NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఇంటరెస్టింగ్ : కొల్లు రవీంద్ర బయటకి రాగానే ఏం జరగబోతోంది ?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారంలో ఉన్న‌ వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు, మచిలీపట్నం మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ మోకా భాస్కరరావు హత్య కేసులో నిందితుడు అయిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు బెయిల్ దొరికింది.

14 షరతులు, లక్ష రూపాయల పూచీకత్తుతో కృష్ణా జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కొల్లు రవీంద్రకు బెయిల్ మంజూరైన నేప‌థ్యంలో ఏం జ‌ర‌గ‌బోతోంద‌నే చ‌ర్చ తెర‌మీద‌కు వ‌చ్చింది.

చేప‌ల మార్కెట్ వ‌ద్ద ప‌ట్ట‌ప‌గ‌లే….

ఈ ఏడాది జూన్ 29న మచిలీపట్నం చేపల మార్కెట్‌ వద్ద పట్టపగలు వైఎస్సార్‌సీపీ నేత మోకా భాస్కరరావును దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో చింతా నాంచారయ్య (చిన్ని), చింతా నాంచారయ్య (పులి), చింతా నాగమల్లేశ్వరరావు, చింతా వంశీకృష్ణ, పోల రాము, ధనలతో పాటు ఓ మైనర్‌ను అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో కుట్ర దారునిగా పేర్కొంటూ మాజీ మంత్రి కొల్లు రవీంద్రను ఏ–4 నిందితుడిగా అరెస్ట్‌ చేశారు. అయితే, ఆయ‌న పోలీసుల‌కు దొర‌క‌లేదు. కారులో విశాఖ వెళ్తూండగా తూర్పు గోదావరి జిల్లా పోలీసులు ఆయన్ను తునిలో అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం ఆయన రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు.

మాజీ మంత్రి బ‌య‌ట‌కు వ‌స్తే ఏం జ‌రుగుతుందంటే….

అయితే, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బెయిల్‌ పిటిషన్లు ప‌లు మార్లు దాఖ‌లు చేసుకున్నారు. అయితే, మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర‌ బయటికి వస్తే కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ) వాదనల‌తో న్యాయమూర్తి ఏకీభవించారు. అతనికి బెయిల్‌ ఇవ్వరాదని తేల్చి చెప్పారు. కొల్లు రవీంద్రతో పాటు మిగతా నిందితులకు కూడా కూడా కోర్టు బెయిల్‌ నిరాకరించింది. తాజాగా ఆయ‌న‌కు కృష్ణా జిల్లా కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది.

ష‌ర‌తులు పెట్టినందుకే….

మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు 14 షరతులతో, లక్ష రూపాయలు పూచికత్తుతో ఆయనకు కోర్ట్ బెయిల్ మంజూరు చేసిన నేప‌థ్యంలో, కోర్టు ఆదేశాలతో మంగ‌ళ‌వారం జైలు నుండి విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇదిలాఉండ‌గా, విజ‌య‌వాడ‌లోనే ఉండాల‌నే ష‌ర‌తుల నేప‌థ్యంలో ఆయ‌న్ను టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు క‌లుస్తారా లేక‌పోతే పార్టీ నేత‌ల‌తో స‌మావేశం ఉంటుందా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది.

author avatar
sridhar

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!