NewsOrbit
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Tirupathi By election: తిరుపతిలో ఏ పార్టీ.. ఏం అవకాశాలు..!? “న్యూస్ ఆర్బిట్” స్పెషల్ విశ్లేషణ..!!

YSRCP vs BJP: Tirupathi By Election Petition in Highcourt

Tirupathi By election: తిరుపతి ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక సమీపిస్తోంది. మూడు రోజుల్లో పోలింగ్ ఉంది. ప్రధాన పార్టీల ప్రచారం రేపటితో ముగియనుంది. ప్రచారం చివరి అంకంలో టీడీపీపై రాళ్లదాడి అనీ.., బీజేపీ నకిలీ ఓట్లు అని.., రకరకాల వివాదాలకు కేంద్ర బిందువుగా తిరుపతి ఉప ఎన్నిక వేడెక్కింది. నిజానికి మొదట ఏకపక్షమే అనుకున్న ఈ ఉప ఎన్నిక గట్టిపోటీగా మారింది. ఈజీగా వైసీపీ గెలుపు అనుకున్న స్థానం కాస్తా.. గెలుపు ఖాయమే కానీ మెజారిటీ అనుమానం అనే వరకు వచ్చింది. దీనికి కారణాలేంటి..!? తిరుపతి పరిధిలో ఏ పార్టీ అవకాశాలు ఎలా ఉన్నాయి..? ఆ పార్టీల ప్రచారం ఎలా సాగింది..!? అనేది ఓ సారి పరిశీలిద్దాం..!!

Tirupathi By election: Ground Level Facts Special Story
Tirupathi By election Ground Level Facts Special Story

Tirupathi By election: వైసీపీ ఓట్లు – పాట్లు – జగన్ ఫోటోనే ఆధారం..!!

అధికార వైసిపికి ఈ ఎన్నిక ఏకపక్షమే.. కనీసం 4 లక్షలు మెజారిటీ అనుకున్నారు. మూడు వారాల కిందటి వరకు అదే పరిస్థితి ఉండేది. తిరుపతి ఎంపీ స్థానం పరిధిలో సూళ్లూరుపేట, గూడూరు, సత్యవేడు, శ్రీకాళహస్తి తదితర అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ స్ట్రాంగ్ గా ఉంది. మిగిలిన మూడు చోట్ల కూడా మంచి ఓటు బ్యాంకు ఉంది. 2019 లో మొత్తం 7 . 22 లక్షల ఓట్లు వచ్చాయి. 2 . 28 లక్షల ఓట్ల ఆధిక్యత సాధించారు. ఈ సారి కచ్చితంగా 8 . 25 లక్షల ఓట్లు వస్తాయి. మెజారిటీ కూడా అప్పటి కంటే లక్షన్నర ఎక్కువ వస్తుంది అని లెక్కలేసుకుంటున్నారు. కానీ టీడీపీ కోలుకున్నట్టు కనిపించడం.. టీడీపీ ముఖ్యులు కూడా అక్కడే తిష్ట వేయడంతో ఆ పార్టీపై ఫోకస్ పెరిగింది.
* తిరుపతి ఎంపీ పరిధిలో జగన్ ఫోటో.. ఆయన పాలన.. ఆయన సంక్షేమ పథకాలే వైసిపికి శ్రీరామరక్ష.. జగన్ ప్రచారానికి రాకపోయినప్పటికీ ఆయనే ఇక్కడ బ్రాండ్. సో.. వైసీపీ ఆ ఓట్లపైనే ఆధారపడింది. అన్నీ కలిసొస్తే.. ప్రచారం, ప్రలోభం ఫలిస్తే వారు ఆశిస్తున్నట్టు నాలుగు లక్షల మెజారిగి సాధించగలరు.. ఆ సెంటిమెంట్ పండకపోతే.. టీడీపీ ప్రయత్నాలు ఫలిస్తే వైసీపీ మెజారిటీ లక్షన్నరకి పడిపోయినా ఆశ్చర్యం అవసరం లేదు.

Tirupathi By election: Ground Level Facts Special Story
Tirupathi By election Ground Level Facts Special Story

టీడీపీ గట్టి పోటీ.. దూసుకొచ్చిన విశ్వాసం..!!

