ఏదో రకంగా ఆ విషయంలో జగన్ ని దెబ్బకొట్టాలని టిడిపి ప్రయత్నాలు…??

Share

అధికారంలోకి వచ్చిన జగన్ సంక్షేమ పథకాలు అమలు చేసే విషయంలో ఎక్కడా పక్షపాతం చూపకుండా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. పార్టీ, కులం, మతం గాని అలాంటివి ఏమీ పట్టించుకోకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందిస్తూ వస్తున్నారు. గత ప్రభుత్వంలో అయితే జన్మభూమి కమిటీలు అని చాలా వరకు అధికార పార్టీకి చెందిన వారికి మాత్రమే సంక్షేమ పథకాలు అన్నట్టు అందించటం తెలిసిందే.

YS Jagan losing out key leaders to AP CM Chandrababu Naiduకాని జగన్ గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు నేరుగా వారి ఇంటి దగ్గరికే అందేలా చర్యలు తీసుకుంటున్నారు. గ్రామ సచివాలయం, గ్రామ వాలంటీర్ల వ్యవస్థతో దాదాపు ప్రభుత్వ పనులు సకాలంలో జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విధంగా పరిపాలన పరంగా రాష్ట్ర ప్రజల చేత శభాష్ అనిపించుకున్న మరో పక్క తన ప్రత్యర్థి పార్టీ టిడిపి కి భవిష్యత్తు లేకుండా సరి కొత్త ఎత్తుగడలతో జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు.

 

ఈ క్రమంలో బీసీ వర్గాన్ని టార్గెట్ చేస్తూ జగన్ అమలు చేస్తున్న పథకాలు… వలన బీసీ వర్గాల లో వైసీపీ కి బాగా ఆదరణ పెరిగిందని ఇటీవల వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి తెలుగు రాజకీయలో బీసీ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా టిడిపికి పడేవి. టిడిపి పార్టీ స్థాపించిన నాటి నుండి బీసీలు ఆ పార్టీకి వెన్నెముకగా ఉండేవారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వాల లో ఎన్నడూ జరగని మేలులు తన ఏడాదిన్నర పరిపాలనలో బీసీలకు చేయటంతో చాలావరకు బీసీ వర్గాల ఆలోచన మారినట్లు పరిశీలకుల మాట. ముఖ్యంగా ఆర్థికంగా అదేవిధంగా రాజకీయంగా గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ బీసీ వర్గాలకు మేలు చేస్తూనే ఉన్నారు.

 

వైయస్సార్ నేతన్న హస్తం, చేదోడు, వైయస్సార్ చేయూత ఇలా అనేక పథకాలతో బీసీ సామాజిక వర్గ ప్రజలకు ఆర్థికపరమైన మేలు చేసుకుంటూ వస్తున్నారు. దీంతో బీసీ వర్గాలకు రోజురోజుకీ జగన్ దగ్గరవడం పట్ల టీడీపీ పార్టీ జీర్ణించుకోలేకపోతున్నాట్లూ వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే చంద్రబాబు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల వర్చువల్ సమావేశాలలో కూడా.. పార్టీకి బీసీలు దూరమయ్యారని తిరిగి వారిని దగ్గర చేసుకోవడానికి నాయకులు ముందుండి నడవాలని పిలుపునిచ్చారు అనే టాక్ పార్టీలో అంతర్గతంగా వినబడుతుంది. ఏదిఏమైనా బిసి వర్గాలకు దగ్గరవుతున్న వై.ఎస్.జగన్ని ఏదోరకంగా దెబ్బకొట్టాలని… టిడిపి హైకమాండ్ ఆలోచన చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా పార్టీ కొత్త కమిటీల నియామకం లలో గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ నియమించటం… జగన్ ఎఫెక్టే అని ఏపీ పాలిటిక్స్ లో టాక్.


Share

Related posts

పవన్ పిల్లలు: పోలేన – మార్క్ శంకర్ ఫొటోస్ వైరల్!

Naina

క‌రోనా రోగి ఉన్న ప్ర‌దేశంలోని గాలితోనూ క‌రోనా వ‌స్తుంది..!

Srikanth A

పట్టాలు తప్పిన సీమాంచల్ ఎక్స్‌ప్రెస్, ఏడుగురు మృతి

somaraju sharma