NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

రాజీనామానా..?ఆమరణ దీక్షనా..?రాజధానిపై టీడీపీ పోరాటం ఎలా??

రాజధాని వికేంద్రీకరణను టిడిపి జీర్ణించుకో లేకపోతోంది. రాజధానిగా అమరావతి ఉంటే చంద్రబాబు ముద్ర రాష్ట్రంపై ఎంతో కొంత పనిచేస్తుంది. హైదరాబాద్ ను వదిలేసి వచ్చినప్పటికీ ఇప్పటికీ హైదరాబాద్ అంటే చంద్రబాబు హయాంలో నిర్మించిన సైబర్ టవర్స్ వంటి ఆధునిక కట్టడాలు గుర్తొస్తాయి. అలాగే అమరావతి రాజధానిగా కొనసాగితే చంద్రబాబు హయాంలోనే రూపొందుకున్న ప్రణాళికలు, భవనాలు చెరగని ముద్రగా ఉండిపోతాయి.

అంటే టిడిపికి అమరావతి రాజకీయంగా కలిసి వచ్చినా రాకపోయినా ఒక జ్ఞాపకంగా మాత్రం మిగిలిపోతుంది. ఆ జ్ఞాపకాల్ని చెరిపేస్తూ క్రమంలో వైఎస్ జగన్మోహన రెడ్డి కీలక అడుగులు వేశారు. మూడు రాజధానులు బిల్లు ఆమోదించేలా చేసి పాలన వికేంద్రీకరణకి శ్రీకారం చుట్టారు. దీనిపై టిడిపి గట్టి పోరాటానికే సిద్ధమవుతోంది. ప్రస్తుతానికి ఈ పోరాటం ఎలా చేయాలా అని టిడిపి ముఖ్యులతో చంద్రబాబు దఫ దఫాలుగా చర్చలు జరుపుతున్నారు.

Tdp thinking amaravathi agitation

ఆమరణ దీక్ష ఆలోచన ఉన్నప్పటికీ..!

అమరావతికి మద్దతుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన టిడిపి పెద్దల్లో వచ్చిందట. తెలంగాణ సాధించే క్రమంలో నాడు కేసీఆర్ గట్టి పోరాటం చేశారు. 2009 డిసెంబర్ 9న కేసీఆర్ చేసిన ఆమరణ దీక్ష వల్లే తెలంగాణ ఉద్యమం రెండవ దశకు ఊపిరి పోసుకుంది. తద్వారా ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు బాటలు వేసింది. నేడు అమరావతి అంశంపై కేంద్రం జోక్యం చేసుకోవాలన్నా, బిజెపి పెద్దలు పట్టించుకోవాలన్నా దేశం మొత్తం దృష్టి రాష్ట్రంపై, అమరావతిపై పడాలన్నా చంద్రబాబు లాంటి సీనియర్ నాయకులు ఆమరణ దీక్ష చేస్తే బాగుంటుంది .అనే ఆలోచన కొంత మంది టిడిపి పెద్దల్లో వ్యక్తం అయిందట. అయితే చంద్రబాబు వయసు, ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదని కూడా భావిస్తున్నారట. అమరావతికి మద్దతుగా ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన చోటనే చంద్రబాబు ఆమరణ దీక్ష కు కూర్చొని, మంగళగిరి ప్రాంతంలో నారా లోకేష్, జిల్లాల వారీగా జిల్లా స్థాయి నాయకులు ఆమరణ దీక్ష చేస్తే ఎలా ఉంటుంది అని టిడిపి ఆలోచిస్తోంది.

రాజీనామాలు చేస్తే ఎలా ఉంటుంది? మరో ఆలోచన..!

ఆమరణ దీక్ష కాకపోతే పోరాటానికి మరో అస్త్రం రాజీనామాలు చేయడం. అంటే తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు వెళ్లడం. అమరావతి రాజధాని అంశం అజండాగా పెట్టుకుని ఎన్నికలకు వెళ్లడం. అయితే ప్రస్తుతం ఉన్న 20 మంది ఎమ్మెల్యేల్లో రాజీనామా నిర్ణయానికి చాలా మంది అంగీకరించే అవకాశం లేదు. అంటే ఆ ప్రాంతాల సెంటిమెంట్లు..

ఇతర జిల్లాల పరిస్థితులు చూసుకుని మళ్ళీ గెలుస్తామా లేదా అనుకుంటే చాలా మంది తిరిగి గెలిచే అవకాశం లేదు అని అంతర్గతంగా మధన పడుతున్నారట. అందుకే అన్ని జిల్లాల్లో 20 మంది కాకపోయినా కృష్ణ, గుంటూరు జిల్లాలోని ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి పోరాటాన్ని ఉదృతం చేసి వైసీపీ ఒత్తిడి తీసుకురావాలని కూడా టిడిపి యోచిస్తోంది. ఇలా రాజధాని పోరాటంలో భాగంగా టీడీపీ వద్ద ఎటువంటి సంచలనాత్మక ఆలోచనలు ఉన్నాయి. ఆ పెద్దలు ఏమి నిర్ణయిస్తారు? చంద్రబాబు ఏమి ఖరారు చేస్తారు అనేది కొద్ది రోజుల్లో తేలిపోనుంది.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju