NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ దెబ్బకు బాబు దిమాక్ ఖరాబయిందంటున్న తెలుగు తమ్ముళ్ళు!

హిందూత్వ ఎజెండాను ఎత్తుకోవడం ద్వారా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి తప్పులో కాలేశారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.వైసీపీ ట్రాప్లో చంద్రబాబు చిక్కుకు పోయ్యారని వారు అంటున్నారు.ఏడాదిన్నర క్రితం అధికారం లోకి వచ్చిన దగ్గర నుంచి జగన్ ప్రభుత్వం టిడిపిని ముప్పుతిప్పలు పెడుతోంది.

 Telugu brothers who are angry with Jagan stroke
Telugu brothers who are angry with Jagan stroke

టిడిపి ఎమ్మెల్యేలు నలుగురిని లాగేసుకోవటం మరికొందరికి గాలం వేయడంతో పాటు మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర తదితరులను అరెస్టు చేయించటం,టిడిపి ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలను వెలికి తీయటం వంటి చర్యల ద్వారా జగన్ ..చంద్రబాబు నాయుడుకు నిద్రలేకుండా చేస్తున్నారు.దీంతో చంద్రబాబు కూడా అయోమయంలో పడిపోయారు ఎలాగ వైసీపీని ఎదుర్కోవాలో తెలియక తప్పు మీద తప్పు చేస్తున్నారంటున్నారు.ఇసుక కొరత, రాజధాని తరలింపు ,కరోనా సహాయక చర్యలు తదితర అంశాలను చంద్రబాబు పట్టుకుని జగన్ ప్రభుత్వం మీద పోరాడటానికి ప్రయత్నించినా ప్రజల నుండి పెద్దగా స్పందన రాలేదు.దీంతో ఆయన తన పోరాట పంథాను మార్చుకున్నారు .ఇంతలో రాష్ట్రంలో కొన్ని మతపరమైన ఘటనలు చోటుచేసుకున్నాయి.అంతర్వేది రధం దగ్దం, దుర్గ౬మ్మ గుడిలో రధంలో సింహాలు మాయమవ్వడం, మరికొన్ని ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం ,అపహరణ వంటి సంఘటనలు వరుసగా జరిగాయి.వెంటనే చంద్రబాబు వీటన్నిటిపైనా సీరియస్గా రియాక్ట్ అయ్యారు.

అంతేగాక సిఎం జగన్ తిరుపతి పర్యటనకు వెళ్తుంటే ఆయన డిక్లరేషన్పై సంతకం పెట్టాలని భార్యతో కలిసే స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించాలని ఒక ప్రకటన కూడా చేశారు.నిజానికి టిడిపి వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావే తిరుమల బ్రహ్మోత్సవాల్లో భార్యతో కలిసి శ్రీవారికి పట్టు సమర్పించలేదు.ఆ విషయాన్ని మరుగునపెట్టి చంద్రబాబు జగన్ కు సుద్దులు చెప్పటం విమర్శలకు తావిచ్చింది.ఆలయాల్లో జరిగిన సంఘటనలపై చంద్రబాబు స్పందించిన తీరు కూడా చాలా మందికి రుచించడం లేదు.అయితే రాష్ట్రంలో ఒంటరిగా వైసీపీని ఎదుర్కోలేక బీజేపీకి దగ్గరవడం కోసం చంద్రబాబు హిందూత్వ అజెండాను పట్టుకునే ప్రయత్నం చేసి రాష్ట్రంలో ఒక వర్గానికి దూరమైపోయారని టిడిపి వర్గాలే భావిస్తున్నాయి.

రాష్ట్రంలో వైసీపీ బీజేపీలో కలహించుకుంటూనట్లు కనిపిస్తున్నా ఢిల్లీలో వారి దారులు ఒకటిగానే ఉన్నాయి.దీన్ని కూడా చంద్రబాబు గ్రహించలేక బిజెపిని ఎలాగైనా ప్రసన్నం చేసుకోవడానికి తన పంథా మార్చి ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.చంద్రబాబు బుర్రను కూడా పని చేయనీయనంత వేగంగా వైసిపి ప్రభుత్వం ఆయన్ను గందరగోళ పరుస్తోందనడానికి ఇదే నిదర్శనం.

author avatar
Yandamuri

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!