NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Visakhapatnam Lands: విశాఖలో సీబీఐ..! భూముల బండారం బయటకు..!?

visakhapatnam lands scam

Visakhapatnam Lands: విశాఖలో భూమాయ Visakhapatnam Lands ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్ గా మారుతోంది. విశాఖలో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూముల్ని స్వాధీనం చేసుకుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటిస్తోంది. టీడీపీ అధికారంలో ఉండగా ఆ ప్రాంతానికి చెందిన ఓ మంత్రి భూముల స్కాంకు తెరలేపారని ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఆరోపించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూముల లెక్క తేల్చుతున్నట్టు ప్రకటిస్తోంది. ఆమధ్య గీతం యూనివర్శిటీ, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్, సబ్బం హరి.. ఇలా కొందరు ఆక్రమణలకు పాల్పడ్డారని వారి భూములు స్వాధీనం చేసుకుంటోంది ప్రభుత్వం. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సోదరుడు ఆక్రమణలకు పాల్పడ్డారని ఆ భూములు స్వాధీనం చేసుకుంది.

visakhapatnam lands scam
visakhapatnam lands scam

ఏడాది కాలంలో 4,291 కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్ని ఆక్రమణల నుంచి ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకున్నట్టు సాక్షి పత్రికలో ప్రముఖంగా ప్రచురించారు. అయితే.. 2019 నవంబర్ నుంచి 2020 నవంబర్ మధ్య కాలంలో విశాఖలో భూముల క్రయవిక్రయాలకు సంబంధించి 50వేల రిజిస్ట్రేషన్లు జరిగాయి. విశాఖలో రాజధాని ఏర్పాటు ప్రకటన జరిగిన తర్వాత.. ఇన్ని భూములు కొనుగోలు జరిగింది. వీటిలో అధికారపార్టీ నాయకులు ఉండరా.. చట్టప్రకారమే భముల కొనుగోలు జరిగిందా? అనేది ఒక ప్రశ్న. దీనిపై సీబీఐ ఎంక్వైరీ వేస్తే.. నిగ్గు తేలడం ఖాయమే. భూములు ఎవరు కొన్నారు.. ఎవరు అమ్మారు అనేది వెలుగులోకి వస్తుంది. కానీ.. అలాంటిది జరక్కుండా కేవలం ప్రతిపక్ష నేతలు ఆక్రమించుకున్నారంటూ ఆ భూముల్ని స్వాధీనం చేసుకుంటున్నారు.

Read More: Laxmi Aparna: లక్ష్మీ అపర్ణకు అండగా మహిళా సంఘాలు..! సమస్య జటిలమవుతోందా..?

భూమాయ అనేది ఎక్కడైనా జరిగిపోతుంది. అధికార ఉన్నప్పుడే టీడీపీ నాయకులు భూ అక్రమాలకు పాల్పడితే.. ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకులు ఇటువంటివి చేయలేరా? ఏడాదిలో 4వేల కోట్ల ప్రభుత్వ ఆస్తిని స్వాధీనం చేసుకుంటే.. ఈ ఏడాది కాలంలో 50వేల భూమి రిజిస్ట్రేషన్లు ఎవరు చేసినట్టు. రాజకీయాల్లో ఉన్న వారిపై ఇటువంటి ఆరోపణలు (నిజాలు కూడా ఉండొచ్చు) సహజమే. ఏదేమైనా విశాఖలో ఏదో జరుగుతోంది. రాజధాని తరలి వెళ్లే క్రమంలో ప్రశాంత విశాఖలో రాజకీయ కల్లోలం నడుస్తోంది. అధికార, ప్రతిపక్షాలు ప్రశాంతంగా ఉన్న ప్రజలకు.. అదే ప్రశాంతతను దూరం చేస్తున్నారు. విశాఖలో ఏం జరుగుతుందో కాదు.. ఏదో జరుగుతోంది. ఆ నిగ్గు తేలాల్సి ఉంది.

 

author avatar
Muraliak

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

YSRCP: వైసీపీ అధినేత, సీఎం జగన్ నేటి బస్సు యాత్ర ఇలా..

sharma somaraju

YSRCP: టీడీపీ, జనసేనకు బిగ్ షాక్ లు.. వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju