NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

నియంత్రణ సాగుపై కేసీఆర్ సర్కార్ పీఛేముడ్..!ఎందుకంటే..?

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవసాయ రంగానికి సంబంధించి పలు సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. రాష్ట్రంలో నియంత్రణ సాగును రద్దు చేస్తూ కేసిఆర్ సర్కార్ నిర్ణయం తీసుకున్నది. ఇక పై రాష్ట్రంలోని రైతులు తమకు ఇష్టమున్న ప్రదేశంలో పంటను విక్రయించుకోవచ్చని సీఎం కేసిఆర్ ప్రకటించారు. రైతులు తాము నచ్చిన పంట వేసుకోవచ్చని, గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఉండవని స్పష్టం చేశారు. పంటల కొనుగోలు ద్వారా మొత్తం రూ.7,500లు కోట్లు నష్టం రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేసిఆర్ వెల్లడించారు. ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదని ఈ సందర్భంగా కేసిఆర్ వ్యాఖ్యానించారు.

అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను తూర్పార పట్టిన కేసీఆర్..ఇప్పుడు అవే చట్టాలను సాకుగా చూపుతూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను శాశ్వతంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. అయితే ఇదే సందర్భంగా రైతులకు భారీగా ఊరట కల్గించేలా మరో నిర్ణయం తీసుకున్నారు కేసిఆర్. సోమవారం (డిసెంబర్ 28న) రైతు బంధు పథకం డబ్బులను రైతుల ఖాతాలో జమ చేేయనున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం ప్రగతి భవన్ లో వ్యవసాయ రంగానికి సమస్యలు, ప్రగతిపై సమీక్ష జరిపారు. పలువురు కీలక నేతలు, పలువురు ఉన్నతాధికారులతో కెసిఆర్ చర్చించి ఈ నిర్ణయాలను ప్రకటించారు.

నియంత్రణ సాగులో భాగంగా సన్నరకం వడ్లను పండించాలన్న కేసిఆర్ ప్రభుత్వ నిర్ణయానికి రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సమీక్ష జరిపి ఈ నిర్ణయం తీసుకున్నది. ఎప్పుడు ఏ పంట వేయాలో రైతులే నిర్ణయించుకోవాలని సూచించారు. పంటల సాగుకు సంబంధించి ఇకపై ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయదని స్పష్టం చేశారు. రైతు బంధు పథకం కింద 7,515 కోట్లు పంట సాయంగా అందిస్తున్నట్లు సీఎం కెసిఆర్ వెల్లడించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N