NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బాబు చేసింది జ‌గ‌న్ చేయ‌లేక‌పోయాడు.. .అందుకే ఇలా….

ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు రాజ‌కీయాల్లో 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అనే గుర్తింపు పొందిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఆ ఇమేజ్‌కు రాజ‌కీయాల్లో ఆయ‌న  కంటే జూనియ‌ర్ అయిన వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చెక్ పెట్టారు.

దీంతో స‌హ‌జంగానే వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై తెలుగుదేశం నేత‌లు అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా టార్గెట్ చేస్తున్నారు. తాజాగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీతో స‌మావేశం విష‌యంలో వైఎస్ జ‌గ‌న్‌ను విమ‌ర్శిస్తున్నారు. అయితే, దానికి వైసీపీ ఓ రేంజ్‌లో రిప్లై ఇచ్చింది.

అంబ‌టి అంటే అంతే మ‌రి

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ ఢిల్లీ టూర్‌పై చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు అంబ‌టి ఓ రేంజ్‌లో కౌంట‌ర్ ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలను మెరుగుపరుచుకుంటూ, మరోవైపు విభజన హామీలు అయిన వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు పూర్తి, తదితర అంశాలను నెరవేర్చుకునే దిశగా ముందడుగు వేస్తుంటే.. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, టీడీపీ నేతలు పనిగట్టుకొని జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారీ అడ్డగోలు విమర్శలు చేస్తున్నారు అని మండిప‌డ్డారు. “ముఖ్యమంత్రి హోదాలో.. దేశ ప్రధానిని కలిస్తే,  కేంద్ర మంత్రులను కలిస్తే.. తప్పేంటి..?- జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా కూడా ప్రధానిని కలిశారు, అప్పటి కేంద్ర మంత్రులను కలిసి, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను చర్చించారు. అప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుడికి ప్రధాని అపాయింట్ మెంటు ఎలా ఇస్తారంటూ నానా యాగీ చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా కలిసినా.. అదే యాగీ చేస్తున్నారు. ఈ ప్రతిపక్షానికి, చంద్రబాబు నాయుడికి, చంద్రబాబు అనుకూల మీడియాకు అసలు ఏమైంది..?“ అంటూ ప్ర‌శ్నించారు.

సోనియా విష‌యంలో ఏం జ‌రిగిందంటే….

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రధానమంత్రిని కలిస్తే సొంత ఎజెండా, సొంత పనులు.. అంటూ ప్రజల్లో ఒక గందరగోళం సృష్టించిందేకు ప్రతిపక్ష నాయకులు ప్రయత్నిస్తున్నారని మండిప‌డ్డారు. “వ్యక్తిగత ప్రయోజనాలకోసం అని, కేసుల మాఫీ కోసం అని, కేసులు త్వరితగతిన విచారణ జరుగుతుంటే భయపడి కలిశారని అంటున్న వారికి ఒకే ఒక్క ప్రశ్న. జగన్ మోహన్ రెడ్డిపై 8-9 ఏళ్ళ క్రితం సోనియా గాంధీ-చంద్రబాబు కుట్రపన్ని కేసులు పెట్టారు. కేసుల మాఫీ కోసమే కలిస్తే,,  మరి కేసులు ఏమైనా ఎత్తేశారా..? లేదే. ఇలా మాట్లాడే వాళ్ళకు అసలు బుద్ధి ఉందా..? అసలు జగన్ మోహన్ రెడ్డిగారిని కేసులు ఏం చేస్తాయి..? అవి రాజకీయంగా కుట్రపూరితంగా పెట్టిన కేసులు. కేసులకు మేం భయపడతమా…? జగన్ మోహన్ రెడ్డి ఏ తప్పూ చేయలేదన్నది నిజం“ అని తెలిపారు.

చంద్ర‌బాబు లాగా పిరికిపంద కాదు

కేసులంటే పారిపోవడానికి త‌మ నాయకుడు చంద్రబాబులా పిరికిపంద కాదని అంబ‌టి రాంబాబు వెల్ల‌డించారు. “ మమ్మల్ని కేసులు ఏమీ చేయలేవు. జగన్ మోహన్ రెడ్డిపై సోనియా గాంధీ, చంద్రబాబు కలిసి కుట్రపూరితంగా కేసులు పెట్టారని ప్రపంచం మొత్తం తెలుసు. ఈరోజు కొత్తగా మేం చెప్పాల్సిన పనిలేదు.  ఓటుకు కోట్ల కేసులో పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ కేసు పెడతాడని భయపడిపోయి.. మూటా ముల్లె సర్దుకుని అర్థరాత్రి పారిపోయి వచ్చింది చంద్రబాబు కాదా…? – పదేళ్ళు ఉన్నడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ను అర్థాంతరంగా వదిలిపెట్టి.. తన కేసుల కోసం, తన పిరికితనం వల్ల రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబు కాదా…? – చంద్రబాబు పరికిపంద కాబట్టే, కేసుల నుంచి తప్పించుకునేందుకు, తన స్వార్థం కోసం రాష్ట్రాన్ని ముంచాడు.  అర్ధ‌రాత్రి చిదంబ‌రంతో భేటీ అయింది చంద్ర‌బాబు కాదా?` అని అంబ‌టి ప్ర‌శ్నించారు.

author avatar
sridhar

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju