లిపోతున్న నేతను ఆపుకోలేని టీడీపీ ఇప్పుడు రఘురామకు ఎందుకు మద్దతిస్తుందో వారికే తెలియాలి. గతంలో 2017లో మంత్రివర్గంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి చంద్రబాబు మంత్రి పదవులు ఇచ్చారు. అప్పడు చంద్రబాబు నిర్ణయాన్ని గట్టిగానే ప్రతిఘటించారు సొంత పార్టీ నేతలు. అది పార్టీ అంతర్గత విషయంగా ఉండిపోయింది. కానీ.. ఇప్పుడు మాత్రం టీడీపీ వేరే పార్టీ అంతర్గత అంశంపై చంద్రబాబు సానుభూతి వ్యక్తం చేయడం రాజకీయంలో భాగమనే చెప్పాలి. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేలా.. కులాలపై వ్యాఖ్యలు చేసారన్న ఆరోపణలపై అరెస్టైన ఎంపీ అంశం ఇప్పుడు రాజకీయంగా మారిపోవడం విశేషం. ఈ అంశం ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి


Share

Related posts

దమ్మాలపాటి ఏసీబీ కేసుపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఏపి ప్రభుత్వం

Special Bureau

మరో సారి హైకోర్టు తలుపుతట్టిన ఎస్ఐసి నిమ్మగడ్డ..ఎందుకంటే..?

Special Bureau

వైరల్ వీడియో : బిగ్ బాస్ అంతా స్క్రిప్ట్ ప్రకారమే జరిగింది…? ఇదిగో ప్రూఫ్…!

siddhu