మూడు వారాల కిందటి వరకు తిరుపతి ఎంపీ స్థానంలో టీడీపీ గట్టి పోటీ ఇస్తుందని.. ఇంతగా ప్రచారం.., ప్రయత్నాలు చేస్తుందని ఏ ఒక్కరూ అనుకోలేదు. ఆ పార్టీ కార్యకర్తలు కూడా ఊహించలేదు. కానీ టీడీపీ వ్యూహం మార్చింది. తిరుపతి ఉప ఎన్నికను తాము ఎంత సీరియస్ గా తీసుకుంటున్నామో.. అది తమకు ఎంత కీలకమో ఆ పార్టీ చాటింది. రాష్ట్రం మొత్తం మీద టీడీపీకి ఉన్న పేరు మోసిన నేతలు, ఎమ్మెల్యేలు, మాజీలు అందర్నీ మోహరించింది. లోకేష్ 12 రోజులూ.. చంద్రబాబు వారం రోజులూ అక్కడే తిష్ట వేసి ప్రచార బాధ్యతలు చూసారు. మొత్తానికి టీడీపీ కార్యకర్తల్లో అంతులేని ఆత్మవిశ్వాసాన్ని నింపారు. ఇప్పుడు తిరుపతి ఏమీ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ టీడీపీ క్షేత్రస్థాయి కార్యకర్తలు ఉత్సాహంగా పని చేస్తున్నారు. ఈ ఫలితంగా గూడూరు, శ్రీకాళహస్తి, సర్వేపల్లి, సూళ్లూరుపేట వంటి నియోజకవర్గాల్లో వైసిపికి గత ఎన్నికల్లో వచ్చిన ఆధిక్యతని బాగా తగ్గించామని ఆ పార్టీ చెప్పుకుంటుంది.
* టీడీపీ ప్రచారాలు, ప్రయత్నాలు, ప్రలోభాలు పూర్తిగా ఫలిస్తే టీడీపీకి గత ఎన్నికల్లో వచ్చిన కంటే 50 వేలు ఓట్లు ఎక్కువ రావచ్చు. అంటే మొత్తం అయిదున్నర లక్షలు ఓట్లు రావచ్చు. లేకపోతే టీడీపీని లెక్కచేయక.. చంద్రబాబు ప్రయత్నాలను ఓటర్లు కరుణించకపోతే మాత్రం 4 లక్షలకు పైచిలుకు తేడాతో ఓటమి ఖాయమే. 2019 ఎన్నికల కంటే 25 వేలు ఓట్లు ఎక్కువ తెచ్చుకుంటే టీడీపీ గాలి మారినట్టే.

Tirupathi By election: Ground Level Facts Special Story
Tirupathi By election Ground Level Facts Special Story

బీజేపీ.. స్వీయ బల పరీక్ష..!!

ఇక బీజేపీ ఈ ఎన్నిక ద్వారా ఒక బల పరీక్ష చేసుకుంటుంది. తమ రాజకీయ భవిష్యత్తుపై పరీక్ష రాస్తుంది. వాళ్ళు అనుకున్న ఓట్లు వస్తే ఏపీలో బీజేపీ రాజకీయం మారుతుంది. రాకపోతే ఏపీలో బీజేపీ మరింత దిగజారుతుంది. మొత్తానికి ఈ ఎన్నిక బీజేపీకి, ఏపీలో ఆ పార్టీ భవిష్యత్తుకి, జనసేనతో పొత్తుకు అన్నిటికీ పరీక్ష.. బీజేపీ కి 2019 ఎన్నికల్లో 21 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు జనసేనతో పొత్తు.. మోడీ పాలన.. బీజేపీ పేరు ప్రతిష్టలు.. కేంద్రంలో అధికారం.. మంచి ఉన్నత విద్యావంతురాలైన అభ్యర్థి.. ఇవన్నీ కలిసొస్తే బీజేపీకి కనీసం లక్షన్నర ఓట్లు వస్తాయని ఆ పార్టీ పెద్దలు లెక్కేస్తున్నారు. అలా వస్తే మాత్రం ఏపీపై ఆ పార్టీకి ఫోకస్ పెరుగుతుంది. జనసేనతో బంక మరింత స్ట్రాంగ్ గా కుదురుతుంది. రెండూ కలిసి ఎదిగే ప్రయత్నం చేస్తాయి. ఒక నమ్మకం పెట్టుకుంటాయి. ఒకవేళ బీజేపీకి 50 వేలు ఓట్లుకి పరిమితమైతే .. బీజేపీ ఇక్కడ టీడీపీ లేదా వైసీపీతో కలిసి రాజకీయం మొదలు పెడుతుంది. ఒంటరిగా.. జనసేనతో ఎదగలేమని.. తమను ఉనికి లేదని నిజాన్ని గ్రహిస్తుంది.. సో… ఈ ఎన్నిక బీజేపీ అసలు బలానికి పరీక్ష కానుంది..!!

author avatar
Srinivas Manem

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?