కుక్కలాగా ఉండలేక అంటూ టీడీపీ ని ఏకిపారేసిన ఎమ్మెల్యే…??

ఇటీవల చంద్రబాబు పార్టీకి సంబంధించి కొత్త కమిటీలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 25 పార్లమెంట్ ఇన్చార్జి పదవులను దాదాపు కొత్తవారికి అవకాశం కల్పించే రీతిలో చంద్రబాబు జాగ్రత్తలు తీసుకున్నారు. పరిస్థితి ఇలా ఉండగా టిడిపి పార్టీ నుండి వైసీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యే ఇప్పుడు ఆ పార్టీకి తలనొప్పిగా మారారు. పూర్తి విషయంలోకి వెళ్తే విశాఖ రెబల్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ టీడీపీపై కాంట్రవర్సీ కామెంట్లు చేశారు.

Breaking News: Another Wicket Down In TDPఇటీవల విశాఖపట్టణం బీచ్ రోడ్డులో వైయస్సార్ విగ్రహానికి నూతన కార్పొరేషన్ల చైర్మన్లు పాలాభిషేకం చేశారు. జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, అదీప్ రాజు, వాసుపల్లి గణేష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ మాట్లాడుతూ…. భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు ప్రాధాన్యత ఇచ్చారు వైయస్ జగన్ అని కొనియాడారు. కలలో కూడా ఊహించని విధంగా సీఎం జగన్ బి.సి లకు పెద్దపీట వేసి పదవులు అప్పగించడమే కాకుండా సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని పొగడ్తలతో ముంచెత్తారు.

 

అంతేకాకుండా గత పాలకులు బీసీలను మోసం చేశారని కామెంట్లు చేసిన ఆయన టిడిపి నాయకులు కుక్కలు లాగా మొరుగుతున్నరు అని పేర్కొన్నారు. అందువల్లనే టీడీపీలో కుక్కలాగా ఉండలేక పార్టీ నుండి బయటకు వచ్చి వైసీపీ పార్టీకి మద్దతు తెలపడం జరిగింది అని స్పష్టం చేశారు రెబల్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్.