NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు సెటైర్ కార్నర్

ఎంత ప‌ని చేశావు జ‌గ‌న్‌… పార్టీ నేత‌లే త‌ట్టుకోలేక పోతున్నారు

మొద‌టినుంచి భిన్న‌మైన రాజ‌కీయ వేత్త‌గా గుర్తింపు పొంది, ఆ గుర్తింపుతోనే రికార్డు స్థాయి విజ‌యం సొంతం చేసుకున్న వైసీపీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గురించి కొత్త టాక్ వినిపిస్తోంది.

ఆయ‌న కొంద‌రిని హ‌ర్ట్ చేశార‌ట‌. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన నేత‌లు వైఎస్ జ‌గ‌న్‌, ఆయ‌న పార్టీ తీరుతో తెగ ఫీల‌వుతున్నార‌ని అంటున్నారు. అస‌లు ఎందుకు ఫీల‌వుతున్నారో తెలిస్తే, ఇంకా ఆశ్చ‌ర్య‌పోతారు.

వైసీపీ నేత‌ల టాక్ ఏంటంటే….

అదేం చిత్ర‌మో కానీ…గ‌త కొద్దిరోజులుగా ఓ టాక్ పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. వైసీపీ అధినేత జగన్‌ సీఎం హోదాలో ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలుస్తున్నారు అంటే పొత్తు కోస‌మే అన్న‌ది స‌ద‌రు జోస్యం సారాంశం. ఇటీవ‌ల జ‌రిగిన భేటీ స‌మ‌యంలో అయితే ఈ పొత్తు ఎపిసోడ్‌ పీక్స్‌కు చేరింది. ఎన్డీఏలో చేరమని బీజేపీ అధిష్ఠానం అడిగిందని.. ప్రధానితో సీఎం జగన్‌ భేటీలోను ఇదే ప్రధాన చర్చ జరనుందని ఒక‌టే టాక్‌. ఫ‌లానా నేత‌ల‌కు మంత్రి ప‌ద‌వులు ద‌క్క‌నున్నాయ‌ని కూడా కొంద‌రు చెప్పేశారు. బీజేపీ కూట‌మిలో వైసీపీ చేరుతుందన్న ప్రచారం ఏపీ బీజేపీ నేతలను ఉక్కిరి బిక్కిరి చేసింద‌ట‌. కొంద‌రు నేత‌లు అస‌లు ఏం జ‌రుగుతుందో క్లారిటీ రాలేక‌పోయార‌ట‌.

ఢిల్లీ ఎంట‌రైంది

బీజేపీ సార‌థ్యంలోని ఎన్డీఏ కూట‌మిలో వైసీపీ చేరుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జ‌రిగిన నేప‌థ్యంలో, సీఎం జ‌గ‌న్ ఢిల్లీలో ఉన్న ఆ రెండు రోజులు ఏం జరుగుతుందో అర్థంకాక తల పట్టుకున్నారట. ఢిల్లీలో తమకు తెలిసిన వారి దగ్గర ఆరా తీశారట. కొందరైతే పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్‌ సునీల్‌ దేవధర్‌తోనూ మాట్లాడారట. అయితే, అలాంటిదేమీ లేద‌ని తెలియ‌డంతో టెన్ష‌న్ త‌గ్గింద‌ట‌.

ఇప్పుడు అస‌లు టెన్ష‌న్‌

బీజేపీ కూట‌మిలో వైసీపీ చేర‌డం లేద‌ని `ఇప్ప‌టివ‌ర‌కైతే` క్లారిటీ వ‌చ్చిన‌ప్ప‌టికీ ఇంకా బీజేపీ నేత‌ల టెన్ష‌న్ త‌గ్గ‌డం లేదంటున్నారు. అదేంటంటే, బీజేపీ- వైసీపీ పొత్తుల ప్రచార ప్రభావం పార్టీపై తీవ్రంగా ఉండొచ్చని కమలనాథుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. ఎన్డీయే కూట‌మిలో వైసీపీ ఇప్ప‌టికిప్పుడు చేరకపోయినా కేంద్రానికి వైసీపీ దగ్గర అనే మెసేజ్‌ జనంలోకి వెళ్లిపోయిందని రాష్ట్ర బీజేపీ నాయకులు టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట‌. బీజేపీ అధిష్ఠానం దగ్గర వైసీపీకి ప్రాధాన్యం ఉందనే అభిప్రాయం అందరికీ అర్ధమైపోయిందని భావిస్తున్నార‌ట‌. అయితే, వారిని కూల్ చేసేందుకు బీజేపీ ఇంఛార్జ్‌ దేవధర్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని స‌మాచారం. ఎన్డీఏలోకి వైసీపీ చేరిక అనేది ఆ పార్టీ మైండ్‌గేమ్‌ అని.. ఆందోళన పడొద్దని ఏపీ నేతలకు చెప్పారట. అయిన‌ప్ప‌టికీ, జ‌గ‌న్ వేసే అడుగు ఏంటో తెలియ‌క, ఈ ప్రభావం రాష్ట్రంలో కేడర్‌పైనా ఎలా ప‌డ‌నుందో అంచ‌నా వేస్తూ ఆందోళ‌న చెందుతున్నార‌ట కొంద‌రు నేత‌లు. అయితే, తాము ఎన్డీఏ కూట‌మిలో చేర‌డం గురించి అస్స‌లు ఆలోచించ‌డం లేద‌ని… బీజేపీ నేత‌లు ఈ విష‌యంలో టెన్ష‌న్ ప‌డితే తామేం చేయ‌గ‌ల‌మ‌ని వైసీపీ నేత‌లు కొట్టిపారేస్తుండ‌టం అస‌లు ట్విస్ట్‌!.

author avatar
sridhar

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju