NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

unanimous : అసలు ఆట ఇప్పుడే మొదలు! ఏకగ్రీవ క్లైమాక్స్!!

unanimous : ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఇప్పటివరకు జరిగింది ఒక లెక్క ఇక నుంచి జరగబోయేది మరో లెక్క… అసలు ట్విస్టులు అసలు ఆట ఇప్పుడే మొదలు కానుంది… సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చిన ట్వస్ట్ ఓ వర్గానికి అనుకూలంగా ఉంటే ఇప్పుడు సెకండ్ హాఫ్ మరింత రంజుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండో భాగం ఆటల్లోనూ ఇప్పటికే ఎత్తులు పై ఎత్తులు అన్ని సిద్ధమయ్యాయి. ప్రభుత్వం పంచాయతీల్లో ఎక్కువశాతం ఏకగ్రీవాలు చేసేందుకు పావులు కదుపుతుంటే, ఎన్నికల కమిషన్ మాత్రం ఏకగ్రీవాలు విషయంలో ఏం చేయాలనే దానిలో మల్లగుల్లాలు పడుతోంది.

ఏకగ్రీవం… జగన్ లక్ష్యం!

ఎన్నికల నిర్వహణ విషయంలో తన మొండి పట్టుదలను వీడి ఎన్నికల కమిషన్కు సహకరించాలని జగన్ ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ దాని వెనుక కొన్ని కీలక విషయాలు ఉన్నట్లు అర్థమవుతోంది. ఎన్నికల నిర్వహణ విషయంలో తనకు సహకరించకుండా న్యాయపరంగా వెళ్లి… తాను అనుకున్నది సాధించి ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు పని కల్పించకుండా ఉండడమే జగన్ ప్రధాన లక్ష్యం.
** ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో పని చేసినప్పటికీ ఎక్కువ పంచాయితీలు ఏకగ్రీవం అయితే ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉండదు. అంటే అప్పుడు ఎన్నికల కమిషన్ అనుకున్నది సగం మాత్రమే పూర్తవుతుంది. ఎన్నికల కమిషన్ అనుకున్నది సాధించినప్పటికీ వారికి కనీసం పని కల్పించకుండా సైలెంట్ గా పెట్టి చోద్యం చూసేలా వారిని చేయడమే జగన్ మాట. ఈ దిశగా సాధ్యమైన అన్ని పంచాయతీల్లో ఏకగ్రీవాలు పూర్తిస్థాయిలో చేయాలని జగన్ ఇప్పటికే తమ నాయకులకు ఆదేశించారు. ఎన్నికలు జరుగుతున్న పంచాయతీలో సామ దాన భేద దండోపాయాలు ఎలాగైనా ఉపయోగించి ఎన్నికలను ఏకగ్రీవం చేసి ఎన్నికల కమిషన్ కు ఎలాంటి పని కల్పించకుండా చేయాలనేది ప్రధాన ఉద్దేశం.

The original game just started! Unanimous climax !!
The original game just started Unanimous climax

ఎన్నికల కమిషన్ పై ఎత్తు!

ఇప్పటికే పలు ప్రసార మాధ్యమాల ద్వారా ఏకగ్రీవాలు చేసుకుంటే భారీగా నజరానాలు ఇస్తాం అని ప్రభుత్వం ప్రకటించింది. దీంతోపాటు వైయస్సార్ సిపి నాయకులు మంత్రులు అందరూ ఏకగ్రీవాలు పాట ఎక్కువగా పాడుతున్నారు. దీనికి ఇప్పటికే ఎమ్మెల్యేలు మంత్రులకు ప్రత్యేకమైన టార్గెట్లను వైఎస్ఆర్సిపి నాయకత్వం ఇచ్చిందనే ది బహిరంగ రహస్యం. ఆయా నియోజకవర్గాల్లో నియోజకవర్గాల వారీగా మండలాల్లో గ్రామాల్లో ఎక్కువ శాతం దాదాపు 90శాతం పైగా ఏకగ్రీవాలు చేసుకు రావాలనేది వైఎస్సార్సీపీ నాయకుల మాట. కొన్నిచోట్ల అధికార పార్టీ కు అనువుగా లేనిచోట్ల ప్రతిపక్షం అభ్యర్థులు బలంగా ఉంటే వారి కైనా సరే ఏకగ్రీవాలు ఇచ్చి ఎన్నికలు లేకుండా చూడాలి అనేది ప్రధాన ఉద్దేశం. ఎన్నికలు జరుగకుండా కేవలం ఏకగ్రీవాలు మీదే ఆధారపడి ఎన్నికల కమిషన్ను నైతికంగా దెబ్బకొట్టాలని జగన్ మనసులోని భావన. అయితే ప్రభుత్వం యొక్క ఆలోచనను ముందే పసిగట్టిన ఎన్నికల కమిషన్ ఏకగ్రీవాలు విషయంలో ఓ కొత్త మెలిక పెట్టింది. ఏకగ్రీవాలు ఇష్టానుసారం చేసుకోవడం కుదరదు అని, దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఓ ప్రత్యేకమైన అధికారిని నియమించారు. ఆయన ఆధ్వర్యంలోనే ఆయన కొనచలం లోనే ఏకగ్రీవాలు జరగాలని ప్రతి విషయం ఎన్నికల కమిషన్కు తెలిసే ఏకగ్రీవం అవ్వాలని కొత్త రూల్ ఎన్నికల కమిషనర్ తీసుకొచ్చారు. అంటే ప్రతి ఏకగ్రీవం ని ఎన్నికల కమిషన్ ఓకే చేస్తేనే అదే పూర్తవుతుందని అన్నమాట.

unanimous : క్షేత్ర స్థాయిలో సాధ్యమా?

ఎన్నికల కమిషన్ కు రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడిన ఆ భాగం నుంచి ఇప్పుడు ఏకగ్రీవాలు అసలు మజా స్టార్ట్ కానుంది. అయితే కీలకంగా ఉండే అధికార పార్టీ కార్యకర్తలు నాయకులు గ్రామాల్లో చేసే సామ దాన భేద దండోపాయాలను ఎన్నికల కమిషన్ ఎలా నిలువరిస్తోంది? గ్రామాల్లో జరిగే ఏకగ్రీవాలు రాజకీయాలను ఎంతమేర అడ్డుకుంటుంది అన్నది ప్రధాన ప్రశ్న. గ్రామాల్లో ముఖ్యంగా అధికార పార్టీలో ఉండే నాయకులదే హవా ఉంటుంది. వారిని కాదని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు పోరాడినప్పటికీ నిలువరించడం సాధ్యం కాదు. వారికి ఎలాగో అధికారపక్షం అండగా ఉంటుంది కాబట్టి.. ఎన్నికల్లో ఏకగ్రీవ లోను అడ్డుకోవడం అంత సులభం కాదు. మరి ఈ ఏకగ్రీవాలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్లబోతోంది దానికి ఎన్నికల కమిషన్ ఏం చేయబోతోంది అనేది అసలైన క్లైమాక్స్ ట్విస్ట్ త్వరలోనే మొదలు కానుంది. ఇది రాజకీయంగాను ఆసక్తి అయ్యే ట్విస్ట్.

author avatar
Comrade CHE

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju