తిరుమలలో తలసాని విసుర్లు

Share

తిరుపతి, జనవరి7:  టీఆర్ఎస్ నాయకులు టిడిపిపై దాడిని ఇంకా ఆపలేదు. తిరుమలలో సోమవారం టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్ శ్రీవారి దర్శనం అనంతరం మీడియాతో మట్లాడుతూ, నాలుగు నెలల్లో దేశ రాజకీయ ముఖ చిత్రం మారనుందన్నారు. కేసీఆర్ నేతృత్వంలోని ఫెడరల్ ప్రంట్ దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తుందని తలసాని ధీమా వ్యక్తం చేశారు.

కొత్తగా ఏర్పడ్డ ఎపీలో పరిపాలన సక్రమంగా జరగడం లేదనీ, అభివృధ్ధి పనులు చేయకుండా టీడీపీ ప్రభుత్వం ప్రతిపక్షం తరహాలో దీక్షలు చేస్తోందనీ తలసాని ఆరోపించారు. ఎన్టీఆర్ సిద్ధాంతాలను పక్కన పెట్టి చంద్రబాబు కాంగ్రెస్ వెంట నడవడాన్ని తలసాని తప్పు పట్టారు. చంద్రబాబు అభివృద్ధి పనులు చేయకుండా పబ్లిసిటీతో గడిపేస్తున్నారని విమర్శించారు. తెలుగు ప్రజలు సంతోషంగా ఉండాలని కేసీఆర్ కోరుకుంటున్నారని తలసాని అన్నారు. తెలుగు ప్రజల సంతోషం కోసం టీఆర్ఎస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుందని తలసాని తెలిపారు.


Share

Related posts

వీసాలతో మోసం చేస్తున్న ముఠా సభ్యుల అరెస్టు

Siva Prasad

గంటా-చిరంజీవి మధ్య మంతనాలు జరిగాయా ? అద్దిరిపోయే ఔట్ పుట్ వచ్చింది అంటున్నారు !

arun kanna

జైల్లో సహాయకుడు- నవాజ్ వినతికి పాక్ నో

Siva Prasad

Leave a Comment