NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

ఫాఫం…! బీజేపీ చేసిన పానకంలో పుడక పవను, బెల్లం జగను..!!

ఫాఫం..!! ఫవన్ కి రాజకీయం ఓ ఫట్టాన అర్ధం కాదు. తెలియదు. అందుకే వేరొకరికి ఎరగా, ఎత్తుగా మారతాడు తప్పితే తనే ఓ ఎత్తు వేయడం, తనే ఏ ఎర వేయడం చేతకావడం లేదు. ఆరేళ్ళ కిందట చంద్రబాబుకి ఎరగా మారాడు. ఏడాది కిందట బీజేపీకి ఎరగా, ఎత్తుగా మారాడు. బీజేపీ వాడకం మామూలుగా ఉండదుగా..! ఒకేసారి అటు జగన్ ని, ఇటు పవన్ ని కలిపి వాడేస్తుంది. తాను చేస్తున్న పానకంలో పవన్ ని పుడకలా.., జగన్ ని బెల్లంలా మార్చేసింది..!

పవన్ కి ఏ దారి దిక్కు..!!

బీజేపీ తీరు వేరు. అది జాతీయ పార్టీ. కేంద్రంలో అధికారం చాలు. రాష్ట్రాల్లో అధికారం వచ్చే దారులు వెతుక్కుంటుంది. రాకపోతే దొడ్డిదారులైనా వెతుకుంటుంది. అక్కడికీ రాకపోతే వ్యవస్థలను వాడుతుంది..! కానీ పవన్ ఏం చేయాలి. జాతీయ పార్టీ కాదు, కనీస రాష్ట్రస్థాయిలో చక్రం తిప్పుతున్న నాయకుడు కూడా కాదు.

తనకు రాష్ట్రమే దిక్కు, రాష్ట్ర రాజకీయమే ఆధారం. పాపం.., అటువంటి దశలో బీజేపీ తన కేంద్ర అవసరాల కోసం పవన్ ని కాదని, జగన్ ని చంకన ఎక్కించుకుంటుంది. మరి ఇప్పటికే ఎన్డీఏలో ముసుగేసుకున్న పవన్ పరిస్థితి ఏమిటి..? జగన్ ని ఎదిరించి, జగన్ పై పోరాడడం ద్వారా రాజకీయంగా ఎదిగేస్తాం అనుకున్న పవన్ కి ఇప్పుడు ఏ దారి..? తాను ఉన్న ఎన్డీఏలోకి జగన్ వస్తే తాను ఎలా తిట్టగలడు? ఎలా పోరాడగలడు..? ఎలా సవాళ్లు చేయగలడు..? ఈ పరిస్థితుల్లో పవన్ కి ఏంటి దిక్కు..? ఏం చేయాలి..?

ఒంటరి పోరాటమే మేలు కదా..!?

పవన్ కి తెలిసో.., తెలియకో బీజేపీతో జత కట్టారు. తనే మోడీకి వారసుడిగా… యోగిగా.., దీక్షాధారుడిగా.., ఫోటోలు, బిల్డప్పులతో తెగ కనిపిస్తున్నారు. నిజానికి బీజేపీ మొత్తం బలం కంటే ఏపీలో తనే బలవంతుడు. బీజేపీతో పొత్తు వలన తనకు నష్టమే తప్ప లాభమేమి ఉండదు. తన వలన బీజేపీనే ఎంతో కొంత లాభపడుతుంది. క్షేత్రస్థాయిలో బీజేపీ బలం కంటే ఎన్నో రేట్లు జనసేన ఉంది. అటువంటి దశలో పవన్ ఎందుకు బీజేపీతో జత కట్టారు అంటే..? తనకు ఓ అండ.., అధికార దర్పం.., కాషాయా నీడ ఉంటుంది. కానీ ఆ నీడ ఇప్పుడు బెడిసికొట్టింది. బీజేపీ అనే కాదు, జాతీయ పార్టీల రాజకీయం ఎప్పుడు కేంద్ర అవసరాలపై ఉంటుంది. ప్రాంతీయ పార్టీల అవసరాలు రాష్ట్రాల పరిధిలో ఉంటుంది. అందుకే కేవలం ఎన్నికల ముందో, వెనుకో ఆ పార్టీలతో పొత్తులు, కలిసి నడకలు ఉండాలి. కానీ పవన్ మాత్రం ముందే కలిసిపోయారు.

జగన్ తో కలవగలరా..??

జగన్ తో పవన్ కలవగలరా..? పరోక్ష స్నేహితుడుగా ఉండగలరా..? అంటే కష్టమే కదా..!! “ఎన్నికలకు ముందే జగన్ తో సవాల్ చేశారు. మళ్ళి జన్మ ఎత్తినా జగన్ సీఎం కాలేడు అంటూ శాసనాలు రాశారు. టీడీపీ కంటే ఎక్కువగా.., ఒకరకంగా టీడీపీ వాదిగా జగన్ ని విమర్శించారు. ఎన్నికలయ్యాక.., జగన్ సీఎం అయ్యాక కూడా ప్రతీ నిర్ణయాన్ని తప్పు పడుతూ అచ్చమైన ప్రతిపక్ష పాత్రలో ఉన్నారు. కానీ తన మిత్రుడు బీజేపీ మాత్రం పవన్ ని అదుపు చేస్తూ.., జగన్ తో చీకటి రాజకీయం నడుపుతుంది. ఇక ఆ చీకటి వెలుగులోకి రావాల్సిన అవసరం వచ్చేసింది. ఆ వెలుగుని పవన్ అంగీకరించే పరిస్థితి లేదు. అలా అని టీడీపీతో కలిసి వెళ్లే పని లేదు. అందుకే పవన్ అనే నాయకుడు ఇప్పుడు ఆ చేతిలో సినిమాలు త్వరగా చేసుకుని.., ఇంకో కూరని వెతుక్కోవాలి.. మళ్ళి కరివేపాకుగా మారడానికి..!! ఇంకెవరైనా పానకం చేస్తుంటే వెళ్ళాలి..! పుడకగా మారడానికి..!!

 

 

 

 

 

author avatar
Srinivas Manem

Related posts

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N