పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు రెండు సంవత్సరాల తర్వాత Vakeel Saab సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని నిర్మాత దిల్ రాజు అదే విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీ నిర్మాత బోనీకపూర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బోనీ కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మరో నిర్మాత అని అందరికీ తెలుసు.

ఈ నేపథ్యంలో మౌనిక పూరి సొంత ప్రొడక్షన్ లో వస్తున్న మైదాన్ సినిమా విడుదల ఆరు నెలల క్రితమే ప్రకటించడం జరిగింది. ఇటువంటి తరుణంలో సరిగ్గా అదే సమయంలో తాజాగా భారతీయ దిగ్గజ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మక సినిమా “RRR” రిలీజ్ డేట్ ఖరారు చేయటంతో బోనీకపూర్ కి ఊహించని షాక్ ఇచ్చినట్లు అయింది అనే టాక్ బీ టౌన్ లో వస్తోంది.
మేటర్ లోకి వెళ్తే…బాహుబలి సినిమా తో దేశవ్యాప్తంగా రాజమౌళి మంచి క్రేజ్ దక్కించుకోవడం అందరికీ తెలిసిందే. దీంతో ఆ సినిమా తర్వాత రాజమౌళి చేస్తున్న RRR పై ప్రేమికులు ఎప్పటి నుండో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ రెండు సంవత్సరాల నుంచి జరుగుతూ ఉండటంతో .. ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుంది అన్న ఉత్కంఠత ప్రతి ఒక్కరిలో నెలకొంది. ఇలాంటి తరుణంలో వచ్చే దసరా పండుగకు అక్టోబర్ 13వ తారీఖున ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు .. రాజమౌళి డేట్ ప్రకటించడంతో బోనీకపూర్ కి ఊహించని షాక్ ఇచ్చినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. రాజమౌళి తాజా నిర్ణయంతో బోనికపూర్ మైదాన్ రిలీజ్ డేట్ మార్చే ఆలోచన జరుగుతున్నట్లు టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే బోనీ కపూర్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన “వకీళ్ సాబ్” వచ్చే సమ్మర్లో రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం.