NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

గల్లా జయదేవ్ వ్యూహం ఏంటి ..!ఎందుకు సైలెంట్ అయ్యారు..??

 

గుంటూరు ఎంపీ ఎంపీ గల్లా జయదేవ్ వ్యూహమేంటి గడిచిన రెండు నెలల నుంచి ఆయన నియోజకవర్గంలోనూ, అమరావతి రైతుల పోరాటం లోనూ తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఎక్కడా కనిపించడం లేదు. ఎందుకు. ఆయన వ్యూహాత్మకంగానే సైలెంట్ అయ్యారా. పార్టీ మారే క్రమంలో నెమ్మదించారా. బిజెపి తో సంప్రదింపులు జరుపుతున్నారా. అసలు ఆయన ఎందుకు సైలెంట్ అయ్యారు. వచ్చే నెలలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో ఆయన ఎటువంటి వ్యూహాన్ని అనుసరిస్తారు అనేవి కీలకమైన చర్చనీయాంశాలుగా మారాయి. వాటిని ఒక్కొటి విప్పే ప్రయత్నం చేద్దాం.

Galla jaidev

 

భూములను వెనక్కు తీసుకున్నప్పటి నుండి సైలెంట్ అయ్యారు.

గల్లా జయదేవ్ కు చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలో అమర రాజా బ్యాటరీస్ అనే కంపెనీ ఉంది. ఈ సంస్థకు గతంలో గల్లా కుటుంబం కాంగ్రెస్ లో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు భూములను కేటాయించారు అయితే కాలక్రమేణా వీటిని ఆ పరిశ్రమ అవసరాలకు పెద్దగా వినియోగించుకోకపోవడంతో ఇతర కారణాల రీత్యా, రాజకీయ కారణాల రీత్యా జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఇటీవల ప్రభుత్వం ఆ భూములను మళ్ళీ వెనక్కి తీసుకుంది. దీంతో గల్లా జయదేవర్ కు ఒక రకమైన దెబ్బ పడింది. దీని నుంచి తేరుకునే ప్రయత్నంలో ఉండగా ఆయన కోర్టుకు వెళ్లారు. కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. అంత వరకు బాగానే ఉంది. కానీ జగన్ ప్రభుత్వం తో చీటికి మాటికీ పేచీలు ఎందుకు అని అనుకున్నారో ఏమో రాజకీయంగా తన చురుకుదనం తగ్గించి, జగన్ నిర్ణయాలకు ఎదురెల్లి అమరావతి రాజధాని రైతుల పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొనడం మానేశారు. అక్కడితో ఆగకుండా…

బిజెపితో సంప్రదింపులు మొదలు

తెలుగు దేశం పార్టీ భవిష్యత్తుపై ఆ పార్టీ చాలామంది ఒక రకమైన ఆందోళన ఉంది. వారిలో గల్లా జయదేవ్ కూడా ఒకరు. 2014 ఎన్నికలకు ముందు గల్లా కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరింది. జయదేవ్ గుంటూరు నుంచి ఎంపిగా గెలవగా ఆయన తల్లి గల్లా అరుణ కుమారి చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తూ గల్లా జయదేవర్ పార్టీలో కీలకమైన నాయకుడిగా ఎదిగారు. పార్లమెంట్ లో ఏపీ ప్రత్యేక హోదా అంశంపై మాట్లాడుతూ విభజన హామీలు అంశాలు ఏమి నెరవేర్చలేదు. హామీలను నెరవేర్చలేదని బీజేపీని టార్గెట్ చేస్తూ మిస్టర్ పిఎం, మిస్టర్ పిఎం అంటూ పదే పదే ప్రస్తావిస్తూ దేశం దృష్టిని ఆకర్షించారు. అలా గల్లా జయదేవ్ ఓవర్ నైట్ పొలిటికల్ స్టార్ గా ఎదిగిపోయారు. ఈ క్రమంలోనే ఆయనకు సొంత జిల్లాతో పాటు గుంటూరు పార్లమెంట్ పరిధిలోనూ ఆయనకు స్టార్ డమ్ బాగా పెరిగింది. ఇదే ఊపుతో 2019 ఎన్నికల్లో వైసీపీ గాలి బలంగా వీచిన చూట కూడా ఆయన ఎంపిగా గెలిచేశారు. ఇక రాజకీయంగా తనకు తిరుగు లేదు అనిపించుకున్నారు. ఇదే క్రమంలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఆందోళన రీత్యా ప్రస్తుతం ఆయన బిజెపిలో చేరడానికి సంప్రదింపులు జరుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే బిజెపి అంగీకరిస్తుందా లేదా అనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా మారింది తెర వెనుక ప్రయత్నాలు ఎన్ని చేసినా తెర ముందుకు మాత్రం ఆయన రావడం లేదు. వైసిపి ప్రభుత్వంతో కయ్యం పెట్టుకోవడం ఇష్టం లేకనో, సొంత వ్యాపార లావాదేవీల కారణంగానో సరే పార్లమెంట్ సమావేశాల్లో పోరాడుదాంలే అన్న ధీమాతో గల్లా జయదేవ్ మాత్రం గడిచిన రెండు మూడు నెలల నుంచి ఎక్కడా కనిపించడం లేదు. పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడదామనే కారణం, బిజెపితో తెరవేనుక సంప్రదింపులు ఆయన పరిశ్రమ లావాదేవీలు వ్యవహారంలో భాగంగా తలమునకలై గల్లా జయదేవ్ కనిపించడం మానివేశారని ఆయన అనుచర వర్గం పేర్కొంటోంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju