NewsOrbit
రాజ‌కీయాలు

Andhra Pradesh: అదే నిజమైతే ఏపీ ఏమవ్వాలి..!? అత్యాచారాల వెనుక ఘోరమైన నిజాలు – సీక్రెట్ లు..!

Andhra Pradesh: ఏదైనా ఒక ఘటన జరిగితే కారణాలు అన్వేషించాలి.. దుర్ఘటన జరిగితే మళ్ళీ అలా జరగకుండా చర్యలు చేపట్టాలి.. కానీ ఏపీలో ఎందుకో ఘటనలు, దుర్ఘటనల మూలాల్లోకి వెళ్లట్లేదు అనిపిస్తుంది.. వరుస అత్యాచారాలు ఏపీలో చాల మందిని కలవరపెడుతున్నాయి..! ఆడపిల్లల భద్రతని ప్రశ్నర్ధకం చేస్తున్నాయి.. దీన్ని సీఎం జగన్ చెప్పినట్టుగా “టీడీపీ వాళ్ళ పని.. ప్రతిపక్షాల కుట్ర” అని కొట్టిపారేయలేం.. అత్యాచారాల ఘటనలను ప్రతిపక్షాల పనే అని చెప్పి చేతులు దులుపుకోవడం ఏ ముఖ్యమంత్రికి మంచిది కాదు..” వాటి మూలాల్లోకి వెళ్ళాలి, తన చేతిలో ఉన్న వ్యవస్థల ద్వారా కారణాన్వేషణ చేయాలి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.. అయితే..! ఇప్పుడు ఏపీలో ఈ దారుణాలకు అసలు కారణాలు మాత్రం వేరే వినిపిస్తున్నాయి..

వరుస ఘటనలు..! కానీ..!?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొద్ది రోజులుగా అత్యాచారాలు జరుగుతున్నాయి. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఓ మానసిక వికలాంగురాలిని ముగ్గురు తీసుకుని వెళ్లి గ్యాంగ్ రేప్ చేసిన తరువాత విజయనగరంలో ఒక దారుణ ఘటన, రేపల్లెలో మరో దారుణమైన దుర్ఘటన.. తర్వాత విశాఖ జిల్లా ఘటన, అనంతపురం, కర్నూల్ ఇలా వరుసగా చాలా దారుణమైన.. పాసవిక ఘటనలు జరుగుతున్నాయి. ఆరు సంవత్సరాల బాలిక ను సైతం తీసుకోని వెళ్లి దారుణంగా రేప్ చేసిన ఘటన, రైల్వే స్టేషన్ లో రైలు కోసం వేచి ఉన్న భార్యభర్త లో భర్త ను కొట్టి భార్యను రేప్ చేసిన ఘటన ఇలా రాష్ట్రం లో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత దౌర్భాగ్యకరంగా మనవీయత ఎక్కడకు పోతుంది..? హ్యుమానిటీ చచ్చిపోయిందా..? అని అందరూ ఆలోచించాల్సినట్లుగా, ఆడపిల్లను బయటకు పంపించాలి అంటేనే భయపడేటట్లుగా, భార్యను బయటకు పంపాలి అంటే ఓ భర్త భయపడే విధంగా.., ఓ అక్కనో, చెల్లినో బయటకు పంపాలి అంటే ఓ సోదరుడు భయపడేటట్లుగా ఘటనలు జరుగుతున్నాయి. తెలుగు వాళ్ళం అని గర్వంగా చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. దీనికి కారణాలు ఏమిటి? ఎందుకు ఇంతటి దారుణమైన ఘటనలు జరుగుతున్నాయి? పోలీసుల విఫల్యమా..? ప్రభుత్వ వైఫాల్యమా? రాజకీయ కోణమా..?ఏమిటి.?.

సీఎం అలెర్ట్ అవ్వాలి..!

ఏపీలో ఈ అంశంలో రాజకీయ వాదనలు పక్కన పెట్టి.. అసలు రాష్ట్రంలో అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు ఎక్కువ అయ్యాయి అనే దానిపై ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది.

* వీటికి కారణాలు పరిశీలిస్తే.. మునుపెన్నడు లేనివిధంగా ఏపీలో విచ్చలవిడిగా గంజాయి లభ్యం అవుతోంది. ఇది మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుందా, ఇతర రాష్ట్రాల నుండి సరఫరా

అవుతుందా? ఇంకా ఎక్కడి నుండి దిగుమతి చేసుకుంటున్నారా అనేది అనవసరం కానీ గంజాయి విస్తృతంగా లభిస్తుంది. గంజాయి సేవించే వాళ్ళు ప్రతి ఊళ్ళో ఉంటున్నారు. వీళ్లని గంజాయి బ్యాచ్ అంటారు. ఏలూరు, రాజమండ్రి, ఒంగోలు తదితర ప్రాంతాల్లో గంజాయి బ్యాచ్ లు ఉన్నారు. రాత్రి 11గంటల నుండి తెల్లవారు జాము 3 గంటల వరకు ఆ ప్రాంతాలలో వాళ్లదే హవా. ఆ సమయంలో అటు వెళ్ళాలి అంటే అటు గంజాయి బ్యాచ్ ఉంటుంది అని భయపడేవారు. కొన్ని చూట్ల పోలీసులు నియంత్రణ వల్ల వల్ల భయంతో కొంత తగ్గినప్పటికి మళ్ళీ మొదలు అయింది. విజయవాడ లోనూ కొన్ని ప్రాంతాల్లో గంజాయి బ్యాచ్ తిష్ట వేశారు. కొన్ని ప్రాంతాల్లో గంజాయి తాగే ఆకతాయిలు ఉన్నారు. వాళ్లకు ఏమి భయం ఉండదు. రోజు అంతా ఎదో పని చేసుకుంటారు. వచ్చిన డబ్బులతో గంజాయి తాగి రోడ్డున పడుతున్నారు. కనిపించిన వాళ్ళ మీద ఎగబడుతున్నారు. దానితో పాటు మద్యం. అసలే మద్యం ఆరోగ్యానికి హానికరం. మద్యం ఎక్కువ తాగితే..వాళ్ళ మైండ్ లో వికృత ఆలోచనలు వస్తాయి. చీప్ లిక్కర్ తాగడం, గంజాయి సేవించడం వల్ల పిచ్చి పిచ్చి ఆలోచనలు వాళ్లలో వస్తున్నాయి. వీళ్ళు రెచ్చి పోయి వికృత చేష్టలకు పాల్పడుతున్నారు.

* మద్యం, గంజాయి ని ప్రభుత్వం అరికట్టగలదా..?. ఖచ్చితంగా అరికట్టగలదు. ఇది ప్రభుత్వం, పోలీసుల చేతిలో ఉంది. రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఓ ముఖ్యమంత్రి గా పోలీస్ శాఖతో సమీక్షించి అటువంటి ఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించాల్సి ఉండగా, ఓ బహిరంగ వేదిక మీద టీడీపీ వాళ్లే కారణం అని చెబుతున్నారు అంటే ఆలా చేయడం సమంజసమేనా అని ఆలోచించుకోవాలి. రాష్ట్రం లో పరిస్థితి భయానకరంగా ఉంది. రెండేళ్ల క్రితం హిందూ దేవాలయాలపై విపరీతంగా దాడులు జరిగాయి. ఈ దాడుల వెనుక రాజకీయ కోణం ఉంది. తమ పార్టీ ని పైకి లేపే క్రమంలో కొంత మంది ఆలా చేశారు అని అనుకున్నారు. ఇప్పుడు ఈ ఘటనలు జరుగుతున్నాయి. ఈ ఘటనలు కూడా ఒక రాజకీయ పార్టీ ని నిర్వీర్యం చేసే కోణమా అని ఆలోచించాలి. వీటిపై అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది..!

author avatar
Srinivas Manem

Related posts

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!