Breaking: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గత కొద్ది రోజుల నుండి భారీగా వివిధ శాఖలకు సంబంధించి నోటిఫికేషన్ లు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్ననే టీచర్.. అంతకుముందు వైద్య శాఖ కు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయగా తాజాగా పోలీస్ శాఖలో భారీ స్థాయిలో వివిధ శాఖలకు సంబంధించిన పోస్ట్ లు భర్తీ చేయడానికి పూనుకుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగింది. దీనిలో భాగంగా 414 ఎస్సై పోస్టులు, స్పెషల్ పోలీస్ ఫోర్స్..కి సంబంధించి 390, అగ్ని శాఖకు సంబంధించి 610..ఇంకా100 డ్రైవర్ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మే 2 తారీకు నుండి 20 తారీకు లోపు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి. మొత్తంగా 16 వేలకు పైగా పోస్ట్ లు భర్తీ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?