NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

మూడు రాజధానుల వ్యవహారం లో సరికొత్త ట్విస్ట్ .. !

ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని విషయంలో తాము ఎట్టి పరిస్థితుల్లోనూ కలుగజేసుకోబోమని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే న్యాయస్థానానికి తేల్చి చెప్పేసింది. దీంతో ఏపీలోని ప్రతిపక్షాలు అన్నీ బిక్కముఖం వేశాయి. ఇక రాష్ట్రంలో రెండు కీలక జిల్లాలు అయిన పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలు ఈ దెబ్బతో ఖుషి అయిపోయినట్లే అని అంతా అనుకున్నారు. నిజానికి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్న ఈ రెండు జిల్లాలు అత్యంత కీలకం. భిన్నమైన అభిరుచులు, వ్యాపారాలు, వ్యవహారాలు ఉన్న ఈ జిల్లాలకు రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా మంచి పేరుంది.సినిమాల్లో, రాజకీయాల్లో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఈ జిల్లా వాసులు తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. అయితే ఒక్కసారిగా ఈ రెండు జిల్లాల నుండి వస్తున్న 3 రాజధానులకు సంబంధించి వ్యతిరేక వైఖరి ఇప్పుడు వైసీపీ ని కలవరపెడుతోంది.

 

వివరాల్లోకి వస్తే…. రెండు గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్ర కు సంబంధించినవి కాబట్టి విశాఖ రాజధానిగా తమ సంపూర్ణ మద్దతు తెలుపుతారని ఆశించినా కూడా ఈ రెండు జిల్లాల విషయాన్ని విడివిడిగా విశ్లేషిస్తే…. పరిస్థితి కొద్దిగా తేడాగా ఉంటుంది. పశ్చిమగోదావరిలో కొన్ని ప్రాంతాల వారు అంటే మెట్ట-డెల్టా ప్రాంతానికి చెందిన ప్రజలు తమ కోణంలో రాజధానిని కోరుకుంటున్నారు. మెట్ట ప్రాంతంలో వారికి కృష్ణా జిల్లాతో అనుబంధం ఎక్కువ. విజయవాడ-గుంటూరు లతో కూడిన అమరావతిని రాజధానిగా కోరుతున్నారు. అంతేకాకుండా విజయవాడ తో అనుబంధం ఉన్న పశ్చిమ, వైసీపీ నేతలు కూడా అమరావతి రాజధానిగా ఉండాలని లోపల కోరుకుంటున్నారు.

ఇక కొందరు పశ్చిమగోదావరి ప్రజలు విశాఖను రాజధానిగా కోరుకుంటూ ఉండడం గమనార్హం. వీరిలో తటస్థ వాతావరణం నెలకొంది. రాజమండ్రి కి ఆనుకుని ఉన్న కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గంలో పెట్టుబడిదారులకు ఇప్పటికే వైజాగ్ తో ఎక్కువ అనుబంధం. వారు వైజాగ్ ను రాజధానిగా కోరుకుంటున్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లా విషయానికి వస్తే వీరంతా కూడా దాదాపు విశాఖను రాజధానిగా కోరుకుంటున్నారు. తమకు రాజధాని అత్యంత చేరువలో ఉంటుంది అన్న అభిప్రాయం బలంగా నాటుకుపోయింది.

అలాగే కాకినాడ తో పాటు కాకినాడ లోక్ సభ, సీమ ప్రజలకు విజయవాడ కంటే వైజాగ్ తోనే అనుబంధం ఎక్కువ. వైజాగ్ రియల్ ఎస్టేట్ తో పాటు అక్కడ ఇండస్ట్రీలో ఈ జిల్లావాసులు భారీ పెట్టుబడులు పెట్టారు. ఈ క్రమంలోనే తమకు అన్ని విధాలా విశాఖ అనువుగా ఉంటుందని వారి భావన. మరి ఈ రెండు జిల్లాల ప్రజల మధ్య ఎవరి ఆకాంక్ష చివరికి నెరవేరుతుంది అనేది ఎక్కువగా కనిపిస్తోంది.

author avatar
arun kanna

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju