అమరావతి: ఏపీ శాసనమండలిలో వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపించిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు, యనమల రామకృష్ణుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచే ప్రణాళికలో భాగంగా అప్పట్లో యనమలని చంద్రబాబు స్పీకర్ గా తెరపైకి తీసుకొచ్చాడని, అటు యనమల కూడా తన బాస్ ముఖ్యమంత్రి కావడానికి స్పీకర్ స్థానంలో ఉండి సహకరించాడని ఆరోపించారు.
“ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచే ప్రణాళికలో భాగంగా అప్పట్లో యనమలని స్పీకర్ గా తెరపైకి తీసుకొచ్చాడు బాబు. బాస్ సీఎం కావడానికి స్పీకర్ స్థానంలో ఉండి ఆయన ‘చరిత్రలో నిల్చేంత’ సేవ చేశారు. ఇప్పుడు శాసనమండలి ప్రతిష్ఠను కూడా చంద్రబాబు తన స్వార్థం కోసం మంట కలిపేశారు” అని విజయసాయి విమర్శించారు.
ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచే ప్రణాళికలో భాగంగా అప్పట్లో యనమలని స్పీకర్ గా తెరపైకి తీసుకొచ్చాడు బాబు. బాస్ సిఎం కావడానికి స్పీకర్ స్థానంలో ఉండి ఆయన ‘చరిత్రలో నిల్చేంత’ సేవ చేశారు. ఇప్పుడు కౌన్సిల్ ఇమేజిని కూడా బాబు తన స్వార్థం కోసం మంట కలిపేశారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 24, 2020
“అహంకారం, దుర్భుద్ధితో చంద్రబాబు వేసిన ఒక్కో తప్పటడుగు పార్టీని, నమ్ముకున్న వాళ్లని అధ:పాతాళానికి నెట్టి వేసింది. ఈ వయసులో శక్తికి మించిన విన్యాసాలు చేస్తున్నాడు. పప్పు నాయుడు రాజకీయ జీవితం కూడా ముగిసినట్టే. యనమల లాంటి తిరస్కృతులకు చరమాంకం చేదు జ్ఞాపకంగా మిగులుతుంది” అని మరో ట్విట్ చేశారు.
అహంకారం, దుర్భుద్ధితో చంద్రబాబు వేసిన ఒక్కో తప్పటడుగు పార్టీని, నమ్ముకున్న వాళ్లని అధ:పాతాళానికి నెట్టి వేసింది. ఈ వయసులో శక్తికి మించిన విన్యాసాలు చేస్తున్నాడు. పప్పు నాయుడు రాజకీయ జీవితం కూడా ముగిసినట్టే. యనమల లాంటి తిరస్కృతులకు చరమాంకం చేదు జ్ఞాపకంగా మిగులుతుంది.
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 24, 2020