ఆ ఇద్దరు బీజేపీ నేతలతో జగన్ ఎం మాట్లాడారు?

 

 

(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి)
————–

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పర్యటన నిమిత్తం మంగళవారం రేణిగుంట విమానాశ్రయానికి ముందుగా చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక విమానం దిగిన వెంటనే మీ దగ్గర ఉన్న ఇద్దరు బిజెపి నేతలను ఆప్యాయంగా పలకరించడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది. రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడిన జగన్ వారితో ఏ విషయాలు చెప్పి ఉంటారనేది ఆసక్తిగా మారింది. ఆ ఇద్దరు నేతలు సైతం జగన్ మాటలకు స్పందిస్తూ ప్రతిగా నమస్కారాలు పెట్టడం, అవును అంటూ తల ఊపడం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. దీనిపై రకరకాల ట్రోలింగ్, కామెంట్లు అప్పుడే మొదలయ్యాయి. టీడీపీ శ్రేణులు మాత్రం తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో టీడీపీని ఓడించేందుకు వైఎస్ఆర్సిపి బిజెపి ఒక్కటయ్యాం టు ఆ వీడియోను వైరల్ చేసి ఆనంద పడుతున్నాయి.

 

మరో పక్క రెడ్డీ ఇజం!!

రేణిగుంట విమానాశ్రయంలో జగన్ ను కలిసిన ఇద్దరు బిజెపి నాయకులు రెడ్డి వర్గానికి చెందిన వారు కావడంతో ఇది మరో చర్చకు దారితీస్తోంది. ఏ పార్టీలో ఉన్న వారంతా ఒకే వర్గానికి చెందిన వారని, ఆ విషయంలో ఎలాంటి భేషజాలు ఉండవని బయటకు మాత్రం ప్రత్యర్థుల కనిపించిన అంతా ఒకే గొడుగు కిందకు వస్తారు అంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక సమయంలో తిరుపతిలో బీజేపీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న భాను ప్రకాష్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి గా వ్యవహరిస్తున్న విష్ణువర్ధన్రెడ్డి లు ముఖ్యమంత్రి జగన్ తో ప్రత్యేకంగా మాట్లాడడం ఉప ఎన్నిక వేడి సమయంలో కొత్త చర్చకు దారితీసినట్లు అయింది. దీన్ని ఎవరికి ఇష్టం వచ్చిన వారు వారికి ఇష్టం వచ్చిన విధంగా సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ చేసుకుంటున్నారు. అయితే వైసీపీ శ్రేణులు మాత్రం రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు వచ్చిన బీజేపీ నేతలను జగన్ సాధారణంగా పలకరించాలని అక్కడే మీ పెద్ద చర్చలు జరగలేదని చెప్పడం నిజమే అయినా, ప్రత్యేకంగా ఇద్దరు రెడ్డి వర్గానికి చెందిన బీజేపీ నేతలు జగన్ను కలవడం మాత్రం కొత్త చర్చకు దారి తీసే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ అవుతున్న ఈ వ్యవహారంపై బీజేపీ పెద్దలు ఎలా స్పందిస్తారో అనేది చూడాలి.