Telugu Desam Party: టీడీపీకి ఎన్ని కష్టాలో.. ఆందోళనలో పసుపు శ్రేణులు..!!

Telugu Desam Party: Crises Started Cadre in Deep Trouble
Share

Telugu Desam Party: తెలుగు దేశం పార్టీకి గత రెండేళ్లుగా చుక్కలు కనిపిస్తూనే ఉన్నాయి.. జగన్ అధికారంలోకి వచ్చిన రోజు నుండీ టీడీపీ పతనం ఒక్కో మెట్టూ దిగుతూనే ఉంది. అయితే అది అంత సులువు కాదు. చంద్రబాబు లాంటి కాకలు తిరిగిన రాజకీయ యోధుడు. మొత్తం తెలిసిన.. ఇండియా రాజకీయాన్ని అధ్యయనం చేసిన మంచి దిట్ట. అందునా టీడీపీ అంటే చిన్న చితకా పార్టీ కాదు. దశాబ్దాల తరబడి పాతుకుపోయిన పార్టీ. దేశంలో సంస్థాగత బలం ఉన్న ప్రాంతీయ పార్టీల్లో టాప్ – 5 లో టీడీపీ ఉంటుంది. అటువంటి తెలుగు దేశం పార్టీని తొక్కి పట్టెయ్యాలి.. నార తీయాలి.. మూయించెయ్యాలి.. అంటే జగన్ వల్ల అంతగా సాధ్యం కాకపోవచ్చు. అది దురాశే అవుతుంది. ప్రతిపక్షాన్ని అకారణంగా.. చిన్న కారణాలు చూపి ఇబ్బందులు పెట్టడం రాజకీయాల్లో ఇప్పటి వరకు లేని సంస్కృతి.. అయితే జగన్ వైఖరి అలా ఉంది..! అందుకే టీడీపీకి అనూహ్యంగా కష్టాలు మొదలయ్యాయి..

Telugu Desam Party: Crises Started Cadre in Deep Trouble
Telugu Desam Party: Crises Started Cadre in Deep Trouble

Telugu Desam Party: ఈ వారంలో చూసుకుంటే…!!

ఈ వారంలో జరిగిన కొన్ని ఘటనలే చూసుకుంటే టీడీపీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసేట్టుగానే ఉన్నాయి. వరుసగా ఘటనలు టీడీపీకి నష్టం కలిగించేలా ఉన్నాయి. గత ఏడాదిలో కరోనా కాలం నుండి కోలుకుని.. ఇప్పుడిప్పుడే జనంలో చైతన్యం అవుతున్న లోకేష్, చంద్రబాబుల పోరాటాన్ని దెబ్బ కొట్టేలా ఉన్నాయి..

* గుంటూరు జిల్లాలో కీలక నేత, చంద్రబాబుకి ఇష్టమైన నాయకుడు ధూళిపాళ్ల నరేంద్రని ఓ పాత కేసులో అరెస్టు చేశారు. ఎప్పుడో 2010 లో నమోదైన కేసులను తెరపైకి తీసుకువచ్చి.. తాజాగా అక్రామాలను నిర్ధారించి.. నానరేంద్రను అరెస్టు చేశారు. అక్కడితో ఆగలేదు. ఆ సంగం డెయిరీ మొత్తం ప్రభుత్వ పరం అయ్యేలా చర్యలు మొదలయ్యాయి. ఇది కాస్త కలవరపాటు అంశమే.

* విశాఖ నగరంలో మాజీ ఎమ్మెల్యే.. విశాఖ ఉక్కు పోరాటంతో పేరొందిన పల్లా శ్రీనివాస్ కి చెందిన నిర్మాణంలో ఉన్న ఓ వాణిజ్య భవనాన్ని కొంత కూల్చారు. ఆయన ఆక్రమించుకుని నిర్మిస్తున్నారని.. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టారని దాన్ని కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. అక్కడితో విశాఖ నగరంలో టీడీపీ ఉలిక్కిపడింది.

Telugu Desam Party: Crises Started Cadre in Deep Trouble
Telugu Desam Party: Crises Started Cadre in Deep Trouble

* మాజీ మంత్రి దేవినేని ఉమాపై సీఐడీ కేసు నమోదు చేసింది. మార్ఫింగ్ వీడియో చేశారనే.. ఐటీ చట్టం ప్రకారం ఆయనపై కొన్ని కేసులు నమోదయ్యాయి. నిజానికి ఆయన దొరికితే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టేవారేమో .. కానీ ఉమా కొన్ని రోజులు సిఐడి కి కనిపించకపోవడం.. ఆపై ముందస్తుగా కోర్టుకి వెళ్లడం జరిగిపోయాయి. దీంతో కృష్ణా జిల్లాలో టీడీపీ కొంత ఆత్మా స్థైర్యం కోల్పోయింది.

* ఇంకా టీడీపీలో కీలక నేతల జాబితా జగన్ వద్దనే ఉంది. దీని మీదనే ఒక టీమ్ నిత్యం పరిశోధన.., పరిశీలన చేస్తుంది. ఈ అరెస్టుల జాబితాలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్.., అయ్యన్న పాత్రుడు.., తదితరులు ఉన్నట్టు చెప్పుకోవచ్చు. టీడీపీ నేతలను ఎప్పుడు.., ఏ విధంగా అరెస్టు చేయాలి..? వారి తప్పులు ఏమున్నాయి..? ఏ ఏ సెక్షన్లు అమలు చేయొచ్చు.. అనే శోధన చేసి ఇరికిస్తున్నారు. దీనిలో టీడీపీ స్వయం కృతాపరాధాలు ఎన్ని ఉన్నాయో… సీఎం జగన్ అతి రాజకీయం కూడా అలాగే ఉంది. అధికారంలో ఉన్నప్పుడు కన్నూ మిన్నూ ఆనక నాడు టీడీపీ నేతలు చేసిన కొన్ని అవినీతి వ్యవహారాలు ఇప్పుడు జగన్ బయటకు లాగుతూ.. వాటి పని పడుతున్నారు. యాభై ఉన్నదాన్ని వందగా చూపిస్తూ నొక్కి పెడుతున్నారు. సో… అవకాశం ఇచ్చింది టీడీపీ.., అనుభవిస్తుంది టీడీపీ..!


Share

Related posts

టోటల్ గా పద్మవ్యూహం లో ఇరుక్కున్న నూతన్ నాయుడు అండ్ ఫామిలీ…!

arun kanna

దొరికిందే సందు అని దూరేందుకి చోటు లేదు చంద్రబాబు…!

siddhu

Kim: ప్ర‌పంచాన్ని వ‌ణికించిన నియంత కిమ్‌ నేడు బిత్త‌ర‌చూపుల‌తో…

sridhar