NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ నేతల పడిగాపులు .. బాబు గారు పగ్గాలు ఇవ్వకపోతే లాగేసుకునేలా ఉన్నారు ! 

తెలుగుదేశం పార్టీలో యువ నాయకులను బరిలోకి దింపాలని అధ్యక్షుడు చంద్రబాబుపై ఎప్పటి నుండో సీనియర్ నేతలు ఒత్తిడి చేస్తూ వస్తున్నారు. 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్టీ ఓడిపోయిన తర్వాత జరిగిన ప్రతి సమావేశంలో చంద్రబాబు కి కింది స్థాయి సీనియర్ నాయకులు నుండి వినబడుతున్న ఒకే ఒక డిమాండ్ పార్టీని యువ నాయకుల చేతులలో అప్పజెప్పాలని. కానీ చంద్రబాబు వైఖరి చూస్తే వారసుడు నారా లోకేష్ సరిగ్గా పొలిటికల్ గా లైన్ లో పడే అంతవరకు పార్టీ పగ్గాలు మరెవరికీ కింది స్థాయిలో ఉన్న కార్యకర్తలకు కూడా అప్పజెప్పాలనే ఆలోచనలో మొన్నటి వరకూ ఉండటం జరిగిందట.

 

Nara Lokesh Lunch Meeting With TDP Young Leaders ...అయితే ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డి, అచ్చెన్నాయుడు అరెస్ట్ సమయములో పార్టీపరంగా వారి కుటుంబాలను ఆదరించడం కార్యకర్తలకు ధైర్యం చెప్పిన విధానం చాలా అద్భుతంగా కీలక విషయాలను డీలింగ్ విషయంలో సరిగ్గా సరైన రాజకీయ నాయకుడిగా నారా లోకేష్ వ్యవహరించడం జరిగింది. అంతేకాకుండా జగన్ ఏడాది పరిపాలన టైం లో సింగిల్ గా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తనదైన శైలిలో జగన్ పరిపాలన పై పంచులు వేశారు. గతంలో మాదిరిగా ఎక్కడ కూడా తడబడకుండా లోకేష్ వ్యవహరించిన తీరు పార్టీ క్యాడర్ కు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇలాంటి తరుణంలో ఇదే సరైన టైమ్ అని లోకేష్ కి పూర్తిగా పార్టీ బాధ్యతలు అప్పజెప్పాలని పార్టీ నాయకులు చంద్రబాబుపై ఒత్తిడి తీసుకు వస్తున్నారు అట. మరోపక్క నారా లోకేష్ కి పార్టీ బాధ్యతలు అప్పజెప్పితే, ఆయనతోపాటు తమ వారసులను కూడా రంగంలోకి దింపాలని టీడీపీ సీనియర్ నాయకులు ఆరాటపడుతున్నారు.

 

ఆ వారసులు లిస్ట్ చూస్తే చాలా పెద్దగానే ఉంది. ఉత్తరాంధ్ర నుండి పెందుర్తి మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, అయ్యన్నపాత్రుడు తనయులు., తూర్పుగోదావరి నుండి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె. వీళ్లంతా పార్టీ ఎప్పుడు సై అంటే అప్పుడు పార్టీ తరపున పదవి అందిపుచ్చుకోవడానికి రెడీగా ఉన్నారట. ఇక పశ్చిమగోదావరి జిల్లాలో మాగంటి బాబు కుమారుడు మాగంటి రాంజీ తెలుగు యువత అధ్యక్షుడు పదవి కోసం ఎదురుచూస్తున్నారట. చంద్రబాబు ఎప్పుడు లోకేష్ కి పూర్తి బాధ్యతలు అప్పగిస్తారో కాచుకుని ఉన్నారట. ప్రస్తుత పరిస్థితులు బట్టి ఆయా జిల్లాలలో ఈ నేతలంతా చంద్రబాబు ఇవ్వకపోయినా తమకి వచ్చే పదవి గురించి ముందే చెప్పుకుని నియోజకవర్గాలలో చలామణి అవుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మొత్తంమీద చూసుకుంటే బాబు గారు పగ్గాలు అప్పజెప్పక పోయినా గానీ లాగేసుకోవటానికి ఈ నేతల వారసులు పడిగాపులు కాస్తున్నట్లు టీడీపీ పార్టీ లో టాక్.  

Related posts

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N