NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

అసలేం జరిగింది : అంత అర్జెంట్ గా విజయ్ సాయి రెడ్డి ఆ కలక్టర్ కి కాల్ ఎందుకు చెయ్యాల్సొచ్చింది ! 

ఎప్పుడైతే విశాఖపట్నాన్ని వైయస్ జగన్ ప్రభుత్వం రాజధానిగా గుర్తించిందో ఒక్కసారిగా అక్కడ ల్యాండ్ ధరలు డబల్, త్రిబుల్ అయ్యాయి. చాలా మంది ప్రముఖుల కళ్ళు విశాఖపట్టణం భూములపై పడ్డాయి. ఇతర జిల్లాల నుంచి అనేక మంది బడా వ్యాపారులు మరియు రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వాళ్ళు విశాఖపట్టణం లో అడుగు పెట్టడం జరిగింది. విశాఖలో ఎక్కడైతే భూములు ఉన్నాయో వాటిని ఆధీనంలోకి తీసుకోవడానికి రకరకాల దారులు వెదుక్కుంటూ ఉన్నట్లు వార్తలు ఇటీవల వైరల్ అవుతున్నాయి.

Why Vijay Sai Reddy wants action against these two newspapers ...ఇదిలావుండగా తాజాగా విశాఖపట్నం ఇసుకతోట లో ఒక ప్రైవేటు స్థలానికి సంబంధించి వ్యవహారం ఏపీ అధికార పార్టీ నేతలను టెన్షన్ పేడుతున్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వెలువడుతున్నాయి. ఇసుక తోట లో ఓ ప్రైవేటు స్థలాన్ని రాయలసీమ ప్రాంతానికి చెందిన వాళ్ళు కబ్జా చేసినట్లు, ఆ స్థలానికి సంబంధించి వాచ్ మెన్ ని నిర్బంధించి కట్టేసి….చంపేస్తామంటూ బెదిరించిన సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సుమారు 15 కోట్ల విలువైన నాలుగువేల గజాల ఈ ప్రైవేటు స్థలాన్ని ఇరవై సంవత్సరాలకు లీజుకు తీసుకుని ఒక వ్యక్తి మార్బల్ వ్యాపారం చేస్తూ వస్తున్నారు. స్థలం కోర్టు వివాదం లో కూడా ఉంది.

 

ఇటువంటి తరుణంలో తమది రాయలసీమ ప్రాంతం అంటూ 20 మంది వ్యక్తులు బెదిరింపులకు పాల్పడి వాచ్ మెన్ పై దాడి చేశారట. తమ కి ప్రభుత్వ పెద్దల అండదండ ఉందని ఏమైనా ఎక్కువ చేస్తే శాల్తిలు లేచి పోతాయని గట్టిగా వార్నింగ్ కూడా ఇవ్వటం జరిగిందట. దీంతో గత్యంతరం లేక సదరు వాచ్ మెన్ స్థల యజమానులకు విషయం మొత్తం చెప్పటంతో… వెంటనే వారు పోలీసు కేసు పెట్టాలని చెప్పడంతో తో వాచ్ మెన్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందట. దీంతో విశాఖ పట్టణ రాజధాని పనులకు సంబంధించి అన్నీ దగ్గరుండి చూసుకుంటున్న విజయసాయిరెడ్డి దృష్టికి ఈ విషయం రావడం జరిగిందట.

 

వెంటనే విజయసాయిరెడ్డి నగర పోలీస్ కమిషనర్ తో పాటు కలెక్టర్ కి ఫోన్ చేసి…. ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకుని వెంటనే దోషులను పట్టుకోవాలని, కఠినంగా శిక్షించాలని కోరారట. ఇటీవల ఈ విధంగానే వైసీపీ పార్టీకి చెందిన నాయకులు వ్యవహరించడంతో పార్టీ హైకమాండ్ వారిని సస్పెండ్ చేయడం జరిగింది. మరోపక్క విశాఖ పట్టణంలో ఉన్న స్థానిక పొలిటికల్ లీడర్ లు…వేరే వాళ్ళ పెత్తనం ఇక్కడ ఏంటి అని తెగ డిస్కషన్లు చేసుకుంటున్నారట. పరిస్థితి ఇలా ఉండగా వైసీపీ ప్రభుత్వం మాత్రం విశాఖపట్టణానికి రాజధాని వచ్చేవరకూ ఎక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా… ముందు జాగ్రత్తలు తీసుకుంటూ వస్తుంది.

 

దీంతో తాజాగా రాయలసీమ ప్రాంతం అని చెప్పి ప్రైవేటు స్థలాన్ని కబ్జా చేసినా, ఈ గొడవ ని వైసిపి సీనియర్ నేత విజయసాయిరెడ్డి చాలా సీరియస్ గా తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది. అంతేకాకుండా కావాలని కొన్ని పార్టీల నాయకులు ఈ విధంగా రాయలసీమ ప్రాంత వ్యక్తులను చెప్పి వైజాగ్ లో గొడవలు పెట్టాలని చూస్తున్నారట. దీంతో అసలు ఈ వ్యవహారంలో ఎవరు? ఏంటి ? అసలేం జరిగింది ? అనేది త్వరగా తేల్చాలని ఫోనులో కలెక్టర్ ని విజయసాయిరెడ్డి కోరినట్లు టాక్.

Related posts

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N