NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీలో ఏదో జరుగుతుంది..! పార్టీ వీడుతానంటున్న సీనియర్ ఎమ్మెల్యే..!?

YSRCP: Another MP turned as Rebal

టీడీపీ నుండి వైసీపీకి ఎమ్మెల్యేలు జంప్ అవ్వడం ఇప్పటి వరకు చూసాం..! బట్ ఫర్ ఆ చేంజ్… ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే టీడీపీ లేదా బీజేపీలో చేరడానికి సిద్ధపడుతున్నారట. అధికార పార్టీలో అంతర్గత రాజకీయాలు.., పార్టీ పెద్దలు పట్టించుకోకపోవడం.., జిల్లాలో కొందరు నేతల పెత్తనం.. తట్టుకోలేక ఆయన పార్టీని వీడేందుకు సిద్ధపడుతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే సీఎం జగన్ కూడా దీన్ని తేలిగ్గా వదలడం లేదు. ఆయన స్థాయిలో ఓ కీలక నివేదిక సిద్ధం చేసుకుని.., త్వరలోనే ఎమ్మెల్యేలతో భేటీ అవుతారని సమాచారం. ఇంతకూ పార్టీని వీడుతానంటున్న ఎమ్మెల్యే ఎవరు..? ఏమైంది..? ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం జగన్ ప్రణాళికలు ఏమిటి అనేది చూద్దాం..!!

నెల్లూరు జిల్లాలో వైసీపీలో అంతర్గత రాజకీయాలు జోరుగా ఉన్నాయి. ఇద్దరు మంత్రులు.. సీనియర్ ఎమ్మెల్యేలు జిల్లాలో చక్రం తిప్పుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు సీనియర్ ఎమ్మెల్యేలకు పార్టీలో పెద్దగా ప్రాధాన్యత లభించడం లేదనే వాదన ఉంది. ఈ నేపథ్యంలోనే ఆనం రామనారాయణరెడ్డి లాంటి సీనియర్ ఎమ్మెల్యే కొంతకాలం కిందట అసమ్మతి స్వరం వినిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ఎమ్మెల్యే పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. మరో ట్విస్టు ఏమిటంటే.. ఆయనను పార్టీ నుండి తరిమేయడానికి పార్టీలోని కొందరు నాయకులే పొమ్మనలేక పొగపెడుతున్నారని కూడా జిల్లాలో చర్చ జరుగుతుంది. ఈయన ఎక్కువగా అవినీతికి పాల్పడుతున్నారు, కమీషన్లు ఎక్కువ అడుగుతున్నారు అంటూ వైసీపీ కార్యకర్తలే ఇటీవల ఆయన నివాసం వద్ద ధర్నా చేయడం కొసమెరుపు.

cm jagan to focus on ysrcp social media wing
cm jagan to focus on ysrcp social media wing

బీజేపీ లేదా టీడీపీ.. ఆపై ఎంపీగా..!!

సదరు ఎమ్మెల్యే గతంలో ఎంపీగానూ పని చేసారు. 2014 లో వైసీపీ నుండి గెలిచారు. 2019 లో మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు పార్టీలో అంతర్గత కారణాలతో పార్టీని వీడి.., టీడీపీ లేదా బీజేపీ కి వెళ్లి మళ్ళీ తాను ఎంపీగా గెలిచినా నియోజకవర్గం నుండి ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్నారట. ఈ మేరకు బీజేపీ పెద్దలతో చర్చలు కూడా జరిపారని జిల్లాలో చర్చ జరుగుతుంది. అయితే అధికారంలో ఉంటూ.., ఎమ్మెల్యేగా హోదాను అనుభవిస్తూ రాజీనామా చేసి.., పార్టీ మారి, మళ్ళీ ఎంపీగా పోటీ చేయడం అంటే అతి పెద్ద రిస్కు. సో.., ఈ పుకార్లలో అంత నిజాలు లేకపోవచ్చు కానీ…, ఆయన పార్టీపై అసంతృప్తిగా ఉండడం.., పార్టీ ఈయనపై అసంతృప్తిగా ఉండడం మాత్రం నూటికి నూరుపాళ్లు వాస్తవమే.!

జగన్ దగ్గర జాబితా..!?

అయితే ఇవన్నీ సీఎం జగన్ కి తెలియక కాదు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే ఏడాదిన్నర గడుస్తుంది. ఇప్పటికే మూడు దశల్లో నిఘా వర్గాల ద్వారా జిల్లా స్థాయిలో కీలక సమాచారం సేకరించారు. జిల్లాల్లో ఎమ్మెల్యేల పనితీరు, అవినీతి ఆరోపణలు, ప్రజల్లో ఉన్న అభిప్రాయం తదితర వివరాలను సేకరించి పెట్టుకున్నారు. సంక్రాంతి తర్వాత నుండి జగన్ పార్టీపై కూడా దృష్టి పెట్టి వారానికి ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేతో మాట్లాడతారని అంటున్నారు. అవినీతిలో, అసంతృప్తిలో ముందున్న ఎమ్మెల్యేలు… ప్రజలకు దూరంగా ఉంటున్న ఎమ్మెల్యేలను మొదటి దశలో పిలిపించి నేరుగా మాట్లాడతారని సమాచారం. ఎవరెవరు పక్క పార్టీలతో టచ్ లో ఉన్నారు..? ఎవరు కోవర్టులుగా ఉన్నారు..? ఎవరు అసంతృప్తిని వినిపిస్తున్నారు..? ఎవరు చెడు ప్రచారం చేస్తున్నారు..? అనే దిశలో ఓ కీలక నివేదికను ఇప్పటికే సిద్ధం చేశారు.

 

author avatar
Srinivas Manem

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!