NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఆ నగరానికి ఏమైంది! ఏమిటీ నేరాలు.. ఘోరాలు?

బెజవాడ నగరంలో ఒక్కసారిగా తుపాకులు పేలాయి ..పెట్రోలు మంటలు ఎగిసి పడ్డాయి… రెండు రోజుల వ్యవధిలో రెండు ఘోరమైన నేరాలు జరిగిపోయాయి. ఇటీవలి కాలంలో కామ్ గా ఉన్న బెజవాడ ఉన్నట్టుండి క్రైమ్ హాట్స్పాట్ గా ఎందుకు మారిపోయింది?ఆ నగరానికి ఏమైంది ?

What happened to that city! What are crimes .. atrocities
What happened to that city! What are crimes .. atrocities

అన్నదే ఇప్పుడు అందరినీ ఆందోళన గురిచేస్తున్న అంశం.రెండు మూడు నెలల క్రితం రెండు గ్యాంగ్ స్టర్ ముఠాలు నడిరోడ్డు మీదే కొట్టుకుని ఒక యువకుడిని హత్య చేయటం తెలిసిందే.ఆ తర్వాత అలాంటి సంఘటనలు జరగలేదు.నగరంలో కి అదుపులోకి వచ్చిందని అందరూ భావిస్తున్న తరుణంలో శనివారం రాత్రి పోలీస్ కమిషనరేట్ ఉద్యోగి మహేష్ ను నున్న సమీపంలోని మామిడి తోటల్లో దుండగులు తుపాకీ తో కాల్చి చంపారు. సరే …ఇందుకు దారితీసిన కారణాలు, ఇతర వివరాలను పక్కనబెడితే ఒక ముఠా కారులో తుపాకీతో సంచరిస్తూ ఏకంగా పోలీసు శాఖ ఉద్యోగిని కాల్చి చంపిన విషయం చిన్నది కాదు.

What happened to that city! What are crimes .. atrocities
What happened to that city What are crimes atrocities

విజయవాడ లాంటి మహా నగరంలో పోలీసు శాఖ ఎంత అప్రమత్తంగా ఉందో ఈ సంఘటన చెప్పకనే చెపుతోంది.ఇది జరిగి రెండు రోజులు కాకముందే సోమవారం రాత్రి ఒక యువతిని అదే విజయవాడలో నడి రోడ్డు మీద మరో యువకుడు పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు.ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేసి ఆ యువతి కాదనడంతో సదరు యువకుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.కృష్ణా జిల్లా విస్సన్నపేటకు చెందిన చిన్నారి అనే యువతి ఒక ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుండగా ఆమె వెంట పడి నాగభూషణం అనే యువకుడు వేధింపులకు గురిచేశాడు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు నాగభూషణానికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో ఆమె ఫిర్యాదును ఉపసంహరించుకుంది.

ఆయితే పోలీసుల ముందు నటించిన నాగభూషణం చిన్నారిపై ఇంకా కోపం పెంచుకున్నాడు తన ప్రేమను కాదనడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేయడాన్ని అవమానకరంగా భావించి సోమవారం రాత్రి చిన్నారి ఆస్పత్రి నుండి విధులు ముగించుకుని వస్తుండగా మార్గ మధ్యంలో అడ్డగించి నాగభూషణం ఆమెపై పెట్రోలు పోసి తగలబెట్టేశాడు.అక్కడికక్కడే మంటల్లో చిన్నారి బుగ్గిఅయిపోయింది.నాగభూషణం కూడా తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు.ఈ రెండు సంఘటనలు విజయవాడ పోలీసుల శక్తి సామర్ధ్యాలను శంకించేవిగా ఉన్నాయడంలో అతిశయోక్తి ఏ మాత్రం లేదు.పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే ఇలాంటి నేరాలు జరుగుతుంటే ఇక వాటిని ఆపేదెవరు?

author avatar
Yandamuri

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju