NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

వివేకా మర్డర్ కేసులో సి‌బి‌ఐ చేసిన పనికి రాష్ట్రం మొత్తం షాక్ అయ్యింది…!!

సరిగ్గా 2019 ఎన్నికల సమయంలో వైయస్ జగన్ బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. అప్పుడే ప్రచారం స్టార్ట్ అయిన సందర్భంలో కాకినాడలో జగన్ భారీ బహిరంగ సభ నిర్వహించిన ఆ రాత్రి వైయస్ వివేకానంద రెడ్డి చనిపోవటంతో ఏపీ రాజకీయాల్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది. అధికారంలో ఉన్న చంద్రబాబు పార్టీ… ఇది జగన్ పార్టీ నాయకులు చేసిన పని అని, గెలవడం కోసం హత్యా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. మరోపక్క వైసీపీ అధికారంలో ఉన్న టిడిపి పార్టీ నేతలే ఇది చేశారని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు.

Hang me if I killed YS Vivekananda Reddy: Sudhakar Reddy | News Track Live,  NewsTrack English 1అయితే తన తండ్రి హత్య విషయంలో తనకు అనుమానాలున్నాయని కూతురు సునీత హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు సిబిఐ విచారణకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రంగంలోకి దిగిన సిబిఐ విచారణ పకడ్బందీగా చేస్తుంది. మొదటి విడతగా 15 రోజులపాటు కడపలో సిబిఐ కార్యాలయంలో ఈ హత్య కి సంబంధించి ప్రతి అనుమానితుడిని సిబిఐ విచారించడం జరిగింది. ఆ తర్వాత 40 రోజులు గ్యాప్ ఇచ్చిన సిబిఐ మళ్లీ తాజాగా విచారణ మొదలు పెట్టడంతో….ఈసారి కీలక విషయాలు బయట పడినట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి విషయంలోకి వెళితే ఇటీవల పులివెందులలో చెప్పుల షాపు యజమానిగా ఉన్న మున్నా అనే వ్యక్తి తో పాటు అతని కుటుంబ సభ్యులను సిబిఐ విచారణ చేయడం జరిగిందట.

 

అప్పట్లో వైయస్ వివేకానంద రెడ్డి బ్రతికి ఉన్న సమయంలో ఆ కుటుంబానికి సంబంధించి ఒక సంచలన స్టేట్మెంట్ ఇవ్వటంతో సిబిఐ విచారణ చేసినట్లు టాక్. ఇదిలా ఉండగా ఈ విచారణలో భాగంగా మున్న బ్యాంకు లాకర్ లో సిబిఐ అధికారులు భారీగా నగదుతో పాటు 25 తులాల బంగారాన్ని గుర్తించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే లావాదేవీలు మున్నా ఖాతా నుండి ఎవరెవరికి ట్రాన్సక్షన్ జరిగాయి అన్న వాటిపై లోతయిన దర్యాప్తుకి సిబిఐ రెడీ అయింది. విచారణలో భాగంగా పులివెందులకు చెందిన మరికొంతమందిని అదేవిధంగా ఓ ఎంపీ యొక్క సన్నిహితుడని సిబిఐ విచారించి అతని ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దీంతో ఎంపీ అనుచరుడు ఫోన్ సిబిఐ స్వాధీనం చేసుకున్న ఈ వార్త సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్రం మొత్తం షాక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ విషయం ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారిందట.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!