Botsa Satyanarayana: ఇటీవల మంత్రి కేటీఆర్ ఓ కార్యక్రమంలో ఏపీలో మౌలిక సదుపాయాలు గురించి చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారాన్ని రేపాయి. ఏపీలో కరెంటు, నీళ్లు, రోడ్లు లేవని మౌలిక సదుపాయాలు అధ్వానంగా ఉన్నాయని కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం రాజకీయ సంచలనం సృష్టించింది. దీంతో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ పార్టీ మంత్రులు, నాయకులు గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. ఈ క్రమంలో విద్యా శాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. హైదరాబాదులో రెండు రోజులపాటు ఉన్నాను. అక్కడ కరెంటు లేదు ..జనరేటర్ మీద కరెంటు రన్ చేయాల్సిన పరిస్థితి ఉందని మీడియా ముందు తెలియజేశారు. దీంతో బొత్స సత్యనారాయణకు TSSPDCL స్పందించినట్లు.. ముందుగా బిల్లు కట్టండి అని తెలియజేసినట్లు ట్విటర్లో షాక్ ఇచ్చినట్లు వార్త వచ్చింది. “మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. మీరు కరెంటు బిల్లు క్లియర్ చేసిన వెంటనే మీ ఇంటికి కరెంటు సరఫరా చేస్తాము. 15 నెలలుగా బిల్లులు చెల్లించలేదు”.. అంటూ మంత్రి బొత్సకు ట్విట్టర్ వేదికగా విద్యుత్ శాఖ కౌంటర్ ఇచ్చినట్లు వార్త వచ్చింది.
అయితే TSSPDCL పేరిట ట్విటర్ అకౌంట్ నుండి వచ్చిన సందేశం.. తెలంగాణ విద్యుత్ శాఖ ఇచ్చింది కాదనీ ఫాక్ట్ చెక్ లో బయటపడింది. ఆ ట్విట్టర్ ఎకౌంట్ కి తెలంగాణ విద్యుత్ శాఖ ఎటువంటి సంబంధం లేదని.. అది ఫేక్ అకౌంట్ అని క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీంతో మంత్రి బొత్సకు ఫేక్ అకౌంట్ ద్వారా కరెంట్ బిల్లు కట్టాలి అని మెసేజ్ వచ్చినట్లు.. క్లారిటీ రావటంతో బొత్సకు తెలంగాణ విద్యుత్ శాఖ షాక్ ఇచ్చినట్లు వచ్చిన వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టినట్లు అయింది.