NewsOrbit
రాజ‌కీయాలు

రాజు గారు ఏం ఫిక్స్ అయ్యారో.. !

 

వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ఇచ్చిన షోకాజ్ నోటీస్ కి స్పందించిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో తనకు ఉన్న పరిచయాల ద్వారా బీజేపీ పెద్దలను కలుస్తున్నారు. దీని వెనుక మంతనాలు ఏమిటో, తతంగం ఏమిటో తెలియాలి.

రఘు రామ కృష్ణం రాజు తొలుత లాక్ సభ స్పీకర్ ఓం బిర్లాతో భేటీ అయ్యారు. సుమారు 50 నిముషాలు అయనతో వివిధ అంశాలపై చర్చించారు. తనకు రక్షణ కల్పించే విషయంపై ప్రధానంగా మాట్లాడినట్లు సమాచారం. దీనిపై తన ఒఎస్డీ ద్వారా హోం శాఖకు సమన్వయం చేస్తున్నట్లు స్పీకర్ చెప్పినట్లు తెలుస్తోంది. అదే విధంగా కమిటీ సమావేశాలు, పార్లమెంట్ సమావేశాల నిర్వహణపై కూడా ఇరువురు చర్చించినట్లు సమాచారం. అనంతరం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో రఘురామ కృష్ణంరాజు సమావేశం అయ్యారు. నేతలతో భేటీ అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ..తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, దీనిపై కేంద్ర సహాయ మంత్రిని కలిసి కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని మరో సారి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఎలక్షన్ కమిషన్ ని కలిసి పార్టీలకు నియమ నిబంధనలను అడిగి తెలుసుకున్నానని చెప్పారు. షోకాజ్ పై ఏవిధంగా సమాధానం ఇవ్వాలనే దానిపై న్యాయ నిపుణుల సూచనలు తీసుకుంటున్నానని రఘు రామ కృష్ణం రాజు తెలిపారు. తాను క్రమశిక్షణ కలిగిన కార్యకర్తననీ, పార్టీని, ముఖ్యమంత్రి ని ఎప్పుడు వ్యతిరేకించలేదు, వ్యతిరేకించబోను అని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ఒకటి రెండు అంశాల్లో సూచనలు మాత్రమే చేసాననీ అన్నారు. ప్రభుత్వానికి తాను చేసింది సూచనలే కానీ విమర్శలు కాదని చెప్పుకొచ్చారు. తనపై తప్పుడు వార్తలు ప్రచురిస్తూ, అవాస్తవలను ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు.

ముఖ్యమంత్రిని కలిసే అవకాశం వస్తుందని అనుకోవట్లేదని అన్నారు. ముఖ్య మంత్రి చాలా బిజీగా గడుపుతున్నారని, తాను సీఎంను కలవడానికి అపాయింట్మెంట్ అడిగాననీ ఇస్తే కలిసి అన్ని వివరిస్తాననీ లేకపోతే సవివరంగా మెయిల్ పంపుతాననీ వెల్లడించారు. సోమవారం కలిసేందుకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా కలిసి తన వర్షన్ వినిపిస్తాననీ రఘు రామ కృష్ణం రాజు తెలిపారు. పార్టీ అధ్యక్షుడికి, తనకు మధ్య అఘాతం సృష్టించేలా కొందరు వ్యవహరిస్తున్నారని అయన ఆరోపించారు. తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసును పార్టీ వెనక్కి తీసుకోవాలని అయన కోరారు.

కాగా, రఘురామ కృష్ణంరాజుకు ఢిల్లీ స్థాయిలో గడిచిన పది సంవత్సరాలుగా కూడా మంచి పరిచయాలు ఉన్నాయి. ఢిల్లీలో బిజెపి నాయకులతో కావచ్చు, కాంగ్రెస్ నాయకులతో కావచ్చు, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పెద్దలతో రఘురామ కృష్ణం రాజుకు మంచి లాబీయింగ్, పరిచయం ఉన్నాయి. పరిచయాల ద్వారా అయన ప్రాంతీయ పార్టీలను లెక్కచేసే వ్యక్తిత్వం కాదు. టీడీపీని గానీ వైసీపీని గానీ ఇతర ఏ ప్రాంతీయ పార్టీని అయన లెక్కచేయరు. ఎందుకంటే అయనకు అంతా జాతీయ స్థాయి పరిచయాలు, ఢిల్లీ స్థాయి వ్యాపారాలు, అక్కడి లాబీయింగ్ అవసరం. కాబట్టి అయన కేవలం ఎంపీగా గెలవడం కోసం ఒక గ్రౌండ్ లెవల్ లో ఒక పార్టీ అవసరం కాబట్టి వైకాపాలోకి వచ్చారు. ఎంపీగా గెలిచారు. గెలిచిన తర్వాత తన స్టయల్ లో కేంద్ర స్థాయిలో లాబీయింగ్ లు చేసుకుంటున్నారు. ఇప్పుడు వైకాపాకు రివర్స్ అవుతున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju