NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

తెలంగాణలో సీఎం వర్సెస్ గవర్నర్ … అదేంటో మీరే చూడండి..!

కెసిఆర్ తన తెలివితేటలు, తన ప్రతిభాపాఠవాలు, తన పవర్ మొత్తం చూపించడానికి కరోనాను వాడుకున్నారు. కానీ కరోనానే కేసీఅర్ పై తన ప్రతిభ, తన పవర్, తన తెలివి మొత్తం చూపించి ఫాంహౌస్ లో పడుకోబెట్టింది. తీరా కరోనా గురించి మొత్తం తెలుసుకున్న తరువాత కేసీఅర్ మాటలు తగ్గాయి. చేతలు తగ్గాయి. మూటగట్టుకున్న మంచి పేరు తగ్గింది. పవర్ కూడా తగ్గిపోయే సమయానికి గవర్నర్ వచ్చారు. గవర్నర్ పవర్ చేజిక్కించుకొని కాస్త పావులు కదిపే సమయానికి మళ్లీ కేసీఆర్ నిద్రలేచారు. మొత్తానికి గవర్నర్ తమిళిసై మేల్కొని కరోనా పై సమీక్ష చేయాలనుకునే వరకు కెసిఆర్ ఫాం హౌస్ నుంచి రాలేకపోయారు. ఇదన్న మాట తెలంగాణలో కేసీఆర్ వర్సెస్ గవర్నర్ పరిస్థితి.

గవర్నర్ తమిళ్ సై కరోనా వైద్య సేవల పై సమీక్ష చేసిన చేయడంతో.. కేసీఅర్ అలెర్ట్ అయ్యారు. నష్ట నివారణ చర్యలు చేపట్టారు. కరోనా పరీక్షలు, చికిత్సల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవి ఏమిటంటే.. కరోనా పరీక్షలు అన్ని ల్యాబ్ ల్లో ఉచితంగా చేయడం, ప్రైవేట్ ఆసుపత్రిల్లో కూడా ఉచితంగా కరోనా చికిత్సలు నిర్వహించడం. కేసీఅర్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే నిర్ణయం నెల రోజుల ముందు తీసుకున్నట్లయితే ఇంకా బాగుండేది అని అంటున్నారు. బుధవారం నాడు కరోనాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో ఉచితంగా కరోన చికిత్సలు అందించేలా ఉత్తర్వులు జారీ చేశారు. ముందుగా మూడు మెడికల్ కాలేజీల్లో, తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిగతా ఆస్పత్రులలో వైద్యం ఉచితంగా అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కెసిఆర్ ఆదేశించారు. ఓ పక్క కేసీఆర్ నిర్ణయానికి ప్రజల నుండి ప్రశంసలు వస్తుండగా, ప్రతిపక్షాలు మాత్రం విమర్శలు సంధిస్తూనే ఉన్నారు. గవర్నర్ రంగంలోకి దిగి వరకు కేసీఆర్ కు కరోనా పరిస్థితి అర్థం కాలేదా అని ప్రశ్నిస్తున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju