ఎన్నికల కోసం జగన్ ఫార్ములా ఫాలో అవుతున్న తెలంగాణ బిజెపి..!!

తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీ ఎలాగైనా రాబోయే సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించాలని తహతహలాడుతోంది. కరోనా వైరస్ కంట్రోల్ చేయటం విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అన్నట్టుగా విమర్శలు చేసి ఇటీవల టిఆర్ఎస్ ప్రభుత్వం నాయకులను ఇరకాటంలో పెట్టిన బిజెపి త్వరలో తెలంగాణలో జరగబోయే దుబ్బాక ఉప ఎన్నికలకు అదే రీతిలో స్థానిక ఎన్నికలకు పార్టీని పటిష్ట పరచడానికి జగన్ ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు సమాచారం. పూర్తి విషయంలోకి వెళ్తే దుబ్బాక ఎన్నికలలో సత్తా చాటుతామని చెబుతున్న కమలదళం బూత్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ నాయకులను ఏకతాటి పైకి తీసుకొస్తుంది.

KCR-Jagan have 'secret pact' on Krishna water, says BJP - The Hinduఇటు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలలో మెజార్టీ స్థానాలు సాధించడానికి గ్రేటర్ లో పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ చేత పాదయాత్ర చేయనున్నట్లు టాక్ వస్తోంది. మేయర్ పదవిని టార్గెట్ చేసుకుని గ్రేటర్ హైదరాబాద్ లో బిజెపి పార్టీ సత్తా చాటడానికి పూర్తిగా వ్యూహాలను సిద్ధం చేసుకున్నట్లు తెలంగాణ రాజకీయాల్లో టాక్ వస్తోంది. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇప్పుడున్న సిట్టింగ్ స్థానంతో పాటు మరో స్థానాన్ని కూడా గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ బిజెపి లీడర్లు.

పట్టభద్రులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు తమకే ఓటు వేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కమలదళం రెడీ అవుతుంది. మరి కమలదళం వ్యూహాలు ఎంత వరకు సక్సెస్ అవుతాయో చూడాలి. ముఖ్యంగా వైఎస్ జగన్ మాదిరిగా గ్రేటర్ హైదరాబాద్ లో అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర కచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ కి పార్టీకి మైలేజ్ తీసుకు రావటం గ్యారెంటీ అనే భావన బీజేపీ నేతలు ఉన్నారట.