KCR Prakash Raj: సినీనటుడు ప్రకాష్ రాజ్ అందరికి సుపరిచితుడే. దక్షిణాది భాషల్లో విలక్షణ నటుడిగా పేరొందిన ప్రకాష్ రాజ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అనేక సినిమాలు చేయడం జరిగింది. ఇటీవలె “మా” ఎన్నికలలో అధ్యక్షుడిగా కూడా పోటీ చేయటం.. ఓడిపోవడం తెలిసిందే. ప్రకాష్ రాజ్ నటుడిగా మాత్రమే కాదు సామాజికంగా కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. తెలంగాణలో కొన్ని గ్రామాలను దత్తత తీసుకోవడం మాత్రమే కాదు అక్కడ మౌలిక సదుపాయాలను కల్పించి పిల్లలకు విద్య అందించడంలో తన సొంత డబ్బును సమాజానికి ఖర్చు పెట్టడం జరిగింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram . Follow us on Googlenews
ఇక ఇదే సమయంలో ప్రభుత్వాలు తప్పు చేస్తే కూడా తనదైన శైలిలో ప్రశ్నించే తత్వం ప్రకాష్ రాజ్ సొంతం. ఈ క్రమంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ విధానాలపై చాలాసార్లు మీడియా ముందే ప్రకాష్ రాజ్ ప్రశ్నించడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం చాలావరకు ప్రకాష్ రాజ్ తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. ఢిల్లీలో కూడా కెసిఆర్ కొన్ని కార్యక్రమాలకు ప్రకాష్ రాజ్ ని వెంటబెట్టుకు వెళ్ళారు. పరిస్థితి ఇలా ఉంటే ప్రజెంట్ కేసీఆర్ చాలావరకు బిజెపిని ఢీ కొట్టే దిశగా రాజకీయాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram . Follow us on Googlenews
దీనిలో భాగంగానే జాతీయ స్థాయిలో బీజేపీ విధానాలను ఎప్పటికప్పుడు మీడియా సమావేశాలు నిర్వహించి ఎండగడుతున్నారు. ఇటువంటి తరుణంలో మరింతగా బీజేపీని ఇరుకున పెట్టడానికి ఇప్పుడు కేసీఆర్.. ప్రకాష్ రాజ్ నీ టిఆర్ఎస్ పార్టీ తరపున రాజ్యసభకు పంపించే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే ప్రకాష్ రాజ్ తో కెసిఆర్ చర్చించినట్లు అంతా ఓకే అయినట్లు రాజకీయవర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నేషనల్ మీడియా గ్లామర్ కలిగిన ప్రకాష్ రాజ్.. టిఆర్ఎస్ పార్టీ తరఫున బీజేపీని ప్రశ్నిస్తే మరింతగా మీడియా ఫోకస్ పార్టీకి వచ్చే అవకాశం ఉందని కేసీఆర్ ఇదంతా ప్లాన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.