ISRAEL: ఇజ్రాయెల్ దేశం పై యుద్ధమేఘాలు..!!

Share

ISRAEL: గత రెండు రోజుల నుండి ఇజ్రాయెల్ దేశం పై రాకెట్ల దాడి జరుగుతోంది. పాలస్తీనా ప్రాంతానికి చెందిన టెర్రరిస్టులు ఇజ్రాయిల్ దేశపౌరుల ను టార్గెట్ చేసుకుని భయంకరంగా రాకెట్లు దక్షిణ ఇజ్రాయిల్ ప్రాంతం పై వదులుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఘటనలో సౌమ్య సంతోష్ అనే భారతీయురాలు ఇజ్రాయిల్ దేశం లో మరణించింది. అక్కడ ఒక ఇంటిలో కేర్ టేకర్ గా పనిచేస్తున్న ఈమె పాలస్తీనా ప్రాంతానికి చెందిన ఉగ్రవాదులు ఉపయోగించిన రాకెట్ల దాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయింది. పరిస్థితి ఇలా ఉండగా గత రెండు రోజుల నుండి దాదాపు 500 రాకెట్లు ఇజ్రాయిల్ పౌరులను లక్ష్యంగా చేసుకుని పాలస్తీనా టెర్రరిస్టులు దాడి చేసినట్లు ఇజ్రాయెల్ మీడియా ఆరోపణలు చేస్తోంది.

War Environment in Israel Country
War Environment in Israel Country

మరోపక్క ఇజ్రాయెల్ పోలీసులు కవ్వింపు చర్యల వల్లే పాలస్తీనా ప్రాంతానికి చెందిన వాళ్లు దాడులకు పాల్పడుతున్నట్లు ఓ వర్గం మీడియా ఆరోపణలు చేస్తూ ఉంది. ఏది ఏమైనా ప్రస్తుతం ఇజ్రాయెల్ దేశంలో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. అక్కడ రెండు సార్లు ఎన్నికలు జరిగినా గాని ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేయకపోవడంతో.. రాజకీయ అనిశ్చితి నెలకొంది. గత ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకి .. జరిగిన ఎన్నికలలో తక్కువ మెజార్టీ రావటంతో ఇతరుల నుండి మద్దతు కూడగట్టాలి అనుకుంటున్నా కానీ పెద్దగా లాభం లేకుండా పోయింది. పుష్కర కాలం నుండి బెంజమిన్ నెతన్యాహు కొనసాగుతూ ఉండటంతో ఆయనకి ఇతరుల నుండి సపోర్ట్ రావడం లేదు.

 

ఈ పరిణామంతో ఇజ్రాయిల్ దేశాన్ని ఇప్పుడు ఎవరు రక్షిస్తారు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. చాలావరకు ఉగ్రవాదులు ప్రయోగిస్తున్న రాకెట్లను ఇజ్రాయెల్ దేశం ఐరన్ డోమ్ ద్వారా గాలిలోనే నిర్వీర్యం చేస్తూ ఉంది. అయితే కొన్ని రాకెట్ లను అదుపు చేయలేని పరిస్థితి ఉండటంతో ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంలో.. ఉన్న ఇజ్రాయిల్ పౌరుల నివాసాలపై పడుతున్నాయి. దీంతో చెదురుముదురు ఘటనలో కొంత మంది గాయపడ్డారు, మరికొంతమంది ప్రాణాలు పోగొట్టుకునే దాకా పరిస్థితి వెళుతూ ఉంది.  


Share

Related posts

 Rahul – Punarnavi : పాపం రాహుల్ , పునర్నవి విషయం లో నువ్వు బంగారం బాసూ…

arun kanna

సీఎం జగన్ ఈ తప్పుడు నిర్ణయం తీసుకుంటారా..?

Muraliak

బిగ్ బాస్ వన్ విన్నర్ మామూలోడు కాదు.. ఆలీకే ఎలా పంచులు ఇచ్చాడో చూడండి?

Varun G